Home /News /telangana /

TS POLITICS POLITICAL SURVEY TEAMS COMPLETING ELECTION ANALYSIS IN KARIMNAGAR DISTRICT SNR KNR

Political survey : ఆ జిల్లాలో ప్రధాన పార్టీకి చెందిన ఆ ఏడుగురికి ఈసారి టికెట్ డౌటే .. తేల్చి చెప్పిన పొలిటికల్ సర్వే

election survey(file photo)

election survey(file photo)

Political survey: ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికి నాయకులు మాత్రం అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్‌ను కంప్లీట్ చేసుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరుగాంచిన నాలుగైదు పొలిటికల్ సర్వే బృందాలు విశ్లేషణను పూర్తి చేసే పనిలో పనిలో పడ్డాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India
  (P.Srinivas,New18,Karimnagar)
  ఇప్పటినుండే ఎన్నికల హడావిడి మొదలయింది. ఇంకా ఎన్నికలకు చాలా టైమ్ ఉన్నప్పటికి నాయకులు మాత్రం ఎన్నికలకు సంబంధించిన గ్రౌండ్ వర్క్‌ను కంప్లీట్ చేసుకుంటున్నారు. మరోవైపు తాజా రాజకీయ సమీకరణాలు, ప్రజలు ఏమనుకుంటున్నారు..? ఏ పార్టీ అభ్యర్థుల బలబలాలు ఎలా ఉన్నాయి..? ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు ఉమ్మడి కరీంనగర్(Karimnagar)జిల్లాలో నాలుగైదు పొలిటికల్ సర్వే(Political Survey)లో పేరుగాంచిన బృందాలు జోరుగా సంచరిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఒకసారి సర్వే పూర్తి చేసిన ఐప్యాక్(Ipack), ఆరా(Aura), సునీల్(Sunil)వంటి బృందాలు మరోసారి సర్వే చేస్తుండటం గమనార్హం.

  Crime news : తండ్రి కర్కశానికి మూడేళ్ల చిన్నారి బలి .. రెండ్రోజులు మృత్యువుతో పోరాడి..  సర్వే సంస్ధల హడావుడి..
  వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటి నుంచే హడావుడి కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో కరీంనగర్ జిల్లాకు అన్ని రాజకీయ పార్టీలు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాయి. ఉద్యమ కాలం నుంచి కరీంనగర్ ఇటు టీఆర్ఎస్ , అటు ప్రతిపక్ష బీజేపీ , కాంగ్రెస్‌కు కీలకంగా నిలిచింది. అందుకే అన్ని పార్టీలు మరోసారి ముందుగా ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ సర్వే బృందాలకు తోడుగా నాలుగు జిల్లాల్లోని ఆయా పార్టీల పరిస్థితి , అభ్యర్థుల బలబలాలు , స్థానికుల అభిప్రాయంపై ఎవరికి వారు ప్రైవేటుగా సర్వేలు చేయించుకుంటున్నాయి.  ఐప్యాక్ రెండో విడత .. !
  ప్రముఖ రాజకీయ విశ్లేషక సంస్థ ఐప్యాక్ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే జూన్ మొదటివారంలో సర్వే నిర్వహించింది. ఆ సమయంలో ఉన్న రాజకీయ పరిస్థితులను, ప్రజల ఆలోచనలను సేకరించిన సంస్థ తాజాగా మరోసారి ఉమ్మడి జిల్లాపై ఫోకస్ చేయడం చర్చ నీయాంశంగా మారింది. గతంలో సర్వే చేసిన బృందం , బృంద సభ్యులు , ప్రస్తుతం సర్వేచేస్తున్న టీముల లక్ష్యాలు , దృష్టి సారించిన అంశాలు వేర్వేరు కావడం గమనార్హం. ఎంచుకున్న అంశాల పరంగా సామాజికంగా , ఆర్థికంగా , రాజకీయ , సంక్షేమ అంశాలలో పలు టీములు పనిచే స్తున్నాయని , ఇందులో ఎవరి నివేదిక వారు సమర్పిస్తాయని తెలిసింది.

  Telangana : ఒకరేమో దొంగ .. మరొకరికి మెదడు చెడింది వీళ్లా ప్రజల్ని పాలించేది : వైఎస్ షర్మిల


  మార్పులు -చేర్పులు తప్పవా..!
  ఉమ్మడి జిల్లాలోని ఓ ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థుల్లో ప్రజావ్యతిరేకత ఉన్న నేప థ్యంలో కొందరిని మార్చాలంటూ ఓ ప్రముఖ సంస్థ గుర్తించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఉమ్మడి జిల్లాలో మొత్తం ఏడు స్థానాల్లో అభ్యర్థులను మార్చాలన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కరీంనగర్ జిల్లా నుంచి రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని , జగిత్యాలలో ఒక స్థానం , పెద్దపల్లిలో రెండు స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని , వేములవాడలో బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని సూచించింది. గత నివేదికలో ఆయా స్థానాల్లో ఉన్న ప్రజావ్య తిరేకతను సదరు పార్టీకి తెలిపిన సంస్థ ప్రస్తుతం వారిని ఏకంగా మార్చాలని సూచించడం విశేషం.

  ఎవరైతే బెటర్ అని పరిశోధన..
  ముఖ్యంగా కొంతకాలంగా పెద్దపల్లి జిల్లాలోని రాజకీయ సమీకరణలు , ఆందోళన నేపథ్యంలో ఈ సంస్థ రెండో సారి మరింత లోతుగా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ఆందోళనలకు మూల కారణం , ప్రజల అసంతృప్తి , వారు డిమాండ్లు తదితరాలను క్షుణ్నంగా క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకుంటోంది. జూన్‌లో సర్వే చేసిన సంస్థలన్నీ ఆగస్టులో మరోసారి సర్వేకి దిగాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చాలామంది వారసులు , కొత్త నాయకులు తెరమీదకు వస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న యువ నాయకుల బలాలు , బలహీనతలు , అనుకూలిం చే అంశాలు , సామాజికవర్గం మద్దతు తదితరాలపై ప్రస్తుతం విశ్లేషణ సాగిస్తున్నాయి. వచ్చే ఎన్నికలు అధికార టీఆర్ఎస్ తోపాటు , ప్రతిపక్ష కాంగ్రెస్ , బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Karimnagar, Telangana Politics

  తదుపరి వార్తలు