Home /News /telangana /

TS POLITICS POLICE ON HIGH ALERT AS TRS LEADERS JUPALLI AND MLA HARSHA VARADHAN PREPARE FOR PUBLIC DEBATE IN KOLHAPUR IN NAGAR KURNOOL PRV

Kolhapur TRS: కొల్లాపూర్​లో హై టెన్షన్​.. టీఆర్​ఎస్​ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హౌస్​ అరెస్టు.. 

జూపల్లి, హర్షవర్దన్​ (ఫైల్​)

జూపల్లి, హర్షవర్దన్​ (ఫైల్​)

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో పొలిటికల్‌ హీట్‌ ఉత్కంఠ రేపుతోంది. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది.

    మహబూబ్‌ నగర్‌ (Mahbubnagar) జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌ (TRS) పార్టీలో పొలిటికల్‌ హీట్‌ ఉత్కంఠ రేపుతోంది. నాగర్‌ కర్నూల్‌ (NagarKurnool) జిల్లా కొల్లాపూర్‌ (Kolhapur)లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli KrishnaRao), ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి (HarshaVardhan Reddy)మధ్య మాటల యుద్ధం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. అధికార గులాబీ పార్టీకి చెందిన నేతలిద్దరూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. నియోజకవర్గం అభివృద్ధి, అవినీతి విషయంలో గులాబీ నేతలిద్దరూ ఓపెన్‌ చాలెంజ్‌ చేస్తూ బహిరంగ చర్చకు సిద్దమంటూ కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆదివారం కొల్లాపూర్‌ (Kolhapur)లో టెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. శనివారం రాత్రికే జూపల్లి, ఎమ్మెల్యే హర్షవర్దన్‌ కొల్లాపూర్‌ చేరుకున్నారు.

    జూపల్లి ఇంటి వద్దకు అనుచరులు..

    ఈ క్రమంలో పోలీసులు (Police) అప‍్రమత్తమయ్యారు. చర్చలకు, ర్యాలీలకు అనుమతిలేదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చారు. మరోవైపు.. జూపల్లి ఇంటి వద్ద ఆదివారం ఉదయం భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.  కొల్లాపూర్‌లో జూపల్లి ఇంటి వద్దకు ఆయన అనుచరులు రావడంతో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ ఇంటి వద్ద పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఇద్దరు నేతలను పోలీసులు.. ఇంటికే పరిమితం చేశారు.

    గత కొంత కాలంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో  జూపల్లి, హర్షవర్ధన్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. కేసీఆర్ (CM KCR)తొలి ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు జూపల్లి కృష్ణారావు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో జూపల్లి ఓడిపోయారు. తర్వాత బీరం టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి జూపల్లి, బీరం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. అభివృద్ధి విషయంలో సవాళ్లు విసురుకున్నారు. ఇటీవల కాలంలో ఇది మరింతగా ముదిరింది. జూపల్లి, బీరం వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.

    అంబేడ్కర్​ విగ్రహం దగ్గరకు రావాలని..

    పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా కొల్లాపూర్ నియోజకవర్గంలో గొడవలే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అభివృద్ధిపై తనతో చర్చకు రావాలని జూపల్లి సవాల్ చేయగా.. బీరం కూడా సై అన్నారు. అంబేడ్కర్​ విగ్రహం దగ్గరకు రావాలని సవాల్ చేసుకున్నారు. దీంతో పోలీసులు ముందస్తుగానే ఇద్దరు నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు.

    ఇటీవలే నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. జూపల్లి, హర్షవర్ధన్ మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. జూపల్లి ఇంటికి వెళ్లి అతనితో మాట్లాడారు. కేటీఆర్ టూర్ తర్వాత పరిస్థితి చక్కబడుతుందని కొల్లాపూర్ టీఆర్ఎస్ కార్యకర్తలు భావించారు. కాని సీన్ మరోలా మారింది. విభేదాలు మరింతగా ముదిరిపోయాయి. అంతేకాదు శనివారం జూపల్లి సంచలన కామెంట్లు చేశారు.

    ఎమ్మెల్యేకు తనకు మధ్య జరిగే చర్చకు కేటీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొల్లాపూర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరే తేల్చుకుంటానని చెప్పారు. తన ఇమేజ్ డ్యామేజ్ చేస్తే చేతులు కట్టుకుని ఇంట్లో ఎలా కూర్చూంటానని జూపల్లి అన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలకు ఎమ్మెల్యే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎంత దూరమైనా వెళతానని జూపల్లి కృష్ణారావు తేల్చి చెప్పారు. పార్టీ మార్పుపై వస్తున్న వార్చలపైనా స్పందించిన జూపల్లి.. అవన్ని తప్పుడు వార్తలని అన్నారు జూపల్లి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Mahbubnagar, Nagarkurnool, Telangana Politics, Trs, TRS leaders

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు