హోమ్ /వార్తలు /తెలంగాణ /

Pm Modi: ప్రధాని మోదీతో బీజేపీ కార్పొరేటర్ల భేటీ.. అవన్నీ చెబుతారా ? అంత సీరియస్‌గా తీసుకున్నారా ?

Pm Modi: ప్రధాని మోదీతో బీజేపీ కార్పొరేటర్ల భేటీ.. అవన్నీ చెబుతారా ? అంత సీరియస్‌గా తీసుకున్నారా ?

హైదరాబాద్, ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

హైదరాబాద్, ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

PM Modi| Hyderabad: హైదరాబాద్‌లో నిర్వహించనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయాలనే ఆలోచనలో ఆ పార్టీ నాయకత్వం ఉంది.

తెలంగాణపై బీజేపీ సీరియస్‌గా ఫోకస్ చేసింది. ప్రధాని నరేంద్రమోదీ మొదలు... తెలంగాణలోని ఆ పార్టీ ముఖ్యనేతల వరకు అంతా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కార్పొరేటర్లకు ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రేటర్ పరిధిలోని 46 మంది కార్పొరేటర్లు(GHMC BJP Corporators) .. మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం వీరు ప్రధాని నరేంద్రమోదీతో(PM Narendra Modi) సమావేశం కానున్నారు. కొద్దిరోజుల క్రితం ఐఎస్‌బీ స్నాతకోత్సవం కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీతో మాట్లాడేందుకు కార్పొరేటర్లు ప్రయత్నించారు. అయితే అప్పుడు వారికి ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ లభించలేదు.

అయితే ఈ విషయాన్ని కొందరు నేతలు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లడంతో.. వాళ్లను ఢిల్లీ (New Delhi) తీసుకురావాలని ప్రధాని మోదీ పార్టీ నేతలకు సూచించారు. బుధవారం వీరికి అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో.. జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లలో ఉత్సాహం నెలకొంది. అయితే ప్రధాని మోదీ వీరితో జరగబోయే సమావేశంలో ఏం మాట్లాడతారు ? ఏ రకమైన దిశానిర్దేశం చేస్తారు ? అనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల గురించే ప్రధాని మోదీ వీరితో ఎక్కువగా ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది.

హైదరాబాద్‌లో నిర్వహించనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయాలనే ఆలోచనలో ఆ పార్టీ నాయకత్వం ఉంది. కేవలం మొక్కుబడిగా ఈ సమావేశాలు నిర్వహించకుండా.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చేయాలని బీజేపీ యోచిస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ కార్పొరేటర్లతో సమావేశం కాబోతున్నారని సమాచారం.

Telangana : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఫ్రీ వైఫై దుర్వినియోగం .. ఏం చేస్తున్నారంటే

Telangana : ఘనంగా రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి ఉత్సవాలు ..పూజలు చేసిన కల్వకుంట్ల కవిత

ఇదే సమయంలో హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందనే విషయాన్ని ఆయన లెక్కలతో సహా కార్పొరేటర్లకు చెప్పబోతున్నారని సమాచారం. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. టీఆర్ఎస్ ఏ రకంగా ఆ నిధులను దుర్వినియోగం చేస్తుందో చెప్పాలని ప్రధాని మోదీ కార్పొరేటర్లకు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ప్రధాని స్థాయి వ్యక్తి.. ఓ నగర కార్పొరేటర్లకు అపాయింట్‌మెంట్ ఇచ్చి కలిసేందుకు సిద్ధపడటంతో.. జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Bjp, GHMC, Pm modi, Telangana

ఉత్తమ కథలు