కేఏ పాల్ (KA Paul)ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. .శాంతి దూతగా ఎంత మందికి కేఏ పాల్ తెలుసో తెలీదొ కాని పొలిటికల్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆయన గురించి తెలియని వాళ్లు ఉండారు. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియాలో ఆయన క్రేజ్ అంతా ఇంతా కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఏం మాట్లాడినా అందరూ ఆసక్తిగా చూస్తారు. ఆయన ఇచ్చే పొలిటికల్ స్పీచ్ లకు వ్యూస్ కోట్లలో ఉంటాయి. అందుకే తెలుగు న్యూస్ చానల్స్ అన్ని ఆయన్ని తమ స్టూడియోలో కూర్చోపెట్టుకొని ఎందో ఒక అంశంపై మాట్లాడించడానికి ప్రయత్నాలు చేస్తుంటాయి. 2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తానని హాడావిడి చేసిన కేఏ పాల్ తరువాత పోటీలోనే లేకుండా వెళ్లిపోయారు. అయితే తాజాగా మళ్లీ కేఏ పాల్ తెలంగాణ రాజకీయల్లో ప్రత్యక్షమైయ్యారు (KA Paul entry in Telangana). తెలంగాణతోపాటు ఏపీలో కూడా కేసీఆర్, జగన్ ముందస్తుకు వెళతారని ఉహాగానాలు ఉన్న నేపథ్యంలో కేఏ పాల్ తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) హాల్ చల్ చేస్తుండటంతో ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారారు. అయితే ఆయన చేసే వ్యాఖ్యలు రాజకీయాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ మారుతాయి. తాజాగా అలాంటి వ్యాఖ్యలే మరోసారి చేశారు పాల్ గారు.
హైదరాబాద్ మినహా మిగిలిన ఎంపీ సీట్లలో గెలుపు..
కేఏ పాల్ (Praja Shanti Party chief KA Paul) శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు ఎడాపెడా రుణాలు తీసుకుని రాష్ట్రాలను అప్పుల కుప్పగా మార్చారని పాల్ మండిపడ్డారు, కేసీఆర్, చంద్రబాబుల అవినీతిపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం మూడున్నర లక్షల కోట్ల అప్పులు చేసిన శ్రీలంక దివాలా తీసిందని, తెలంగాణ నాలుగున్నర లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు. తెలంగాణలో హైదరాబాద్ స్థానం మినహా మిగిలిన ఎంపీ సీట్లలో ప్రజాశాంతి పార్టీ గెలుస్తుందన్నారు. అక్కడితో ఆగకుండా జాతీయ స్థాయిలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా (main opposition position in the country) ఉన్న కాంగ్రెస్ పని అయిపోయిందని, ఆ స్థానాన్ని ఇకపైన ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party )భర్తీ చేస్తుందన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.
178 సీట్లలో తమ పార్టీ గెలుస్తుందని..
మీడియా సమావేశంలో పాల్ మాట్లాడుతూ.. ఈసారి ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని, అక్కడ పాతిక సీట్లలో గెలుస్తామని, దక్షిణాది రాష్ట్రాల్లో 150 చోట్ల పోటీ చేస్తున్నామని, మొత్తం 178 సీట్లలో తమ పార్టీ గెలుస్తుందని కేఏ పాల్ ధీమా వ్యక్తం చేశారు. తమది సెక్యులర్ పార్టీ అని, పోటీ చేస్తే ఎక్కువ సీట్లే వస్తాయన్న తన లాజిక్‌తో అమిత్ షా కూడా ఏకీభవించారని తెలిపారు. తనకు చెందిన ఎన్జీవోకు కేంద్ర హోం శాఖ నుంచి జారీ కావాల్సిన ఎఫ్సీఆర్ఎ లైసెన్సు గురించి ఎలాంటి విన్నపం చేయలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గతంలో ఇలాంటి ఎన్జీవోల లైసెన్సులను రద్దు చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళి న్యాయపోరాటం చేసి తిరిగి పునరుద్ధరించగలిగానని, ఆ కారణంగా రూ.55 వేల కోట్ల విరాళాలు వచ్చాయన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.