హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana politics : 13రోజుల వ్యవధిలోనే హైదరాబాద్‌కు ప్రధాని మోదీ, రాహుల్‌గాంధీ .. నేతల పర్యటనకు కారణం అదేనా..?

Telangana politics : 13రోజుల వ్యవధిలోనే హైదరాబాద్‌కు ప్రధాని మోదీ, రాహుల్‌గాంధీ .. నేతల పర్యటనకు కారణం అదేనా..?

నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ(File)

నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ(File)

Telangana politics : తెలంగాణలో నేతల పర్యటనలు, పార్టీ కార్యక్రమాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 11వ తేదిన ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన పర్యటనకు కారణం అదేనట.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ(Telangana)లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. ఓవైపు మునగోడు(Munugode) ఎన్నికల షెడ్యూల్ విడుదల, మరోవైపు ఒకటి రెండ్రోజుల్లో టీఆర్ఎస్‌(TRS) జాతీయ పార్టీ ఏ ఆవిష్కరణ..ఇంకో వైపు ఈనెల 24నుంచి రాహుల్‌గాంధీ జోడో యాత్ర(Rahul Gandhi Jodo Yatra)తో పాటు 11న హైదరాబాద్‌ (Hyderabad) కు ప్రధాని మోదీ (Prime Minister Modi) రావడం అన్నీ ఒకదాని తర్వాత మరొకటి ప్రోగ్రామ్స్ ఫిక్స్ కావడంతో అప్పుడే ఎలక్షన్ హడావుడి మొదలైనట్లుగా ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక కార్యక్రమానికి హాజరవడం కోసం హైదరాబాద్‌కు వస్తుండటంతో ఈ పర్యటనకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. పార్టీ వ్యవహారాలతో సంబంధం లేనట్లుగా తెలుస్తోంది. అయినప్పటికి కమల నాథుల్లో మాత్రం కొత్త జోష్ కనిపిస్తోంది.

KCR: మునుగోడు బరిలో ఉండేది టీఆర్ఎస్సా..? లేక బీఆర్ఎస్సా..?.. కేసీఆర్ ప్రకటనపై ఉత్కంఠ

నేతల రాకతో కొత్త జోష్ ..

ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్‌ 11వ తేదిన హైదరాబాద్‌ వస్తున్నారు. నగరంలో జరగనున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి ఆయన వస్తున్నట్లుగా ప్రధాని కార్యాలయం పేర్కొంది. హైదరాబాద్‌లో జరగబోయే యుఎన్‌డబ్ల్యూజీఐసీ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఈనెల 10వ తేదీ నుంచి 14 వరకు హైదరాబాద్ వేదికగా యుఎన్‌డబ్ల్యూజీఐసీ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి 120 దేశాలకు చెందిన సుమారు 2వేల మంది ప్రతినిధులు పాల్గొంటారు. కాంగ్రెస్ హాజరుకానుంది.

పొలిటికల్ డెవలప్‌మెంట్స్ ..

ఈనెల 5వ తేదిన అంటే దసరా రోజున టీఆర్ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్ జాతీయ పార్టీ పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది. అలాగే కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన తర్వాత ప్రధాని మోదీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈనేపధ్యంలో ప్రధాని రాకపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ జోడో యాత్ర కూడా ఈనెలలోనే తెలంగాణలో కొనసాగనుంది. ఈనేపధ్యంలోనే పోటాపోటీగా నేతల పర్యటనలు, ప్రచార కార్యక్రమాలతో అన్నీ పార్టీల నేతల్లో జోష్ కనిపిస్తోంది. మోదీ హైదరాబాద్ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత, పార్టీ వ్యవహారాలతో సంబంధం లేకపోయినప్పటికి కమలనాధులు మాత్రం .. మునుగోడు బైపోల్‌కి మోదీ టూర్‌ బూస్టింగ్‌లా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Narendra modi, Rahul Gandhi, Telangana Politics

ఉత్తమ కథలు