హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR ఫలితం కాచుకో: అమిత్ షాతో కేఏ పాల్ భేటీ -అర్థమేంటి? Z-కేటగిరీ : బీజేపీ-ప్రజాశాంతి పొత్తు?

CM KCR ఫలితం కాచుకో: అమిత్ షాతో కేఏ పాల్ భేటీ -అర్థమేంటి? Z-కేటగిరీ : బీజేపీ-ప్రజాశాంతి పొత్తు?

అమిత్ షాతో కేఏ పాల్ భేటీ

అమిత్ షాతో కేఏ పాల్ భేటీ

క్షణం తీరికలేకుండా గడిపే అమిత్ షా మరి కొద్ది గంటల్లోనే తెలంగాణలో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరుకానుండగా, ఢిల్లీలోని ఆయన ఆఫీసులో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఓ దృశ్యం అందరినీ ఆల్మోస్ట్ షాక్‌కు గురిచేసింది. షాతో కేఏ పాల్ భేటీ అయ్యారు. వివరాలివే..

ఇంకా చదవండి ...

ఆయనను కలవాలంటే ముఖ్యమంత్రులు సైతం సుదీర్ఘంగా ఎందురు చూడాలి.. వస్తామంటూ విన్నపాలు పంపే గవర్నర్లు, ముఖ్యనేతలు, వీవీఐపీలకు తక్కువేమీ ఉండదు.. దేశంలో అత్యంత శక్తిమంతైన నేతల్లో ప్రధాని మోదీ తర్వాత నంబర్ 2గా వ్యవహరించే కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) పరిపాలతోపాటు బీజేపీ వ్యవహారాలనూ పర్యవేక్షిస్తుండటం తెలిసిందే. క్షణం తీరికలేకుండా గడిపే షా మరి కొద్ది గంటల్లోనే తెలంగాణలో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరుకానుండగా, ఢిల్లీలోని ఆయన ఆఫీసులో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఓ దృశ్యం అందరినీ ఆల్మోస్ట్ షాక్‌కు గురిచేసింది.

ప్రపంచ ప్రఖ్యాత క్రైస్తవ బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉన్న కేఏ పాల్ (KA Paul) గురువారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసైతో పలు భేటీ తర్వాత పాల్ ఇప్పుడు నేరుగా ఢిల్లీలో, అదీ, అమిత్ షా వద్ద ప్రత్యక్షం కావడం (KA Paul Meets Amit Shah) తీవ్ర చర్చకు దారి తీసింది. ఇది తెలంగాణలో కొత్త పొత్తులపై చర్చకూ సంకేతాలిచ్చినట్లయింది. పూర్తి వివరాలివే..

CM KCR పుట్టుకతోనే భూస్వామి.. నిజాం నుంచి భారీ పరిహారం: KTR -అక్కడుండగా కేసీఆర్ ఫోన్‌కాల్..


గవర్నర్‌తో వరుస భేటీలు ఇప్పుడు ఏకంగా షా తోనే: గడిచిన కొద్ద నెలలుగా తెలంగాణ రాజకీయాల్లో ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటుండటం తెలిసిందే. గత ఎన్నికల్లో ఏపీలో పోటీ చేసి దెబ్బయిపోయిన పాల్.. ఈసారి తను తెలంగాణలో పోటీ చేస్తానని, అధికార టీఆర్ఎస్ అవినీతి మయం అయిందని, సీఎం కేసీఆర్ కుటుంబం 8లక్షల కోట్ల అక్రమాలకు పాల్పడిందని పాల్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, గవర్నర్ తమిళిసైని తరచూ కలుస్తోన్న కేఏ పాల్ పై ఇటీవల టీఆర్ఎస్ నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు పాల్ ప్రయత్నించినా డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు టైమివ్వలేదు. తనపై దాడి కేసీఆర్ కుటుంబం చేయించిందేనంటూ గవర్నర్ కు సైతం ఫిర్యాదు చేసిన పాల్.. ఇప్పుడు ఏకంగా కేంద్రంలో నంబర్2 అమిత్ షాను ఆశ్రయించారు..

గురువారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్

Karma : కర్మ కాటేసింది.. ప్రేయసిని చంపి.. పాతిపెడుతుండగా.. గుండెపోటుతో బొంద మీదే కుప్పకూలాడు..


