Home /News /telangana /

TS POLITICS POLITICAL PARTIES WHO ARE PREPARING MONEY TO BUY VOTERS WHEN ELECTIONS ARE HELD IN TELANGANA SNR KNR

Telangana : ముందస్తు కోసం మనీ సిద్ధం .. ఇప్పటి నుంచే గ్రామల్లోకి తరలిపోతున్న నోట్ల కట్టలు

ELECTION MONEY

ELECTION MONEY

Telangana: ఒక్కప్పుడు ఎన్నికల ఖర్చులు అంటే ఓ పాతిక లక్షలు ఉండేవి. కానీ ఇప్పుడు వంద కోట్లు ఉన్నఅవి సరిపోవడం లేదు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రాజకీయ నాయకులు ఒకరికంటే ఒకరు ఓటుకును కొంటూ డబ్బులు ఇస్తున్నారు. ఇక రానున్న ఎన్నికల కోసం రాజకీయ నాయకులు ఇప్పటి నుండే సంసిద్ధం అవుతున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India
  (P.Srinivas,New18,Karimnagar)
  ఒక్కప్పుడు ఎన్నికల(Election)ఖర్చులు అంటే ఓ పాతిక లక్షలు(Twenty five lakhs)ఉండేవి. కానీ ఇప్పుడు వంద కోట్లు(Hundred crores) ఉన్నఅవి సరిపోవడం లేదు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రాజకీయ నాయకులు ఒకరికంటే ఒకరు ఓటుకును కొంటూ డబ్బులు ఇస్తున్నారు. ఇక రానున్న ఎన్నికల కోసం రాజకీయ నాయకులు ఇప్పటి నుండే సంసిద్ధం అవుతున్నారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections)వచ్చే ఏడాది చివరలో జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో ఏ " పార్టీకి తెలియడం లేదు . అందుకే ముందస్తుగానే అన్ని పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

  Crime news : వాళ్లంతా ఓ ఖతర్నాక్ బ్యాచ్ .. ఈ వీడియో చూస్తే ఇకపై ఎవరికి సాయం చేయరు  నగదు నిల్వ చేస్తున్న పార్టీలు...
  తెలంగాణలో రాజకీయ పార్టీల్లో ఎన్నికల సెగ రాజుకుంది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్య ఎక్కువ పోటీ ఉండగా ఈసారి బీజేపీ సైతం దూకుడుగా వ్యవహరిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండనుంది. ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలనే లక్ష్యంతో మూడు పార్టీలూ వ్యూహాలకు పదును పెట్టాయి . ఒక పార్టీ మాత్రం మిగతా వాటి కంటే ముందుగానే ఆలోచిస్తోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో రవాణా చేయడం కష్టమని భావించి ఇప్పటికే నోట్ల కట్టలను గ్రామాలకు తరలించింది . పార్టీ నమ్మకస్తులకు వాటి బాధ్య తలను సైతం అప్పగించింది.  ఎన్నికల ఖర్చుకు ముందే ఏర్పాట్లు..
  నగదును రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొస్తాయో ఏ పార్టీకీ తెలియదు . కానీ ఎప్పుడొచ్చినా సిద్ధమంటూ అన్ని పార్టీలు ప్రకటిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగా ఆర్ధిక వనరుల్ని సిద్ధం చేసుకుంటున్నాయి. గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి . అందులో భాగంగానే ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఒక పార్టీ ముందుగానే మేల్కొని ఏకంగా గ్రామాలకు ఇప్పటికే నోట్ల కట్టలను చేరవేసింది . ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ అవసరాలకు అనుగుణంగా అంచనా ప్రకారం ఆ పార్టీలో నమ్మకమైన వ్యక్తుల దగ్గరకు వాటిని చేర్చింది . మూడేడ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటుకు నోటు విలువ పెరుగుతుందని అంచనా వేసింది. అందుకు అనుగుణంగానే మూడు గ్రామాలను ఒక యూనిట్‌గా తీసుకుని మనీ స్టాక్ పెట్టుకుంది.

  పోటాపోటీగా వెదజల్లేందుకు నోట్ల కట్టలు..
  ఎన్నికలు షడన్‌గా రావచ్చనే అనుమానంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ ఏర్పాట్లు మొదలుపెట్టింది. 2018 ఎన్నికల్లో రెండు పార్టీలు లేదా కూటముల మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఈసారి బీజేపీ సైతం మూడో పక్షంగా ఆవిర్భవించింది . ఈ నేపథ్యంలో ముక్కోణపు పోటీ అనివార్యమైంది. మూడు పార్టీలూ అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి . ముందస్తు ఏర్పాట్లు ఓటర్లను ఎలాగైనా తమవైపు తిప్పుకోవడానికి నగదుతో పాటు నజరానాలు తప్పవనే భావనతో ఆయా పార్టీలు ఉన్నాయి . ఒక పార్టీని మించి మరొకటి నోటుతో ఓటు విలువను లెక్కగడుతు న్నాయి . పోటీ పడి మరీ ప్రత్యర్థి పార్టీ కంటే కాస్త ఎక్కువ ఇవ్వడానికే ఆరాటపడుతున్నాయి.

  Independence day 2022: తెలంగాణలో కోటి 20లక్షల జాతీయ జెండాల పంపిణి .. 15వ తేదిన ప్రతి ఇంటిపై కనిపించాలని పిలుపు


  గెలుపే లక్ష్యంగా నగదు ప్రవాహం...
  ఓటర్లకు నోట్లు పంపిణీ చేసే వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి . ఇలాంటి వాటికి తావివ్వకుండా పార్టీలు పకడ్బం దీగా ప్లాన్ చేస్తున్నాయి . ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నాయకులు. అలాగే చోట మోటా లీడర్లు.. వారికున్న సిరస్తులను అమ్ముకొని భారీగా డబ్బులను ఒక్క దగ్గర డంపు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆశావాహులు కూడా ఈసారి టికెట్ తమకే వస్తుందన్న నమ్మకం తో అప్పులు చేసి మరీ డబ్బులు స్టోర్ చేసుకుంటున్నారంటే ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పటికే అర్ధం అవుతుంది. డబ్బు ఉంటేనే గెలుపు అనేది మన నాయకులు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Karimangar, Telangana Politics

  తదుపరి వార్తలు