హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : BRSలో ఉద్యమాల జిల్లా నేతలకు ప్రాధాన్యత ..నెక్స్ట్ కేసీఆర్‌ పోటీ చేసేది అక్కడి నుంచేనా..!

Telangana : BRSలో ఉద్యమాల జిల్లా నేతలకు ప్రాధాన్యత ..నెక్స్ట్ కేసీఆర్‌ పోటీ చేసేది అక్కడి నుంచేనా..!

KCR LATEST

KCR LATEST

Telangana: బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్‌ పార్టీలో ఉద్యమానికి అండగా నిలిచిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా నేతలకు ప్రాధాన్యత కలగనుంది. జాతీయస్థాయిలో నియమించనున్న రాజకీయ సమన్వయకర్తల్లో పెద్దపీట వేసే అవకాశముందని తెలుస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (P.Srinivas,New18,Karimnagar)

  తెలంగాణ సీఎం కేసీఆర్(KCR)బుధవారం జాతీయ పార్టీని ప్రకటించారు. నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితిగా పార్టీ ఇకపై భారతీయ రాష్ట్ర సమితిగా మారనుంది. గులాబీ జెండాలో మార్పులేదు. జాతీయ స్థాయిలో తీసుకోబోయే నిర్ణయాలను పార్టీ విధివిధానాలను పార్టీ అధినేత బుధవారం(Wednesday)ప్రకటించారు. మంత్రులు , ఎంపీలతో పాటు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులతో తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో  నిన్న సమావేశాన్ని నిర్వహించారు. జాతీయ పార్టీగా మార్పుపై 283 మంది టీఆర్ఎస్(TRS) సభ్యులతో విస్తృతస్థాయి తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు .ఈ సమావేశానికి మంత్రులు , ఎమ్మెల్యేలు , జడ్పీ చైర్మన్లు , మేయర్లు , పార్టీ రాష్ట్ర కమిటీలో ఉన్న నేతలు , ఎమ్మె ల్సీ , ఎంపీలు హాజరయ్యారు.

  Errabelli Dayakar rao : TRSకు కేసీఆర్ పెట్టిన BRS పేరును మార్చేసిన మంత్రి ఎర్రబెల్లి .. ఇప్పుడదే పెద్ద రచ్చవుతోంది

  ఉద్యమాల జిల్లాకు ప్రాధాన్యత..

  ఉద్యమానికి అండగా నిలిచిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా నేతలకు జాతీయస్థాయిలో నియమించనున్న రాజకీయ సమన్వయకర్తల్లో పెద్దపీట వేసే అవకాశముందని తెలుస్తోంది. జిల్లా మాజీ ఎంపీ ప్రస్తుతం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ , మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు , మంత్రి గంగుల కమలాకర్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి కనీసం ఇద్దరికి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమానికి నాంది ప్రస్తావనగా పేర్కొనే సింహగర్జన సభను , సకల జనుల సమ్మె సైరన్‌ను కరీంనగర్‌లోనే నిర్వహించారు. కరీంనగర్ కళోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని గుర్తు చేయడమే కాదు జాతీయ పార్టీకి అండగా నిలవాలని పిలుపు నిచ్చారు.

  కరీంనగర్ సెంటిమెంట్..

  కరీంనగర్ జిల్లా కేసీఆర్‌కు సెంటిమెంట్ జిల్లా. ఇక్కడ నుంచే ఆయన నిరవధిక నిరాహార దీక్ష కోసం తరలి వెళ్తుండగా అల్గునూరు చౌరస్తాలో అరెస్టు చేసి ఖమ్మం అటు తర్వాత హైదరాబాద్ కు తరలించారు . తెలంగాణ ఉద్యమకాలంలో రాజకీయ మేధోమధ న సదస్సు , సకల జనుల సమ్మె ప్రారంభ సమావేశం కూడా ఈ జిల్లాలోనే నిర్వ హించారు. ఎంపీగా కరీంనగర్ నియోజ కవర్గం నుంచే గెలుపొంది జాతీయ రాజకీయాల్లో ఆరంగేట్రం చేసిన కేసీఆర్ కేంద్రమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వ హించారు.

  Farmers Problems : మొక్కజొన్న రైతులను నిండా ముంచిన భారీ వర్షాలు .. పెట్టుబడి రావడం కష్టమేనంటూ ఆవేదన

  గులాబీ బాస్‌ మళ్లీ ఇక్కడి నుంచే పోటీ ..

  ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథకాలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. రైతుబంధు , రైతు బీమా , దళిత బంధు పథకాలను జిల్లా నుంచే ప్రారంభించారు . ఆ పథకాలే ఇప్పుడు కేసీఆర్‌కు, టీఆర్ఎస్ కు జాతీయ స్థాయిలో కలిసివచ్చే అంశాలుగా మారాయి .కరీంనగర్లో ప్రవేశపెట్టిన పథకాలు కలిసి రావడంతో సెంటిమెంట్ జిల్లా అయిన కరీంనగర్ నుంచే ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. 2004 లో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఎంపీ పదవికి రాజీ నామా చేయగా 2006 , 2008 లో ఉప ఎన్నికలు రాగా కేసీఆర్ విజయం సాధించి తెలంగాణ సాధన దిశగా ఉద్యమాన్ని ఉధృతం చేయగలిగారు. ఈ క్రమంలోనే ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జాతీయ పార్టీ ప్రకటనవేళ విస్తృతమైంది . కేసీఆర్ గాని , ఆయనకు కుడిభుజంగా వ్యవహరిస్తున్న వినోదుమార్ గాని ఈ నియోజకవర్గం నుంచే పోటీచేసే అవకాశాలున్నాయి. గురువారం ఎన్నికల కమిషన్‌కు పంపే డెలిగేట్స్ లిస్టులో మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఉండటం విశేషంగా చూడాలి.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Karimnagar, Telangana Politics, TRS leaders

  ఉత్తమ కథలు