హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR- Prashant kishor Meeting: సీఎం కేసీఆర్‌తో భేటీ తర్వాత ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం.. ఆ పార్టీకి బిగ్ షాక్..!

CM KCR- Prashant kishor Meeting: సీఎం కేసీఆర్‌తో భేటీ తర్వాత ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం.. ఆ పార్టీకి బిగ్ షాక్..!

కేసీఆర్, ప్రశాంత్ కిశోర్

కేసీఆర్, ప్రశాంత్ కిశోర్

CM KCR- Prashant kishor Meeting: ప్రశాంత్ కిశోర్ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో గందరగోళానికి తావిస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సర్వం సిద్ధమవడం, అదే సమయంలో తెలంగాణలో టీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తానని చెప్పడం.. ఈ రెండు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

  ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ (Prashant kishor) పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు వ్యూహాలను సిద్ధం చేశారని.. అవి పార్టీ సీనియర్లకు కూడా నచ్చాయని తెలుస్తోంది. ఆయన పార్టీలో చేరితే కాంగ్రెస్ ఖచ్చితంగా బలపడుతుందని వారంతా సోనియా గాంధీ(Sonia Gandhi)కి చెప్పారట. ఐతే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే.. తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితేంటని.. ఇక్కడి రాజకీయాల్లో కూడా చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఎన్నికల వ్యూహాలు అందించేందుకు సీఎం కేసీఆర్‌తో ఇది వరకే ప్రశాంత్ కిశోర్ ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్‌లో చేరితే.. ఆ పార్టీని కాదని టీఆర్ఎస్‌కు ఎలా పనిచేస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఓ సంచలన వార్త బయటకు వచ్చింది.

  రంజాన్​ సందర్భంగా ముస్లిం సోదరులకు CM KCR​ ఇఫ్తార్​ విందు.. ఇఫ్తార్​ వేదిక, తేదీ వివరాలివే

  శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్ కిశోర్ (CM KCR- Prashant kishor Meeting) సమావేశమయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆయనతో చర్చలు జరిపారని.. రాత్రి కూడా ప్రగతిభవన్లోనే బసచేసినట్లు సమాచారం. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై వీరిద్దరు విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇవాళ మరోసారి భేటీ అవుతారని.. పలు కీలక అంశాలపై చర్చలు జరపనున్నట్లు 'ఈనాడు' తన కథనంలో పేర్కొంది. శనివారం సీఎం కేసీఆర్‌తో సమావేశమైన తర్వాత ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముందే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌తోనే కలిసి పనిచేస్తానని పీకే స్పష్టం చేసినట్లు సమాచారం. తాను కాంగ్రెస్ పెద్దలతో జరిపిన సంప్రదింపుల గురించి కూడా సీఎం కేసీఆర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్‌తో వరుసగా చర్చలు జరుపుతున్న ప్రశాంత్ కిశోర్.. ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌ను కలవడం..టీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తానని చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది.

  ఖమ్మంలో తారాస్థాయిలో రాజకీయాలు.. మంత్రి అజయ్ కుమార్ పరిస్థితి ఏంటి.. కేసీఆర్ ఆదుకుంటారా..

  తెలంగాణలో రాజకీయ, పరిపాలన తీరు, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రశాంత్ కిశోర్ టీమ్ సర్వే (PK Team survey In Telangana) నిర్వహించింది. మొదట 39 నియోజకవర్గాల్లో సర్వే చేసి.. ఆ ఫలితాలను సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ఆ తర్వాత 89 నియోజకవర్గాల్లో కూడా సర్వే చేపట్టారు. ఆ నివేదికను కూడా నిన్నటి భేటీలో సీఎం కేసీఆర్‌కు పీకే సమర్పించినట్లు సమాచారం. ఈ నెల 27న టీఆర్ఎస్ 21వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోనుంది. ఆ సందర్భంగా హైదరాబాద్ హెచ్ఎసీసీలో ప్లీనరీని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో తాజా సర్వే, పార్టీ బలోపేతం సహా పలు అంశాలంపై ఇవాళ కూడా సీఎం కేసీఆర్‌తో చర్చించనున్నారు ప్రశాంత్ కిశోర్.

  KCR - TRS మళ్లీ గెలిస్తే గొంతు కోసుకుంటా.. నవంబర్ 20 డెడ్‌లైన్: BJP ఎంపీ అరవింద్ సంచలనం

  మరోవైపు ప్రశాంత్ కిశోర్ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో గందరగోళానికి తావిస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సర్వం సిద్ధమవడం, అదే సమయంలో తెలంగాణలో టీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తానని చెప్పడం.. ఈ రెండు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. కాంగ్రెస్‌లో పార్టీలో చేరి.. తెలంగాణలో అదే పార్టీకి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తారని.. కొందరు కాంగ్రెస్ సీనియర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ వ్యవహారం.. అటు జాతీయ స్థాయిలో.. ఇటు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ పీకే కాంగ్రెస్‌లో చేరి..ఇక్కడ టీఆర్ఎస్‌ కోసం పనిచేస్తే.. దానిని ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఎలా స్వీకరిస్తారన్నది ఆసక్తికరంగా మారనుంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Prashant kishor, Telangana Politics, TS Congress

  ఉత్తమ కథలు