హోమ్ /వార్తలు /తెలంగాణ /

తెలంగాణకు ప్రధాని మోదీ.. నెల రోజుల్లో ముగ్గురు కీలక నేతల టూర్.. బీజేపీ అంత సీరియస్‌గా తీసుకుందా ?

తెలంగాణకు ప్రధాని మోదీ.. నెల రోజుల్లో ముగ్గురు కీలక నేతల టూర్.. బీజేపీ అంత సీరియస్‌గా తీసుకుందా ?

ప్రధాని మోదీ, తెలంగాణ (ప్రతీకాత్మక చిత్రం)

ప్రధాని మోదీ, తెలంగాణ (ప్రతీకాత్మక చిత్రం)

Telangana| PM Modi: గతంలోనూ జీహెచ్ఎంసీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ప్రధాని మోదీ ఓ అధికారిక కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చారు.

తెలంగాణ రాజకీయాలపై బీజేపీ జాతీయ నాయకత్వం ఎంతగానో ఫోకస్ చేసింది. రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం కనిపిస్తుండటంతో.. ఈ పరిస్థితులను మరింత అనుకూలంగా మార్చుకోవడం ఎలా అనే దానిపై కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు. ఓ వైపు తెలంగాణ బీజేపీ (Telangana BJP) నేతలు రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు జాతీయ నాయకులు సైతం తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ ముఖ్యనేతలు కొద్ది రోజుల వ్యవధిలోనే తెలంగాణ పర్యటనలకు ప్లాన్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. ఆ తరువాత బీజేపీ ముఖ్యనేత అమిత్ షా కూడా తెలంగాణకు వచ్చి అధికార టీఆర్ఎస్‌ను టార్గెట్ చేశారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు అమిత్ షా తెలంగాణకు వచ్చి వెళ్లిన రెండు వారాల వ్యవధిలోనే ప్రధాని మోదీ (PM Modi) కూడా రాష్ట్రానికి రానుండటం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 26 ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు.

వాస్తవానికి ప్రధాని మోదీ ఓ ప్రత్యేకమైన కార్యక్రమం కోసం హైదరాబాద్ వస్తున్నప్పటికీ.. ఆయన రాష్ట్రంలో బీజేపీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు ఈ పర్యటన ఖరారు చేసుకున్నట్టు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారంటే.. తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటుంది. ఆయన కూడా పార్టీ నేతలకు ఏదో ఒక రకమైన దిశానిర్దేశం చేస్తారు. తెలంగాణలోని బీజేపీ శ్రేణులకు ప్రాధాన్యత ఇస్తున్నామని సంకేతాలను ప్రధాని మోదీ కచ్చితంగా ఇస్తారు.

CM KCR | Centre : ఉద్యోగులకు 50 శాతం జీతాలు! -అప్పులపై కేంద్రం ఆంక్షలతో కటకట -కేసీఆర్ కాంప్రమైజ్?

Disha Case Encounter: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకం.. తేల్చిచెప్పిన సిర్పూర్కర్ కమిషన్.. పూర్తి వివరాలు

గతంలోనూ జీహెచ్ఎంసీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ప్రధాని మోదీ ఓ అధికారిక కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చారు. ఆయన వచ్చిన కార్యక్రమం వేరే అయినప్పటికీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం పతాకస్థాయిలో ఉన్నప్పుడు ప్రధాని మోదీ రావడం బీజేపీ శ్రేణులకు చాలావరకు ఉత్సాహం కలిగింది. తాజాగా కొద్దిరోజుల వ్యవధిలోనే బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షా, నరేంద్రమోదీ తెలంగాణకు వస్తుండటంతో.. తమ పార్టీ నాయకత్వం బీజేపీపై ఎక్కువగా ఫోకస్ చేసిందనే విషయం అర్థమవుతోందని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇది ప్రజల్లో తమ పార్టీకి మరింతగా మైలేజీ వచ్చేందుకు కారణమవుతుందని లెక్కలు వేసుకుంటున్నాయి.

First published:

Tags: Pm modi, Telangana

ఉత్తమ కథలు