భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Ys Shamrila)కు ఫోన్ చేశారు. షర్మిల (Ys Shamrila)కు ఫోన్ చేసిన మోదీ (Narendra Modi) దాదాపు 10 నిమిషాల పాటు మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే మోదీ ఏ అంశాలపై మాట్లాడారనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. అయితే ఇటీవల నర్సంపేటలో షర్మిల (Ys Shamrila) పాదయాత్రలో చోటు చేసుకున్న పరిణామాలపై మోదీ ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఆమె కారులోనే ఉండగా టొయింగ్ వెహికల్ తో అలాగే లాక్కెళ్లారు. ఈ ఘటనపై మోదీ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా షర్మిల (Ys Shamrila) మోదీని (Narendra Modi) కలవాలని చెప్పగా..ఢిల్లీకి రావాలని సూచించినట్టు తెలుస్తుంది.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Ys sharmila) చేపట్టిన పాదయాత్ర నర్సంపేటకు చేరుకోగానే అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె కాన్వాయ్, ప్రచార రథంపై దాడి చేశారు. దీనితో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి లోటస్ పాండ్ లో వదిలేశారు. ఆ తరువాతి రోజు లోటస్ పాండ్ నుండి బయటకు వచ్చి ప్రగతి భవన్ వైపు వెళ్తున్న Ys షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. పర్యటనలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో దెబ్బతిన్న కారును నడుపుకుంటూ షర్మిల ప్రగతి భవన్ వైపు వెళ్లబోయారు. ఈ క్రమంలో పోలీసులు సోమాజిగూడ వద్ద ఆమె వాహనానికి పోలీసులు వాహనాలను అడ్డుపెట్టారు. దీనితో ఆమె కారు అద్దాలను లాక్ చేసుకుని కారులోనే ఉన్నారు. ఆమెను బయటకు తీసుకురావాలని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీనితో పోలీసులు ఆమె కారులోనే ఉండగానే టొయింగ్ వెహికల్ తో SR నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం అక్కడ కూడా హైడ్రామా నెలకొంది. పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఆమె కారు డోర్ తీయకుండా అలాగే ఉండిపోయింది. దీనితో పోలీసులు కష్టతరం మీద లాఠీ సహాయంతో డోర్ అన్ లాక్ చేశారు. అనంతరం కారులో ఉన్న అందరిని అరెస్ట్ చేశారు. మహిళా పోలీసులు షర్మిలను (Ys Sharmila) స్టేషన్ లోపలికి తరలించారు. అనంతరం షర్మిలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగించినందుకు, విధుల్లో ఉన్న అధికారులకు విఘాతం కలిగించినందుకు షర్మిలపై (Ys Sharmila) ఐపీసీ సెక్షన్లు 333, 337, 353 కింద కేసు నమోదు చేశారు.
షర్మిల సంచలన ఆరోపణలు..
నాకు ప్రాణహాని ఉంది. నా పార్టీ పైకి రాకుండా ఉండేందుకు కేసీఆర్ , ఆయన గుండాలు కుట్రలు చేస్తున్నారని ఇటీవల షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. పాదయాత్ర చేయనీయకూడదని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. మా వాహనాలను తగులబెట్టి మమ్మల్నే సారీ చెప్పమంటారా? ఆ వాహనాలను సీఎం కేసీఆర్కు చూపించేందుకు వెళ్తుంటే.. ట్రాఫిక్ ఉల్లంఘనల కింద అరెస్ట్ చేసి.. రిమాండ్ కోరారు. కోర్టు నుంచి అనుమతులు ఉన్నా.. నా పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారు. ఇది నియంత పాలన. వీరి గొయ్యి వీరే తవ్వుకుంటున్నారు. ప్రజలకు అంతా అర్ధమవుతోంది. బండి సంజయ్ యాత్ర సజావుగానే సాగుతుంది. నా యాత్రను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారు. వారిది తాలిబాన్ల భాష. వాళ్ల పార్టీ తాలిబన్ రాష్ట్ర సమితి అని షర్మిల అన్నారు.
అయితే ఈ ఘటనల తరువాత షర్మిలను బీజేపీనే పంపించిందని టీఆర్ఎస్ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. షర్మిల బీజేపీ దత్తపుత్రిక అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ పరిణామాల తరువాత స్వయంగా ప్రధాని మోదీ షర్మిలకు ఫోన్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Narendra modi, Telangana, Telangana News, YS Sharmila