తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఏర్పాటయ్యి నేటితో 8 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు (Telangana Formation Day) ఘనంగా జరుగుతున్నాయి. ప్రగతి భవన్లోనూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్లో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (CM KCR) జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కేసీఆర్.. ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించారు. అయితే తెలంగాణవాసులకు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు తెలుగు భాషలో ట్విటర్ (Twitter)లో శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఇందులో రాహుల్, మోదీలు ‘‘నా తెలంగాణ’’ అని పలకడం విశేషం.
నా తెలంగాణ అంటూ..
అయితే తెలంగాణవాసులకు ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, నా తెలంగాణా సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు. కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడడంలో పేరు పొందినవారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ప్రపంచ ప్రఖ్యాతి పొందినది తెలంగాణా రాష్ట్ర సంస్కృతి. తెలంగాణా ప్రజల శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను’’ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తెలంగాణకు ఏం చేయట్లేదని పలువురు ప్రశ్నించారు. పలువురు విమర్శిస్తూనే మరికొందరు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, నా తెలంగాణా సోదర, సోదరీ మణులకు శుభాకాంక్షలు. కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడడంలో పేరు పొందినవారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ప్రపంచ ప్రఖ్యాతి పొందినది తెలంగాణా రాష్ట్ర సంస్కృతి. తెలంగాణా ప్రజల శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను.
— Narendra Modi (@narendramodi) June 2, 2022
సోనియా గాంధీ మీ కల నెర్చిన వేళ..
మరోవైపు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ (Congress leader Priyanka Gandhi) కూడా తెలంగాణ ప్రజలక శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను, పోరాటాన్ని గుర్తిస్తూ,దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్తూ,వారి చిరకాల స్వప్నం నిజం చేసిన వేళ, తెలంగాణ అమరవీరులను తలచుకుంటూ.. జై తెలంగాణ! జై కాంగ్రెస్!”అని తెలిపారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
కాంగ్రెస్ పార్టీ మరియు శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను, పోరాటాన్ని గుర్తిస్తూ,దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్తూ,వారి చిరకాల స్వప్నం నిజం చేసిన వేళ, తెలంగాణ అమరవీరులను తలచుకుంటూ..
జై తెలంగాణ! జై కాంగ్రెస్!
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 2, 2022
టీఆర్ఎస్ పాలనలో దారుణమైన పాలన.. రాహుల్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) కూడా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.‘‘తమ పోరాట స్ఫూర్తితో యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమైన నా తెలంగాణ సోదరసొదరీమణులందరికీ #TelanganaFormationDay శుభాకాంక్షలు. ఈ చారిత్రాత్మక రోజున అమరవీరుల, వారి కుటుంబసభ్యుల త్యాగాలను స్మరించుకుందాం’’. ‘‘గత 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పాలనలో దారుణమైన పాలనను చవిచూసింది. #TelanganaFormationDay నాడు, ముఖ్యంగా రైతులు, కార్మికులు, పేదలు & సామాన్య ప్రజలకు శ్రేయస్సును తీసుకురావడంపై దృష్టి సారించిన ఒక మోడల్ రాష్ట్రంగా, ఉజ్వల తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని నేను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను’’ అంటూ రాహుల్ ట్విట్టర్లో తెలిపారు.
తమ పోరాట స్ఫూర్తితో యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమైన నా తెలంగాణ సోదరసొదరీమణులందరికీ #TelanganaFormationDay శుభాకాంక్షలు
ఈ చారిత్రాత్మక రోజున అమరవీరుల, వారి కుటుంబసభ్యుల త్యాగాలను స్మరించుకుందాం.
— Rahul Gandhi (@RahulGandhi) June 2, 2022
ఇలా రాహుల్, మోదీలు నా తెలంగాణ అనడంతో ఇపుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చలు జోరుగా నడుస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Narendra modi, Priyanka Gandhi, Rahul Gandhi, Telangana Formation Day, Tweets