Home /News /telangana /

TS POLITICS POLITICS HEATING UP IN THAT DISTRICT OF TELANGANA WITH SUCCESSIVE VISITS OF LEADERS KNR PRV

Telangana Politics: ఆ ఉమ్మడి జిల్లాపైనే అన్ని పార్టీల డేగ కన్ను.. నేతల వరుస పర్యటనలు.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆ ఉమ్మడి జిల్లా రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి . రాష్ట్రవ్యా ప్తంగా కురిసిన భారీ వర్షాలతో దాదాపు 10 రోజులపాటు రాజకీయంగా కాస్త చల్లగా ఉన్నా అనంతరం తిరిగి పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది.

  (Srinivas. P, News18, Karimnagar)

  ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లా రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి . రాష్ట్రవ్యా ప్తంగా కురిసిన భారీ వర్షాలతో దాదాపు 10 రోజులపాటు రాజకీయంగా కాస్త చల్లగా ఉన్న . రాజకీయాలకు అధిక ప్రాముఖ్యత కలిగిన  జిల్లా కావడంతో వర్షాల అనంతరం తిరిగి పొలిటికల్ హీట్ పెరగనుంది . ఈ క్రమంలో అన్ని పార్టీలు పాత జిల్లాలో విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నాయి . వరద బాధితులను పరామర్శిం చేందుకు ఒకవైపు వైఎస్సార్​టీపీ (YSRTP) , 24 న మంత్రి కేటీఆర్ (KTR) పుట్టినరోజు సందర్భంగా చేపట్టే సేవా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ (TRS) నేతలు , భారీ వర్షాల కారణంగా రద్దైన రాహుల్ సభ ( సిరిసిల్ల డిక్లరేషన్ ) ను అదే రోజు నిర్వహించాలని కాంగ్రెస్ (Congress) శ్రేణులు , ఎంపీ , బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ మహా సంగ్రామయాత్రకు (Maha Sangrama Yatra) భారీగా తరలివెళ్లాలని కమలనాథులు .. ఇలా ఎవరి ప్రణాళికల్లో వారు ఇందులో తలమునకలయ్యారు .

  వైఎస్సార్​టీపీ  పర్యటన షెడ్యూల్ ప్రకారమే జరుగుతోంది. కానీ, టీఆర్ఎస్ , కాంగ్రెస్ , బీజేపీలు ముందస్తుగా అనుకున్న కార్యక్రమాలన్నీ అనివార్య కారణాల వల్ల రూటు మార్చుకుంటున్నాయి. భారీ వర్షాల అనంతరం రాజకీయాలు అన్నీ వరద బాధితుల (Floods Victims) చుట్టూనే తిరుగుతున్నాయి . ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల వరద ప్రభావిత ప్రాంతాలైన పెద్దపల్లి (Peddapalli) జిల్లా మంథనిలోని పలు గ్రామాలను సందర్శించనున్నారు . అక్కడ బాధితులతో సమావేశమై సమ స్యలు తెలుసుకోనున్నారు . వాస్తవానికి గత నెలలోనే వైఎస్ షర్మిల (YS Sharmila) కరీంనగర్ జిల్లాకు రావాల్సి ఉండగా, అని వార్య కారణాల వల్ల రద్దయింది. గోదావరి పరి వాహక ప్రాంతాల్లో వర్షాలు, వరదల ప్రభావం అధికంగా ఉండటంతో ఆమె ఉమ్మడి జిల్లాలో తీవ్రంగా దెబ్బతిన్న మంథనిని ఎంచుకున్నారు .  రాహుల్ సభకు ఏర్పాట్లు..

  వరంగల్ డిక్లరేషన్ (Warangal Declaration) తర్వాత కాంగ్రెస్ పార్టీ కన్నేసిన రెండో ఉమ్మడి జిల్లా కరీంనగర్ . పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు యువతను ఆకట్టుకోవాలన్న లక్ష్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగస్టు 2 న సిరిసిల్లలో రాహుల్ సభకు ఏర్పాట్లు చేశారు . సభకు రాష్ట్రవ్యాప్తంగా భారీ జనసమీకరణ చేయాలని టీ కాంగ్రెస్ యోచించింది . కానీ , ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చాయి . దీంతో సభను వాయిదా వేయాలని పార్టీ నిర్ణయించింది . ఇదే విషయాన్ని ఢిల్లీ పెద్దలకు కూడా వివరిం చారు . అక్కడ నుంచి ఇంకా ఆమోదం రాలేదు . అయితే , అనుకున్న తేదీనే రాహుల్ సభ నిర్వహించాలని ఉమ్మడి కరీంనగర్ నేతలు అభిప్రాయ పడుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చే సంకేతాల ఆధారంగా సభ నిర్వహణపై స్పష్టత రానుంది.

  మూడో విడత మహా సంగ్రామయాత్ర..

  ఆగస్టు 2 న  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) చేపట్టబోయే మూడో విడత మహా సంగ్రామయాత్రకు ఉమ్మడి కరీంనగర్ కమలనాథులు సిద్ధమవుతున్నారు . యాత్ర ముగింపు వరకు సంజయ్​కు చేదోడువాదోడుగా ఉండేవారిలో ఉమ్మడి జిల్లావారే అధికం . ఈ నేపథ్యంలో సంగ్రామయాత్రలో వీరికి బాధ్యతలు నిర్వర్తించాల్సిన ముమ్మర కసరత్తు సాగుతోంది . అదే సమయంలో ఆగస్టు 2 న బండి యాత్ర కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమైతే బండి యాత్ర యథావిధిగా జరుగుతుందని, పోలింగ్ నిర్వహించాల్సి వస్తే ఆగస్టు 6 తరువాత తేదీలకు యాత్ర మారే అవకాశాలు ఉన్నాయని సీనియర్ కమలనాథులు వెల్లడించారు . అప్పగించే విధులపై కమలనాథులు బిజీ లో ఉన్నట్టు సమాచారం.

  భారీవర్షాల నేపథ్యంలో ఈనెల 24 న కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా  ఉండకపోవచ్చని పార్టీ శ్రేణులు అంటున్నారు . ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈసారి వరద బాధితులకు చేయూతనిచ్చేలా కేటీఆర్ బర్త్​ డే కొనసాగుతుందని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామక్రిష్ణారావు తెలిపారు . ఈసారి వరద ప్రభావిత ప్రాంతాలను ఆదుకునే దిశగా కార్యక్రమాలు రూపొందించే పనిలో ఉన్నామని వివరించారు.ఇలా ఎవరికీ వారే ఇప్పటి నుంచే రాజకీయ టైం టేబుల్ రెడీ చేసుకొని ముందస్తు ఎన్నికలు వస్తే వారి వారి ప్లాన్ ను రెడీ చేసుకోవడానికి తయారవుతున్నట్టు సమాచారం.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bjp, Congress, Karimangar, Telangana Politics, Trs, Ysrtp

  తదుపరి వార్తలు