హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu: తెలంగాణ రాజకీయాల్లో మరో ట్విస్ట్​.. మునుగోడు ఉప ఎన్నికపై ప్రియాంకాగాంధీ ఫోకస్​.. 

Munugodu: తెలంగాణ రాజకీయాల్లో మరో ట్విస్ట్​.. మునుగోడు ఉప ఎన్నికపై ప్రియాంకాగాంధీ ఫోకస్​.. 

ప్రియాంకా గాంధీ వాద్రా (File)

ప్రియాంకా గాంధీ వాద్రా (File)

తెలంగాణ రాజకీయాల్లో ఓ ట్విస్ట్​ చేరింది. తెలంగాణ రాజకీయాలకు ఇప్పటివరకు దూరంగా ఉన్న ప్రియాంకాగాంధీ మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రంగంలోకి దిగారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Nalgonda, India

  మునుగోడు (Munugodu) కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) రసవత్తరంగా మారాయి. పోటాపోటీ బహిరంగ సభలతో ఉపఎన్నికల వేడి అప్పుడే రాజుకుంది. ఇప్పటికే మునుగోడు (Munugodu Bypoll)లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ ఏర్పాటు చేసింది. శనివారమే టీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్ ప్రజా వేదిక పేరిట​ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఇక నేడు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా మునుగోడుకు రానున్నారు. బహిరంగ సభలో పాల్గొననున్నారు. అయితే ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాల్లో ఓ ట్విస్ట్​ చేరింది. తెలంగాణ రాజకీయాలకు ఇప్పటివరకు దూరంగా ఉన్న కాంగ్రెస్ (Congress)​ నాయకురాలు ప్రియాంకాగాంధీ (Priyanka gandhi) మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రంగంలోకి దిగారు.

  ప్రియాంక ఉప ఎన్నికలపై ఫోకస్‌ పెట్టారు. టీ కాంగ్రెస్‌ ( T Congress) ముఖ్య నేతలు ఢిల్లీకి రావాలని అధిష్టానం ఆదేశించింది. ఈ క్రమంలో ప్రియాంక గాంధీ, వేణుగోపాల్‌, మాణిక్యం ఠాగూర్‌ నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కాగా, మునుగోడు ఉప ఎన్నికపై అధిష్టానం వ్యూహరచన చేయనుంది.

  కాంగ్రెస్​లో పెరిగిన అసంతృప్తులు..

  తెలంగాణ కాంగ్రెస్‌కు కష్టాలు పెరుగుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తీరుకు వ్యతిరేకంగా అనేక మంది నేతలు గళమెత్తుతున్నారు. పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వంటి నేతలు అసంతృప్తి గళాలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ (Congress) అధిష్టానానికి లేఖలు కూడా రాస్తున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ఈ అంశంపై పార్టీ నాయకత్వానికి వివరించేందుకు సోనియా, రాహుల్ అపాయింట్‌మెంట్ కూడా అడిగారు. దీంతో మునుగోడు(Munugodu) ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన కాంగ్రెస్ పార్టీలో కల్లోలం చెలరేగినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో అసంతృప్తి గళాలు ఎందుకు పెరుగుతున్నాయనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  Aasara Pesions: పింఛన్​లు ఆగస్టు 15నే ఇస్తానన్నారు కదా? ఏమైంది? : TRS​ ప్రభుత్వంపై విజయశాంతి సెటైర్లు

  ప్రస్తుతం కాంగ్రెస్‌లో తీవ్రమైన అసంతృప్తి గళాలు వినిపిస్తున్న వారంతా బీజేపీలోకి వెళ్లడం దాదాపు ఖాయమనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల్లో తమ ప్రధాన పోటీ టీఆర్ఎస్‌తోనే అని భావిస్తున్న బీజేపీ నాయకత్వం.. కాంగ్రెస్ పార్టీ బలమైన పోటీ ఇవ్వడం వల్ల అది తమకు నష్టం కలిగిస్తుందనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపడకుండా ఉండేందుకు కూడా బీజేపీ నేతలు తమదైన శైలిలో వ్యూహలను అమలు చేస్తున్నారని.. అందులో భాగంగానే కాంగ్రెస్‌లో కొత్తగా కొంతమంది అసంతృప్తి గళాలు వినిపిస్తున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ప్రియాంకా గాంధీ మునుగోడుపై ఫోకస్​ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్​ శ్రేణుల్లో కొంత ఆశావాహ దృక్ఫథం కన్పిస్తోంది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Congress, Munugodu By Election, Priyanka Gandhi

  ఉత్తమ కథలు