హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR-Prashant Kishor: టీఆర్ఎస్‌తో ప్రశాంత్ కిశోర్ కటీఫ్.. అసలు కారణం అదేనా ?

KCR-Prashant Kishor: టీఆర్ఎస్‌తో ప్రశాంత్ కిశోర్ కటీఫ్.. అసలు కారణం అదేనా ?

కేసీఆర్, పీకే (ఫైల్ ఫోటో)

కేసీఆర్, పీకే (ఫైల్ ఫోటో)

TS Politics: తాజాగా ప్రశాంత్ కిశోర్‌ నేతృత్వంలోని ఐప్యాక్ టీమ్.. టీఆర్ఎస్‌తో తెగతెంపులు చేసుకున్నట్టు తెలుస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించి వారికి విజయాలు తెచ్చిపెట్టడంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. కొంతకాలంగా తెలంగాణలో టీఆర్ఎస్ కోసం పని చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి ఈ మేరకు ఆయన అనేకసార్లు చర్చలు కూడా జరిపారు. అయితే తాజాగా ప్రశాంత్ కిశోర్‌ నేతృత్వంలోని ఐప్యాక్ టీమ్.. టీఆర్ఎస్‌తో తెగతెంపులు చేసుకున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీ కోసం పని చేయాలని టీఆర్ఎస్ ప్రశాంత్ కిశోర్ టీమ్‌కు కోరినట్టు సమాచారం. అయితే తాము టీఆర్ఎస్ కోసం కేవలం రాష్ట్రస్థాయిలోనే పని చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఐప్యాక్‌ సేవలను కేవలం రాష్ట్రస్థాయి కోసమే వినియోగించుకోవడం పట్ల టీఆర్ఎస్ విముఖతగా ఉందని.. అందుకే టీఆర్ఎస్, ఐప్యాక్ మధ్య డీల్ రద్దు అయినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  జాతీయస్థాయిలో కాంగ్రెస్‌తో కలిసి బీజేపీ వ్యతిరేక కూటమితో కలిసి పని చేయాలనే ఆలోచనలో ప్రశాంత్ కిశోర్ టీమ్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి టీఆర్ఎస్‌తో ఐప్యాక్ టీమ్ బంధం ముగిసిపోయిందనే చర్చ కొద్దిరోజుల నుంచే సాగుతోంది. తెలంగాణలోని తమ టీమ్‌లను ఐప్యాక్ బృందం ఏపీకి తరలించడం కొద్దిరోజుల క్రితమే మొదలుపెట్టింది.

  ఏపీలో గతంలో వైసీపీ విజయం కోసం పని చేసిన ఐప్యాక్ టీమ్.. వచ్చే ఎన్నికల్లోనూ ఆ పార్టీ విజయం కోసం పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అదే సమయంలో తెలంగాణలో టీఆర్ఎస్ కోసం పని చేసేందుకు సిద్ధమైంది. అయితే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపాదనకు ప్రశాంత్ కిశోర్ నో చెప్పడంతో.. టీఆర్ఎస్‌తో కుదిరిన అవగాహనను ప్రశాంత్ కిశోర్ టీమ్ రద్దు చేసుకున్నట్టు ప్రచారం మొదలైంది.

  అయితే ఇందుకు సంబంధించి అటు టీఆర్ఎస్ నుంచి, ఇటు ఐప్యాక్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కేసీఆర్ త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో.. రాజకీయ పార్టీలకు విజయాలను తెచ్చే పెట్టే వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్ టీఆర్ఎస్‌తో కటీఫ్ చెప్పారనే వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Prashant kishor, Telangana

  ఉత్తమ కథలు