హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR | Prashant Kishore: సీఎం కేసీఆర్​తో ప్రశాంత్​ కిశోర్​ భేటీ.. ఏ విషయాలపై చర్చ జరిగింది? టీఆర్ఎస్​కి రాజకీయ వ్యూహకర్తగా ఉంటారా?

CM KCR | Prashant Kishore: సీఎం కేసీఆర్​తో ప్రశాంత్​ కిశోర్​ భేటీ.. ఏ విషయాలపై చర్చ జరిగింది? టీఆర్ఎస్​కి రాజకీయ వ్యూహకర్తగా ఉంటారా?

టీఆర్ఎస్ సిట్టింగ్ లపై సీఎం చేతికి పీకే రిపోర్ట్

టీఆర్ఎస్ సిట్టింగ్ లపై సీఎం చేతికి పీకే రిపోర్ట్

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్​లో చేరుతుండటంతో సేవలు (Political strategist) వాడుకునే విషయంలో గులాబీ బాస్‌ సందిగ్ధంలో పడ్డట్టు తెలుస్తోంది. అయితే ప్రశాంత్ కిషోర్ సైలెంటుగా కాంగ్రెస్ ప్రత్యర్థులతో భేటీ కావడం తాజా సంచలనంగా మారింది.

ఇంకా చదవండి ...

  నాలుగు రోజుల వ్యవధిలో మూడు సార్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ (Political strategist Prashant Kishore).. 2024 సార్వత్రిక ఎన్నికలు, త్వరలో జరుగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కావాల్సిన వ్యూహాలను అందజేశారు. పీకే కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమైన దరిమిలా గుజరాత్ కు చెందిన పటేల్ ఉద్యమ నేతలు ఆయనతో టచ్ లోకి వచ్చారు. వ్యూహకర్తగా కంటే కార్యకర్తగానే కాంగ్రెస్ కు పీకే సేవలు అందించబోతున్నట్లు ఏఐసీసీ వర్గాలు వ్యాఖ్యానాలు చేయడం, దేశానికే బ్రాండ్ లా మారిన పీకే కాంగ్రెస్ లోకి రావాలనుకోవడం శుభపరిణామమని సోనియా విధేయుడైన రాజస్థాన్ సీఎం గెహ్లాట్ అనడం తదితర పరిణామాలు పీకే ఎంట్రీ గ్రాండ్ గా ఉండబోతోందనే సంకేతాలు ఇచ్చినట్లయింది.

  ఈ సమయంలో.. ప్రశాంత్ కిశోర్ సేవలు (Political strategist) వాడుకునే విషయంలో గులాబీ బాస్‌ (KCR) సందిగ్ధంలో పడ్డట్టు తెలుస్తోంది. అయితే పీకే శిష్యుడు సునీల్ సేవలు కేసీఆర్​ వాడుకుంటారని వార్తలు సైతం వస్తున్నాయి. కానీ, సునీల్​ సైతం కాంగ్రెస్​ కోటరీలో సెటిలవ్వడంతో ఇది సాధ్యమయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు.  కానీ ప్రశాంత్ కిషోర్ సైలెంటుగా కాంగ్రెస్ (Congress) ప్రత్యర్థులతో భేటీ కావడం తాజా సంచలనంగా మారింది.

  తెలంగాణ  ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి , టీఆర్ఎస్  అధినేత కేసీఆర్‌తో (kcr) ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant kishor) ఆదివారం జరిగిన భేటీ ముగిసింది. సీఎంతో శని, ఆదివారాలు రెండు రోజులు ఆయన రాష్ట్ర, దేశ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. జాతీయ రాజకీయాలు, బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుపై చర్చించినట్లుగా తెలుస్తోంది. దాదాపు ఇక టీఆర్​ఎస్​కు రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్​ కిశోర్​ ప్రత్యక్షంగా పనిచేయకపోవచ్చు. కానీ, పరోక్షంగా ఆయనకు సాయం చేసేలా ప్రశాంత్​ కిశోర్​ ఉన్నట్లు సమాచారం. బీజేపీని ఎదుర్కోవడానికి వ్యూహాలు చెప్పనున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

  ఇది కేసీఆర్-పీకే ఆఖరి సమావేశం..

  అయితే కాంగ్రెస్ లో చేరికకు సిద్ధమైన ప్రశాంత్ కిషోర్ సడన్ గా హైదరాబాద్​ వచ్చి గులాబీ బాస్ ను కలవడంపై టీకాంగ్రెస్ లో భిన్నవాదనలు కూడా వినిపిస్తున్నాయి. కేసీఆర్ కు కటీఫ్ చెప్పడానికే పీకే ప్రగతి భవన్ వచ్చారని, ఆ పనిని గౌరవ ప్రదంగా చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ కోరిక మేరకు రెండు రోజుల పాటు కలిసుండటానికి అంగీకరించారని, బహుశా ఇది కేసీఆర్-పీకే ఆఖరి సమావేశం కావొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి కొందరు నేతలు మాత్రం.. పీకే కాంగ్రెస్ లో చేరబోవడంలేదని, వ్యూహకర్తగా మాత్రమే పనిచేస్తారని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ పట్ల పీకే వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టిందనే వాదనకు మాత్రం అందరూ అంగీకరిస్తున్న పరిస్థితి.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CM KCR, Prashant kishor

  ఉత్తమ కథలు