Home /News /telangana /

TS POLITICS PRIME MINISTER NARENDRA MODI REACHED HYDERABAD HICC FOR THE BJP NATIONAL EXECUTIVE COMMITTEE MEETING SNR

Hyderabad | modi: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ప్రధాని .. డైనమిక్ సిటీకి వచ్చానంటూ మోదీ ట్వీట్

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

Hyderabad | modi: ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ చేరుకున్నారు. హెచ్‌ఐసీసీలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్, మంత్రి తలసాని స్వాగతం పలికారు. తాను డైనమిక్ సిటీ హైదరాబాద్‌కు చేరుకున్నట్లుగా ప్రధాని ట్వీట్ చేశారు.

ఇంకా చదవండి ...
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌(Hyderabad) చేరుకున్నారు. నగరంలోని హెచ్‌ఐసీసీ(HICC)లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో(BJP national executive meeting) పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో బేగంపేట (Begumpet)విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ తమిళిసై(Governor Tamilisai), మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ (Thalasani Srinivas Yadav)బేగంపేట విమనాశ్రయంలో సాదర స్వాగతం పలికారు. ప్రధాని మోదీకి మరికొందరు బీజేపీ జాతీయ నేతలు ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు. అక్కడి నుంచి  ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నేరుగా హెచ్‌ఐసీసీకి చేరుకున్నారు. హెచ్‌ఐసీసీ నుంచి హోటల్ నోవాటెల్‌లో కాసేపు విశ్రాంతి తీసుకొని అక్కడి నుంచి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.

ప్రధాని ట్వీట్ ..
ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ చేరుకున్న విషయాన్ని ట్విట్టర్ (Twitter)ద్వారా పంచుకున్నారు. తాను డైనమిక్ సిటీ(Dynamic city) హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నానంటూ ట్వీట్ చేశారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తామని ట్వీట్‌(Tweet)లో పేర్కొన్నారు ప్రధాని.

18ఏళ్ల తర్వాత..
ఈ జాతీయ కార్యకవర్గ సమావేశాల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా పార్టీని సంస్థాతంగా బలోపేతం చేయడంపై ప్రధాని పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు. శనివారం , ఆదివారం రెండ్రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. రేపు సాయంత్రం 4గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగియగానే ప్రధాని పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. సుమారు 18సంవత్సరాల తర్వాత ఈ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించడం ప్రత్యేకంగా చూడాలి.
Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad, PM Narendra Modi, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు