TS POLITICS PRAJA SHANTI PARTY CHIEF KA PAUL SAID HE WOULD SEEK THE REMOVAL OF BANDI SANJAY FROM THE POST OF TELANGANA BJP PRESIDENT PRV
Bandi sanjay | KA Paul: బండి సంజయ్ బీజేపీ చీఫ్ పదవికి ఎసరు పెట్టిన కేఏ పాల్.. త్వరలోనే ఢిల్లీకి వెళతానని ప్రకటన..
కేఏ పాల్ (ఫైల్)
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టార్గెట్‌గా ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేఏ పాల్ (KA Paul)ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. .శాంతి దూతగా ఎంత మందికి కేఏ పాల్ తెలుసో తెలీదొ కాని పొలిటికల్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆయన గురించి తెలియని వాళ్లు ఉండారు. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియాలో ఆయన క్రేజ్ అంతా ఇంతా కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఏం మాట్లాడినా అందరూ ఆసక్తిగా చూస్తారు. ఆయన ఇచ్చే పొలిటికల్ స్పీచ్ లకు వ్యూస్ కోట్లలో ఉంటాయి. అందుకే తెలుగు న్యూస్ చానల్స్ అన్ని ఆయన్ని తమ స్టూడియోలో కూర్చోపెట్టుకొని ఎందో ఒక అంశంపై మాట్లాడించడానికి ప్రయత్నాలు చేస్తుంటాయి. 2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తానని హాడావిడి చేసిన కేఏ పాల్ తరువాత పోటీలోనే లేకుండా వెళ్లిపోయారు. అయితే తాజాగా మళ్లీ కేఏ పాల్ తెలంగాణ రాజకీయల్లో ప్రత్యక్షమైయ్యారు (KA Paul entry in Telangana).
మరో కశ్మీర్‌లా మార్చాలనుకుంటున్నారా..
తెలంగాణ (Telangana)తోపాటు ఏపీలో కూడా కేసీఆర్ (KCR), జగన్ ముందస్తుకు వెళతారని ఉహాగానాలు ఉన్న నేపథ్యంలో కేఏ పాల్ తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) హాల్ చల్ చేస్తుండటంతో ఇప్పుడు మళ్లీ కేఏ పాల్ చర్చనీయాంశంగా మారారు. తాజాగా ఆయన బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై విరుచుకుపడ్డారు. తెలంగాణను మరో కశ్మీర్‌లా (Kashmir) మార్చాలనుకుంటున్నారా అని పాల్ ప్రశ్నించారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు రాష్ట్రం లో కలసిమెలిసి జీవిస్తుంటే బండి సంజయ్ (Bandi sanjay) వారి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. పాతబస్తీలోని చార్మినార్‌ను కేఏ పాల్ సందర్శించారు. అనంతరం అమీర్‌పేట అపరాజితకాలనీలోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్ మాట్లాడారు.
త్వరలో తాను ఢిల్లీకి వెళ్లి బండి సంజయ్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తీసివేయాలని అధిష్టానాన్ని కోరతానని పాల్ చెప్పారు. రాష్ట్రంలోని ముస్లింలు, క్రైస్తవులకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని పాల్ హెచ్చరించారు.
ఎన్టీఆర్ కుటుంబానికి పార్టీ పగ్గాలు..
అంతకుముందు రోజు కూడా పాల్ బండి సంజయ్‌ని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. వెంటనే దీనిపై బీజేపీ అధిష్టానం స్పందించాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ఒంగోలులో టీడీపీ మహానాడు దేని కోసమని ప్రశ్నించారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే..ఎన్టీఆర్ కుటుంబానికి పార్టీ పగ్గాలు ఇవ్వాలన్నారు.
బాలకృష్ణకు గానీ.. జూనియర్ ఎన్టీఆర్‌కు గాని ఆ బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీల అందరికీ ఆర్.కృష్ణయ్య ప్రతినిధినా అని కేఏ పాల్ మండిపడ్డారు. ఏ ప్రతిపాదికన ఆర్.కృష్ణయ్యకు సీఎం జగన్ రాజ్యసభ సీటు ఇచ్చారని ప్రశ్నించారు. రాజ్యసభ సీటు ఇచ్చినంత మాత్రాన బీసీలంతా ఓట్లు వేయరని చెప్పారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.