ఏపీని, తెలంగాణకు మళ్లీ కలపాలన్నదే తమ లక్ష్యమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) మళ్లీ కలవడం కల, అది ఎప్పటికీ నిజం కాదన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా రెండు రాష్ట్రాలు విడిపోయిన తరువాత మళ్లీ కుట్రపూరిత వ్యాఖ్యలు చేయడంపై ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర అనేది ముగిసిన అధ్యాయం అని, ఇప్పుడు కలపాలనే కొత్త ఆలోచన చేయాలనే సజ్జల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకోవాలి..కానీ మళ్ళీ తెలంగాణ లో రజాధికరం కోసం ప్రత్నిస్తే ఊరుకునేది లేదు. అమరవీరుల ఆకాంక్ష మేరకే వారి ప్రాణ తాగ్యల ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ రాజకీయ లబ్ధికోసం ఎవరికి ఇష్టం వచ్చిన వాక్యాలు చేస్తూ కాలయాపన చేస్తూ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారన్నారు.
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు విడిపోయి దాదాపు పది సంవ్సరాలు చేరువలో ఉంధిప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంట్ లో రాజ్యాంగ బద్ధంగా విడిపోయాయి రాష్ట్రాలు
మళ్ళీ ఇప్పడు తెలంగాణ మీద దాడి జరిగే అవకాశం ఉందని వైసీపీ నేత @SRKRSajjala వాక్యాల పట్ల అర్ధం అవుతుంది! pic.twitter.com/Wez1ITT0wJ
— Ponnam Prabhakar (@PonnamLoksabha) December 8, 2022
తెలంగాణపై కుట్ర..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. ప్రజాస్వామ్యం ద్వారా..పార్లమెంట్ లోనే రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అయితే న్యాయపరంగా, సుప్రీంకోర్టు (Supreme Court)లో కేసులు ఉండొచ్చు. కానీ రెండు రాష్ట్రాలుగా విడిపోయి రెండు ప్రభుత్వాలు ఏర్పడి పాలన సాగిస్తున్న క్రమంలో సజ్జల చేసిన వ్యాఖ్యలు తెలంగాణపై కుట్ర జరిగేందుకు ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకోవాలి తప్ప ఇలా మళ్లీ కలవడానికి వైసిపి అనుకూలంగా ఉందని వ్యాఖ్యానించడం ఏంటని పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రశ్నించారు.
రాష్ట్రాల ఏర్పాటు అనేది జరిగిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి గురించి చర్చ జరగాలి. కానీ ఇలా రాజకీయ లబ్ది కోసం మళ్లీ సమైక్యవాదాన్ని తెరపైకి తీసుకురావడం సరికాదన్నారు. ఎందరో ప్రాణ త్యాగాలతో తెలంగాణ ఏర్పడింది. తెలంగాణపై మళ్లీ రాజ్యాధికారం చేయాలనే కుట్ర జరుగుతుందని పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Telangana, Telangana News