వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP)అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila )ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఢిల్లీ పర్యటన తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్న షర్మిల కొద్ది సేపటి క్రితం టీఎస్ పీఎస్‌సీ దగ్గర ఆందోళన చేపట్టేందుకు బయల్దేరారు. అయితే షర్మిల ఇంటి దగ్గర మోహరించిన పోలీసు బలగాలు ఆమెను అడ్డుకున్నారు. ఇప్పటికే టీఎస్ పీఎస్‌సీ పేపర్ లీక్ వ్యవహారంపై రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటుతున్న సమయంలో షర్మిల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో ధర్నాకు బయల్దేరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదెక్కడి ప్రజాస్వామ్యం..
నిరుద్యోగుల పక్షాన శాంతియుతంగా పోరాడుతుంటే హౌజ్ అరెస్ట్ చేయడం దుర్మార్గమని వైఎస్ షర్మిల అన్నారు. TSPSC అక్రమాలపై CBI దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేండ్లుగా బయటపడని అక్రమాలను కూడా తేల్చాలన్నారు. ఈ కుంభకోణంలో ఉద్యోగులతో పాటు బోర్డు సభ్యులు, మంత్రుల హస్తం కూడా ఉందని ఆరోపించారు. TSPSC నిరుద్యోగుల విశ్వసనీయత కోల్పోయిందన్నారు వైఎస్ షర్మిల.
నిరుద్యోగుల పక్షాన శాంతియుతంగా పోరాడుతుంటే హౌజ్ అరెస్ట్ చేయడం దుర్మార్గం. TSPSC అక్రమాలపై CBI దర్యాప్తు చేపట్టాలి. ఎనిమిదేండ్లుగా బయటపడని అక్రమాలను కూడా తేల్చాలి. ఈ కుంభకోణంలో ఉద్యోగులతో పాటు బోర్డు సభ్యులు, మంత్రుల హస్తం కూడా ఉంది. TSPSC నిరుద్యోగుల విశ్వసనీయత కోల్పోయింది. 1/2 pic.twitter.com/cNjYjtH1wd
— YS Sharmila (@realyssharmila) March 17, 2023
నిరసనల హోరు..
కొలువులు అమ్ముకున్న సర్కారుకు గుణపాఠం తప్పదంటూ..కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్‌టీపీ శ్రేణులు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana Politics, YS Sharmila