హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Politics: తెలంగాణలో రాజకీయ రైడ్స్..ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

Telangana Politics: తెలంగాణలో రాజకీయ రైడ్స్..ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

రాజకీయ రైడ్స్

రాజకీయ రైడ్స్

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ రైడ్స్ (Political Rides) కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఐటీ (Income Tax), ఈడీ (Enforcement Directorate), సిబిఐ (Central Burew Of Investigation) ముమ్మర సోదాలు గులాబీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీపై టీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తుంది. దీనికోసం ఏకంగా ప్రత్యేక సిట్ ను నియమించిన ప్రభుత్వం పోటాపోటీగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నాయి. గత కొన్నిరోజులుగా టీఆర్ఎస్ నేతల నివాసాల్లో ఐటీ, ఈడీ రైడ్స్ చేసింది. టీఆర్ఎస్ నాయకులే టార్గెట్ గా క్యాసినో కేసు, ఢిల్లీ లిక్కర్ స్కాం, ఆదాయానికి మించి ఆస్తుల విషయంలో సోదాలు జరిగాయి. బీజేపీ టార్గెట్ గా ఫామ్ హౌస్ కేసును ముమ్మరం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ రాజకీయ రైడ్స్ లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా సీన్ మారింది. మరి ఈ రైడ్స్ వల్ల ఎవరికీ లాభం? ఎవరికీ నష్టం జరుగుతుందనేది రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Ts Congress: తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం..బీజేపీలోకి మరో ఐదుగురు నాయకులు?

క్యాసినో కేసు..

చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసు (Casino Case)లో టీఆర్ఎస్ మంత్రి తలసాని బ్రదర్స్ ను, మంత్రి PAను, అలాగే మంత్రి కొడుకు తలసాని సాయి కిరణ్ కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇక మిగిలింది తలసానినే. అయితే ఈ కేసులో ఈడీ  (Enforcement Directorate) ఏకంగా 300 మందికి పైగా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి ఈ కేసులో ఇంకెంతమంది రాజకీయ నాయకుల పేర్లు బయటకు వస్తాయో చూడాలి.

Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో జాబ్స్ .. ఇలా అప్లై చేసుకోండి

ఢిల్లీ లిక్కర్ స్కాం..

ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరు హస్తం ఉందనే అనుమానంతో హైదరాబాద్ లో పలు చోట్ల సోదాలు చేసింది. ఇక ఈ కేసులో విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లిని అరెస్ట్ చేసిన అధికారులు దర్యాప్తును ముమ్మరం చేసింది. మరి ఈ కేసులో ఎలాంటి సంచలనాలు వెల్లడవుతాయో చూడాలి.

SIT: BL సంతోష్ విషయంలో సిట్ ఏం చేయబోతుంది? మళ్లీ నోటీసులా లేక అప్పటి వరకు ఆగుతుందా?

ఐటీ రైడ్స్..

ఇక తాజాగా టీఆర్ఎస్ మినిస్టర్ మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్ తో నేతల్లో టెన్షన్ మొదలయింది. రానున్న రోజుల్లో మరింతమంది నాయకుల నివాసాల్లో సోదాలు జరుగుతాయని వారే జోస్యం చెబుతున్నారు. మొత్తంగా ఈడీ (Enforcement Directorate), ఐటి, సిబిఐ సంస్థలు చేసే రైడ్స్ ఇప్పుడు కారు పార్టీ నాయకులను కకావికలం చేస్తుంది.

ఎవరికీ ప్లస్..ఎవరికి మైనస్..

అయితే తాజా రైడ్స్ తో బీజేపీపై టీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. అవినీతి, అక్రమాలు, టాక్స్ కట్టకుంటే చర్యలు తీసుకోవాల్సిన దర్యాప్తు సంస్థలు అధికార పార్టీ చేతుల్లో కీలు బొమ్మలుగా మారాయని ఆరోపిస్తున్నారు. అయితే తప్పు చేయనప్పుడు భయపడడం ఎందుకని బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఈ రైడ్స్ లో పెద్ద మొత్తంలో టీఆర్ఎస్ నాయకుల అవినీతిని బట్ట బయలు చేస్తే కేంద్రం వైపు సానుకూల పవనాలు వీస్తాయి. ఒకవేళ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ హస్తం ఉందని తేలితే ఆ అవకాశాన్ని టీఆర్ఎస్ ఆయుధంగా మలుచుకుంటుంది. మరి రానున్న రోజుల్లో రాజకీయ రైడ్స్ ఎవరికి ప్లస్ ఎవరికీ మైనస్ గా మారతాయో చూడాలి.

First published:

Tags: Bjp, Enforcement Directorate, Telangana, Telangana News, Trs

ఉత్తమ కథలు