Home /News /telangana /

TS POLITICS POLICE COMPLAINT ON THEFT NEAR MISSION BHAGIRATHA PYLON LAUNCHED BY KTR IN KARIMNAGAR DISTRICT SNR KNR

KCR | KTR : కేసీఆర్, కేటీఆర్‌కు ఘోర అవమానం.. నాడు మొక్క..నేడు బిందె మాయం

KARIMNAGAR

KARIMNAGAR

Telangana | KCR: కేసీఆర్, కేటీఆర్‌కు సెంటిమెంట్‌గా కలిసొచ్చిన కరీంనగర్ జిల్లా ఆ విషయంలో కలిసి రావడం లేదా..? ఉద్యమ ప్రస్థానంలో తోడున్న వాసులే హ్యాండ్ ఇస్తున్నారా .. ? ఆ రెండు ఘటనలు చూస్తుంటే నాడు కేసిఆర్‌కు, నేడు కేటీఆర్‌కు షాక్ ఇచ్చినట్టయ్యాయి.

ఇంకా చదవండి ...
    (P.Srinivas,New18,Karimnagar)
    కేసీఆర్(KCR),కేటీఆర్‌(KTR)కు సెంటిమెంట్‌గా కలిసొచ్చిన కరీంనగర్(Karimnagar)జిల్లా ఆ విషయంలో కలిసి రావడం లేదా..? ఉద్యమ ప్రస్థానంలో తోడున్న వాసులే హ్యాండ్ ఇస్తున్నారా .. ? ఆ రెండు ఘటనలు చూస్తుంటే నాడు కేసిఆర్‌కు, నేడు కేటీఆర్‌కు షాక్ ఇచ్చినట్టయ్యాయి. తెలంగాణ సీఎం, తెలంగాణ ఉద్యమ విజేత కేసీఆర్ ఏ ఉద్యమం అయినా కరీంనగర్ నుండే ప్రారంభించడం అనవయితీగా వస్తుంది. ఇక్కడ ప్రారంభించిన ఏ కారక్రమమైనా సక్సెస్ అవుతుందనేది కేసీఆర్‌కి ఉన్న గట్టి నమ్మకం. ఆ సెంటిమెంటే నీరుగారిపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

    Corona Fear : ఒక్కరోజులో వంద మందికి కరోనా వ్యాప్తి .. జిల్లా ప్రజల్ని వణికిస్తున్న వైరస్



    ఎందుకిలా అవుతోంది..?
    తెలంగాణ సీఎం కేసీఆర్ ఏదైనా ప్రతిష్టాత్మకంగా భావించే కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభిస్తారు. అది ఇప్పుడు పాటిస్తున్న సెంటిమెంట్‌ కాదు 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ నుండి 2009లో చేపట్టిన ఆమరణ దీక్ష వరకూ ప్రతి ఆందోళనను కరీంనగర్ జిల్లానే వేదికగా మార్చుకున్నారు. ఇప్పటికీ కరీంనగర్ అంటేనే సీఎంకు ఏనలేని అభిమానమని టీఆర్ఎస్ నేతలు కూడా తరుచూ చెబుతుంటారు. అంతటి ప్రత్యేకత ఉన్న కరీంనగర్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్‌కి షాకిచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు కొందరు స్థానికులు.



    నాడు మొక్క మాయం..
    రాష్ట్రం పచ్చదనంగా ఉండాలన్న సంకల్పంతో తెలంగాణాకు హరితహారం కార్యక్రమం చేపట్టారు కేసీఆర్. ఇందులో భాగంగానే గతంలో కరీంనగర్ లో పర్యటించిన గులాబీ బాస్ కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం దిగువన సంపంగి మొక్క నాటారు. సీఎం నాటిన ఆ మొక్క కొన్ని రోజుల్లోనే మాయం అయిపోయింది. ఈవార్త సంచలనంగా మారడంతో అధికారులు అదే స్థానంలో మరో మొక్కను నాటి చేతులు దులుపుకున్నారు. ఆ మొక్కను పట్టుకెళ్లిన వాళ్లను సైతం పోలీసులు పట్టుకున్నారు. అక్కడ ప్రత్యేకమైన పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.

    నేడు బిందె చోరీ..
    తాజాగా కరీంనగర్ లో మిషన్ భగీరథ పైలాన్‌లో ఏర్పాటు చేసిన బిందె మాయం అయింది. నగరంలో ఇంటింటికి తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ కార్యక్రమం ప్రారంభించినందుకు గుర్తుగా భారీ సైజు పైలాన్‌ను అధికారులు నిర్మించారు. మానేరు వంతెన వద్ద నిర్మించిన ఈ పైలాన్‌ను రెండు చేతుల నుండి కింద పడుతున్న నీటి చుక్క బిందెలో పడుతుందన్నట్టుగా తయారు చేశారు. గత మార్చి 17న మంత్రి కేటీఆర్ ప్రారంభించిన పైలాన్‌లోని బిందె మాయం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

    Telangana | Cheddigang : బట్టలు వేసుకోకుండా వచ్చి భయపెడుతున్నారు .. రాత్రి పూట నిద్రపోని అక్కడి జనం



    పోలీస్ కంప్లైంట్ ..
    నాడు తండ్రి నాటిన మొక్క ... నేడు తనయుడు ఓపెన్ చేసిన బిందె మాయం కావడం యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ ఇద్దరి చేతుల జరిగిన కార్యక్రమాలకు సంబంధించినవే అదృశ్యమవడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపైన వన్‌టౌన్ పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చారు కార్పొరేషన్ ఏ ఎ.ఈ వాణి. 210/2022 నంబర్ తో ఐపీసీ 379 సెక్షన్ కింద ఎఫ్.ఐ. ఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.తెలిపారు. ఈ రెండు సంఘటనలు చూస్తుంటే జిల్లా ప్రజల్లో టీఆర్ఎస్‌పై అభిమానం తగ్గిందా లేక కేసీఆర్, కేటీఆర్‌కే కరీంనగర్ జిల్లాపై ఉన్నసెంటిమెంట్‌ నీరుగారిపోతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: CM KCR, Karimangar, KTR, Telangana Politics

    తదుపరి వార్తలు