హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR| Bengaluru: కేసీఆర్‌ బెంగళూరు టూర్‌లో ఆయన మిస్సింగ్.. ఇక అంతేనా ?

KCR| Bengaluru: కేసీఆర్‌ బెంగళూరు టూర్‌లో ఆయన మిస్సింగ్.. ఇక అంతేనా ?

కేసీఆర్ (ఫైల్ ఫోటో)

కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana News: కర్ణాటక ప్రకాశ్ రాజ్ సొంత రాష్ట్రం. దీంతో కేసీఆర్ కర్ణాటక టూర్‌లో ప్రకాశ్ రాజ్ కనిపిస్తాడేమో అని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.

తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్లీ ఇతర రాష్ట్రాల టూర్లు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే గురువారం బెంగళూరు వెళ్లారు. అక్కడ జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవేగౌడతో పాటు ఆయన కుమారుడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. రెండు మూడు నెలల్లో సంచలనం ఉంటుందని కేసీఆర్ తన బెంగళూరు పర్యటన సందర్భంగా ప్రకటించారు. దీంతో ఆయన చెప్పిన సంచలనం ఏమై ఉంటుందనే దానిపై చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే.. కేసీఆర్(KCR) బెంగళూరు(Bengaluru) పర్యటనలో ఈసారి ప్రకాశ్ రాజ్ (Prakash Raj) కనిపించలేదు. గతంలో కేసీఆర్ కర్ణాటక, మహారాష్ట్రల్లో పర్యటించిన సమయంలో ఆయన వెంట ప్రకాశ్ రాజ్ కనిపించారు. దీంతో ప్రకాశ్ రాజ్ జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌కు తోడుగా ఉంటారని అంతా భావించారు.

ఈ క్రమంలోనే ఆయనను సీఎం కేసీఆర్ రాజ్యసభకు ఎంపిక చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ అలా జరగలేదు. దీంతో అసలు టీఆర్ఎస్‌లో ప్రకాశ్ రాజ్ పాత్ర ఏమిటన్న దానిపై మరోసారి చర్చ మొదలైంది. ప్రకాశ్ రాజ్ విషయంలో జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని.. టీఆర్ఎస్ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఆయనకు ఏ రకమైన పాత్ర ఇవ్వడం లేదనే వార్తలు కూడా మొదలయ్యాయి. ఇందుకు తగ్గట్టుగానే కేసీఆర్ బెంగళూరు పర్యటనలో ప్రకాశ్ రాజ్ కనిపించలేదు.

నిజానికి కర్ణాటక ప్రకాశ్ రాజ్ సొంత రాష్ట్రం. దీంతో కేసీఆర్ కర్ణాటక టూర్‌లో ప్రకాశ్ రాజ్ కనిపిస్తాడేమో అని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. దీంతో టీఆర్ఎస్‌కు ప్రకాశ్ రాజ్ దూరంగా ఉండబోతున్నారా ? అనే టాక్ మొదలైంది. ఒకవేళ ప్రకాశ్ రాజ్ కనుక కేసీఆర్ బెంగళూరు టూర్‌లో పాల్గొని ఉంటే.. ఆయనకు కేసీఆర్ ఇచ్చే ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గలేదనే అభిప్రాయం చాలామందిలో ఉండేది. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా జరగడంలో.. కేసీఆర్ ప్రకాశ్ రాజ్‌ను పక్కనపెట్టారా ? అనే చర్చ జరుగుతోంది.

Bandi sanjay: మసీదులపై బండి సంజయ్​ వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ చీఫ్​ దూకుడుకు కారణం అదేనా..?

Congress: రచ్చబండ కంటే ఇతర రచ్చకే ప్రాధాన్యత.. కాంగ్రెస్‌లో మళ్లీ అలాగే జరుగుతోందా ?

అయితే ఈ విషయంలో అప్పుడే ఓ నిర్ధారణకు రాలేమనే వాళ్లు కూడా ఉన్నారు. కేసీఆర్ త్వరలోనే మహారాష్ట్ర పర్యటనకు వెళ్లాలని అనుకుంటున్నారని.. అప్పుడు కూడా ప్రకాశ్ రాజ్ కనిపించకపోతే.. ఇక ఆయన టీఆర్ఎస్ రాజకీయాలకు దూరం అని అనుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి గతంలో కేసీఆర్‌తో కనిపించి తెలంగాణ రాజకీయాల్లో సందడి చేసిన ప్రకాశ్ రాజ్.. మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో తళుక్కుమంటారా లేక కనిపించకుండాపోతారా అన్నది చూడాలి.

First published:

Tags: CM KCR, Prakash Raj

ఉత్తమ కథలు