హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana News: పొరుగు జిల్లాలపై పొంగులేటి నజర్..ఎత్తుకు పైఎత్తులు ఫలించేనా?

Telangana News: పొరుగు జిల్లాలపై పొంగులేటి నజర్..ఎత్తుకు పైఎత్తులు ఫలించేనా?

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

బీఆర్ఎస్ అధినాయకత్వంపై ధిక్కారస్వరం వినిపించి..మరికొద్ది రోజుల్లో బిజెపిలో చేరతారన్న వార్తల నేపథ్యంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన దృష్టిని పొరుగు జిల్లాలైన సూర్యాపేట, మహబూబాబాద్ లపై కేంద్రీకరించినట్టు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Khammam | Telangana

(G.SrinivasReddy,News18,Khammam)

బీఆర్ఎస్ అధినాయకత్వంపై ధిక్కారస్వరం వినిపించి..మరికొద్ది రోజుల్లో బిజెపిలో చేరతారన్న వార్తల నేపథ్యంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన దృష్టిని పొరుగు జిల్లాలైన సూర్యాపేట , మహబూబాబాద్ లపై కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన బిజెపి అగ్రనేతలతో సంప్రదింపులు జరుపు తున్నట్టు సమాచారం. మరి కొద్ది రోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని అమిత్ షా, జెపి నడ్డాల సమక్షంలో భారీ స్థాయిలో పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఇంకా ప్రోటోకాల్ ఉన్న నేతలు అనేక మంది పొంగులేటి వెంటే నడుస్తామని సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలో తాను చేరబోయే పార్టీలో టికెట్లు తాను సూచించిన వారికే దక్కుతాయన్న సంకేతాలు ఇచ్చినట్టు చెబుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటుగా పొరుగున ఉన్న సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలోని కొన్ని స్థానాల బాధ్యతలు సైతం పొంగులేటి కి అప్పగించనున్నట్టు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన కోదాడ, డోర్నకల్, మహబూబాబాద్ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కొంతమంది సీనియర్ నేతలను సంప్రదిస్తున్నట్లు సమాచారం.

Pawan Kalyan: వారాహితో తెలంగాణకు పవన్ కళ్యాణ్..ఎప్పుడు, ఎందుకో తెలుసా?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిరుగులేని పట్టు సాధించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన ప్రాబల్యాన్ని పక్క జిల్లాలకు కూడా విస్తరించుకుంటూ ముందుకు పోతున్నారు. మాజీ ఎంపీ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేరున్న రాజకీయ కుటుంబం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామసహాయం సురేందర్ రెడ్డి సైతం పొంగులేటికి సహకరించనున్నట్లు వినికిడి. బిఆర్ఎస్ పార్టీలో పొంగులేటికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదికి పది స్థానాల్లో పొంగులేటి సూచించిన అభ్యర్థులకే టికెట్ ఇస్తామన్న ప్రతిపాదన కూడా బిజెపి వైపు నుంచి ఉన్నట్టు చెబుతున్నారు.

మహబూబాబాద్ జిల్లాపై పొంగులేటి నజర్..

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాజకీయాల్లో అన్యాయమే జరిగిందనే భావనలో పలువురు రెడ్డి సామాజికవర్గ నేతలు అభిమానులు ఉన్నారు. బయ్యారం, గార్ల మండలాల్లో ఇప్పటికే కనిపిస్తున్న పొంగులేటి ప్రభావం రోజురోజుకు మిగతా మండలాలకు వ్యాపిస్తుంది. మాజీ ఎంపీ, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను ఒక దశలో శాసించిన జాతీయ స్థాయి కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మానుకోట సభలో కీర్తించిన మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి సొంత బావమరిది "ఆర్ సురేందర్ రెడ్డి" మనవడికి ఇటీవలే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురుతో కళ్యాణం జరగడం గమనార్హం. పొంగులేటి గాలి ఖమ్మం నుంచి మానుకోట జిల్లాకు సోకకుండా కట్టడిచేసే బాధ్యత మంత్రి సత్యవతి రాథోడ్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవితలకు అధిష్టానం అప్పగించినట్లు సమాచారం.

హైదరాబాద్‌లో పండగపూట దారుణం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రికొత్తగూడెం జిల్లా జెడ్పీచైర్మన్ కోరం కనకయ్యను బుజ్జగించా లన్న  ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో భారాస రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్ రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత పెంచి ఆ సామాజిక వర్గంలో చీలిక తెచ్చే ప్రయత్నం భారాస చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్  మాజీమంత్రి, కాంగ్రెస్ నేత నూకల రామచంద్రరెడ్డిని ఆకాశానికి ఎత్తడం రాజకీయ వ్యూహంలో భాగమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉద్యమకాలం నుండి నేటి దాకా మహబూబాబాద్ జిల్లాకు ఎన్నోసార్లు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎప్పుడూ గుర్తుకు రాని నూకల రామచంద్రారెడ్డి ఒక్కసారిగా గుర్తురావడం మానుకోట గడ్డపై అడుగుపెట్టి నూకల రామచంద్రారెడ్డిని స్మరించుకోకుంటే.. ఆ కార్యక్రమం అసంపూర్ణమే అంటూ ఆయనను పొగడ్తలలో ముంచెత్తడం కేసీఆర్ రాజకీయ చాణక్యాన్ని చాటుతోంది.

అయితే దీన్ని మహబూబాబాద్ జిల్లాలో రాజకీయంగా నాయకత్వ స్థానంలో ఉంటూ.. ప్రభావిత వర్గంగా పని చేసే రెడ్డి సామాజిక వర్గాన్ని కట్టడి చేసే కోణమే అంటున్నారు ఆ సామాజిక వర్గ నేతలు. మరి కెసిఆర్ రాజకీయ చాణక్యం ఏ మేరకు ఫలిస్తుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాబల్యాన్ని తగ్గించే వ్యూహం సక్సెస్ అవుతుందా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది.

First published:

Tags: Khammam, Ponguleti srinivas reddy, Telangana, Telangana Politics

ఉత్తమ కథలు