కేసీఆర్.. ఫలితం కాచుకో: తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అవినీతి, తనపై జరిగిన దాడి గురించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు ఫిర్యాదు చేసినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ వెల్లడించారు. గురువారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి షాతో భేటీ అయ్యారు. సమావేశం తర్వాత పాల్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతి, అన్యాయం, అక్రమాలను తన జీవితంలో ఎన్నడూ చూడలేదని తెలిపారు. సీఎం కేసీఆర్‌ తనపై దాడి చేయించారని, దాని ఫలితం, పరిణామాలు త్వరలోనే చూడటానికి సిద్దంగా ఉడాలని పాల్ హెచ్చరించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ అవినీతి ఇక చెల్లదని, ఆటలు సాగబోవని అన్నారు. టీఆర్ఎస్ దాడి క్రమంలో తనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేఏ పాల్ కేంద్ర మంత్రిని అభ్యర్థించినట్లు తెలుస్తోంది.

Chicken Price: చికెన్ ధర ఆల్ టైమ్ రికార్డు.. ఏపీలో కేజీ రూ.312 -తెలంగాణలో ఇప్పటికే రూ.300గా..


నాకు దక్కే గౌరవాన్ని అందరూ చూడండి: సీఎం కేసీఆర్-టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కనుసన్నల్లో తనపై జరిగిన దాడిని అమిత్‌ షా ఖండించారని కేఏ పాల్ తెలిపారు. తెలంగాణలో లక్షల కోట్ల రూపాయలు మాయమయ్యాయని, కల్వకుంట్ల కుటుంబం అక్రమాలపై దర్యాప్తు జరిగితే కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని అన్నారు. దాడి విషయంలో తెలంగాణ డీజీపీ తనకు సమయం ఇవ్వలేదని, కానీ కేంద్ర హోం మంత్రి అడగ్గానే సమయం ఇచ్చారని పాల్ తెలిపారు. ప్రధాని మోదీ మొదలుకొని, కేంద్ర మంత్రులు తనకు ఇచ్చే గౌరవాన్ని అందరూ చూడాలన్నారు ప్రజాశాంతి పార్టీ అధినేత.

CM KCR | Centre: కేసీఆర్ సర్కారుకు భారీ షాక్.. అప్పులు నిలిపేసిన కేంద్రం.. సంక్షేమ పథకాలకు దెబ్బ!


ఏపీ-తెలంగాణ వల్లే శ్రీలంకలా: ఇండియా ప్రస్తుతం శ్రీలంకలా మారుతుందని, కొన్ని రాష్ట్రాల వల్లే ఈ దుస్థితి తలెత్తిందని, సదరు రాష్ట్రాలను కట్టడి చేసి, ఇండియా శ్రీలంకలా మారకుండా కాపాడాలని అమిత్ షాను కోరినట్లు కేఏ పాల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అప్పు రూ.8 లక్షల కోట్లు, తెలంగాణ అప్పు రూ.4.5లక్షల కోట్లకు చేరిందన్నారు. కేసీఆర్, జగన్ లాంటి వాళ్లను కట్టడి చేయకుంటే దేశం అధోగతిపాలవుతుందని చెప్పారు.

Hindu ఆలయంపై దాడి చేసిన 22 మందికి కఠిన శిక్ష.. అది ఉగ్రవాద చర్యే: Pakistan కోర్టు కీలక తీర్పు


బీజేపీ-ప్రజాశాంతి పొత్తు?: టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడ(హైదరాబాద్)లో శనివారం(14న) బీజేపీ భారీ సభ నిర్వహిస్తున్నది. దీనికి ముఖ్యఅతిథిగా అమిత్ షా వస్తున్నారు. తెలంగాణ పర్యటనకు కొద్ది గంటల ముందే షా.. పాల్ కు టైమివ్వడం కొత్త చర్చకు దారి తీసింది. కేసీఆర్ పై ఫిర్యాదు చేసేందుకే షాను పాల్ కలిసినట్లు చెబుతున్నా, అనూహ్య రీతిలో బీజేపీ-ప్రజాశాంతి పార్టీ పొత్తు అంశం తెరపైకొచ్చింది. ప్రజాశాంతితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదనుకున్నా, తెలంగాణ పర్యటనకు ముందు అమిత్ షా.. పాల్‌ను కలవడం వల్ల ప్రజల్లోకి, విపక్షాలకు ఎన్నిరకాల సంకేతాలు వెళతాయనే అంచనా బీజేపీకి కచ్చితంగా ఉందనే అబిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ వ్యతిరేకులు లేదా బాధితులు అందరికీ అండగా ఉండాలనే వ్యూహం మేరకే కేఏ పాల్ కు అమిత్ షా అపాయింట్మెంట్ దక్కిందా? లేక ఇంకేవైనా కారణాలున్నాయా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అసలు పాల్ ఎంట్రీ వెనుక ఎవరున్నారు? ఎవరు ఎవర్ని టార్గెట్ చేశారు? అనే అంశాలపైనా విస్తృత చర్చ జరుగుతున్నది.

First published:

Tags: Amit Shah, Bjp, CM KCR, Ka paul, Praja shanti party, Telangana, Trs

ఉత్తమ కథలు