Home /News /telangana /

TS POLITICS PRAJASHANTHI PARTY PRESIDENT KA PAUL HAS DECIDED TO START THE YATRA FROM 23RD OF THIS MONTH IN TELANGANA PRV

KA Paul: తగ్గేదేలే అంటున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​.. మరో కీలక నిర్ణయం

కేఏ పాల్ (ఫైల్​)

కేఏ పాల్ (ఫైల్​)

కేఏ పాల్ తెలంగాణ రాజ‌కీయాల్లో (Telangana Politics) హాల్ చ‌ల్ చేస్తుండ‌టంతో ఇప్పుడు మ‌ళ్లీ చ‌ర్చ‌నీయాంశంగా మారారు. ఇటీవలె కేసీఆర్​పై సీబీఐకి ఫిర్యాదు చేసి వచ్చిన పాల్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు.

  కేఏ పాల్ (KA Paul)ఈ పేరుకు పెద్దగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. .శాంతి దూత‌గా ఎంత మందికి కేఏ పాల్ తెలుసో తెలీదొ కాని పొలిటిక‌ల్​గా ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న గురించి తెలియ‌ని వాళ్లు ఉండారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే సోష‌ల్ మీడియాలో ఆయ‌న క్రేజ్ అంతా ఇంతా కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌న ఏం మాట్లాడినా అంద‌రూ ఆస‌క్తిగా చూస్తారు. ఆయ‌న ఇచ్చే పొలిటిక‌ల్ స్పీచ్ ల‌కు వ్యూస్ కోట్ల‌లో ఉంటాయి. అందుకే తెలుగు న్యూస్ చాన‌ల్స్ అన్ని ఆయ‌న్ని త‌మ స్టూడియోలో కూర్చోపెట్టుకొని ఎందో ఒక అంశంపై మాట్లాడించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంటాయి. 2019 ఎన్నిక‌ల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తానని హాడావిడి చేసిన కేఏ పాల్ త‌రువాత పోటీలోనే లేకుండా వెళ్లిపోయారు. అయితే తాజాగా మ‌ళ్లీ కేఏ పాల్ తెలంగాణ రాజ‌కీయ‌ల్లో ప్ర‌త్యక్ష‌మైయ్యారు (KA Paul entry in Telangana). తెలంగాణతోపాటు ఏపీలో కూడా కేసీఆర్, జ‌గ‌న్ ముంద‌స్తుకు వెళతార‌ని ఉహాగానాలు ఉన్న నేప‌థ్యంలో కేఏ పాల్ తెలంగాణ రాజ‌కీయాల్లో (Telangana Politics) హాల్ చ‌ల్ చేస్తుండ‌టంతో ఇప్పుడు మ‌ళ్లీ చ‌ర్చ‌నీయాంశంగా మారారు. ఇటీవలె కేసీఆర్​పై సీబీఐకి ఫిర్యాదు చేసి వచ్చిన పాల్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు.

  పాల్ రావాలి.. పాలన మారాలి..

  తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ నెల 23 నుంచి యాత్ర (Yatra) ప్రారంభించనున్నట్లు  కేఏ పాల్‌‌‌‌ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ఈ యాత్రను స్టార్ట్ చేసి, అన్ని ఉమ్మడి జిల్లాల్లో కొనసాగుతుందని చెప్పారు. “పాల్ రావాలి.. పాలన మారాలి” అన్న నినాదంతో ముందుకెళుతున్నట్లు పేర్కొన్నారు. బుధవారం అమీర్‌‌‌‌‌‌‌‌పేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. యాత్రలో సెక్యూరిటీ కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఫోన్‌‌‌‌లో కోరగా.. అంగీకరించారన్నారు. కానీ, తెలంగాణ డీజీపీ స్పందించటం లేదన్నారు. ఈ నెల 9 నుంచి మొదట ఏపీలో ఈ యాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

  తెలంగాణ ఎన్నికలకు మరో ఏడాదికిపైగా సమయం ఉన్నప్పటికి పార్టీలు మాత్రం ఎవరి పంథాలో వాళ్లు పాదయాత్రలు చేసుకుంటూ పోతున్నారు. ఓవైపు బీజేపీ తరపున బండి సంజయ్‌ మరోవైపు తెలంగాణ వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షురాలు షర్మిళ పాదయాత్రలు చేస్తున్నారు. ఇదే టైమ్‌లో కేఏ పాల్‌ సైతం పాదయాత్రకు సిద్దమవడం చూస్తుంటే అందర్ని రంగంలోకి దింపుతోంది బీజేపీ అధిష్టానమే అనే ప్రచారం కూడా ఉంది. అందుకే బీజేపీ నేతలు ఈ ఇద్దరికి టచ్‌లో ఉన్నారని కొంత మంది అధికార పార్టీ నేతలు అనుమానిస్తున్నారు.

  స్కెచ్‌ వర్కవుట్‌ అయ్యేనా..?

  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు మరికొంత సమయం ఉంది. అయినప్పటికి ముందస్తు ఆలోచనలో ఇటు కేసీఆర్, అటు జగన్ ఉండటంతో ఇప్ప‌టి నుంచి ప్ర‌జ‌ల్లో ఉంటే ఎన్నిక‌ల నాటికి తెలంగాణ‌లో త‌న పార్టీని బ‌లోపేతం చేయవచ్చనే ఆలోచనలో కేఏ పాల్ ఉన్నారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది అన్నట్లుగా ఇంత ముందు నుంచే పాదయాత్ర చేయాలన్న కేఏ పాల్ అలోచన కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నప్పటికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందుకు పర్మిషన్ ఇస్తుందో లేదో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Ka paul, Telangana Politics

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు