Home /News /telangana /

TS POLITICS PRAJASHANTI PARTY CHIEF KA PAL GAVE A BUMPER OFFER TO MLA KOMATIREDDY RAJAGOPAL REDDY WHO RESIGNED FROM CONGRESS PRV

Komatireddy | KA Paul: కోమటి రెడ్డి రాజగోపాల్​రెడ్డికి కేఏ పాల్ బంపర్​ ఆఫర్​.. ఏం ఇస్తానన్నారంటే..?

కేఏ పాల్​, రాజగోపాల్​ (ఫైల్​)

కేఏ పాల్​, రాజగోపాల్​ (ఫైల్​)

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్..​ రాజగోపాల్ రెడ్డికి బంపర్​ ఆఫర్​ ఇచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy rajagopal Reddy) బీజేపీ (BJP)లో చేరే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆ రోజున తెలంగాణకు అమిత్ షా రానున్నారు. ఢిల్లీలో శుక్రవారం అమిత్ షాను కలిసిన అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తాను రాజీనామా చేస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. అమిత్ షా తనను పార్టీలోకి ఆహ్వానించారని.. రాజీనామా లేఖ ఇవ్వడానికి స్పీకర్ అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నానని ఆయన చెప్పారు. మునుగోడు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని రాజగోపాల్ రెడ్డి దుయ్యబట్టారు. బహిరంగ సభ పెట్టే బీజేపీలో చేరుతానని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ లేకున్నా.. అసెంబ్లీ సెక్రటరీకి రాజీనామా లేఖ ఇస్తానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అయిత్ షా సమక్షంలో తనతో పాటు మరికొందరు బీజేపీలో చేరతారని ఆయన వెల్లడించారు. మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్పునిస్తారని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (Prajashanti Party chief KA Pal)..​ రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై స్పందించారు. ఆయనకు ఓ ఆఫర్​ (Offer) ఇచ్చారు పాల్​.

    కేఏ పాల్​ మాట్లాడుతూ..  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపితే తాను కలుస్తానని, సాదరంగా ఆహ్వానిస్తానని అన్నారు. తన పార్టీ సభ్యులు రాజగోపాల్ రెడ్డితో సంప్రదింపులు జరిపారని తెలిపారు. ఆయన ఆసక్తిగానే ఉన్నట్లుగా  ప్రజాశాంతి పార్టీ అధినేత చెప్పారు.  మునుగోడులో కేవలం 6 నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు.



    నేను గెలిపిస్తా..

    ‘‘రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారంటే, ఆయనకు 25 వేల కోట్ల మేలు కలుగుతున్నట్లుగా అనుమానం కలుగుతుంది. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలి. మరి మేమైతే మా పార్టీలో చేరితే బీజేపీ వాళ్లు ఇచ్చినట్లుగా రూ.25 వేల కోట్లు కాదుకదా.. 25 లక్షలు కూడా ఇవ్వలేం. నేను ప్రచారం చేస్తే ఆయన కచ్చితంగా గెలుస్తారు. బీజేపీ తరపున ఆయన నిలబడితే ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతారు? బీజేపీ నుంచి పోటీ చేస్తే రాజగోపాల్ రెడ్డి గెలవరు.’’ అని కేఏ పాల్​ తెలిపారు.

    రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం చాలా డేంజర్ అని, ఆ పార్టీ తరపున పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమని కేఏ పాల్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన అని ఆ పార్టీ సీనియర్ నేతలు అంటున్న మాట నిజమేనని అన్నారు. అలాంటి పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్తే అది అంతకన్నా పెద్ద ఆర్ఎస్ఎస్ కుటుంబ పాలన పార్టీ అని చెప్పారు. రాజగోపాల్ రెడ్డికి చిత్తశుద్ధి, దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి గెలవాలని చెప్పారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Ka paul, Komatireddy rajagopal reddy, Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు