Home /News /telangana /

TS POLITICS PM MODI MAY EXPAND UNION CABINET AFTER PRESIDENTIAL POLLS TELANGANA LIKELY TO GET 2ND BERTH BJP MAY INVITE YSRCP BJD MKS

Union Cabinet : కేంద్ర కేబినెట్‌లో మార్పులు.. తెలంగాణకు మరో బెర్త్.. జగన్ వైసీపీకీ అహ్వానం?

జగన్, మోదీ, లక్ష్మణ్, సంజయ్ (ఫైల్ ఫొటోలు)

జగన్, మోదీ, లక్ష్మణ్, సంజయ్ (ఫైల్ ఫొటోలు)

రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ హైకమాండ్ కేంద్ర కేబినెట్ లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు రెండో బెర్త్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్డీఏలో లేని మిత్రులను సైతం ఆహ్వానించే అవకాశాలున్నాయి..

ఇంకా చదవండి ...
కేంద్ర మంత్రులపై పెరిగిన పని భారం.. ఇటీవలే ఇద్దరు సీనియర్ మంత్రుల రాజీనామాలు.. ఇప్పుడున్న మంత్రుల్లో కొందరి పనితీరుపై ప్రధానికి మోదీకి అసంతృప్తి.. వచ్చే రెండేళ్లలో కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. మిత్రులను కూడా మంత్రిమండలిలోకి ఆహ్వానించాలనే బీజేపీ ఆలోచన.. తదితర అంశాల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ (Union Cabinet)లో మార్పులు చేసే అవకాశాలున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలు (Presidential Elections) ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), బీజేపీ (BJP) హైకమాండ్ ఇదే అంశంపై దృష్టిపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు రెండో బెర్త్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. వివరాలివే..

మరోసారి అవకాశం దక్కక.. రాజ్యసభ పదవీ కాలం పూర్తి కావడంతో మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ, ఉక్కు శాఖ మంత్రి ఆర్‌సీపీ సింగ్‌ ఇటీవల పదవులకు రాజీనామా చేశారు. వీరిద్దరి స్థానాలను భర్తీ చేయాల్సి ఉన్నది. పనితీరు ఆధారంగా కొందరు మంత్రులను తప్పిస్తారనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే పలు రాష్ట్రాలకు చెందిన కొందరికి అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు.

TRSలో కట్టప్పలు.. KCR కొంపముంచే కారణమిదే : మహా సీన్ రిపీట్ ఎందుకంటే : లక్ష్మణ్


తెలంగాణ నుంచి ఇప్పటికే కిషన్ రెడ్డి (సికింద్రాబాద్ ఎంపీ) కేంద్రంలో కేబినెట్ ర్యాంక్ మంత్రిగా కొనసాగుతుండగా, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శ్రేణులకు మరింత ఊపునిచ్చే విధంగా రాష్ట్రానికి రెండో బెర్త్ కూడా కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన డాక్టర్ కె.లక్షణ్ ఈ రేసులో ముందున్నారు. ఆదివాసీల పోడు భూముల అంశం కొద్ది నెలలుగా రగులుతోన్న క్రమంలో సీఎం కేసీఆర్ ను మరింత ఇరుకున పెట్టేలా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావును కేంద్ర కేబినెట్ లోకి చేర్చుకుంటే ఎలా ఉంటుందని కూడా బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Marburg virus : మరో ప్రాణాంతక వైరస్‌.. మార్బర్గ్‌ వ్యాప్తిపై WHO వార్నింగ్.. సోకితే చావే! లక్షణాలివే..


టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ (కరీంనగర్ ఎంపీ)కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చినట్లయితే.. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అరెస్టులు, నిర్బంధాల ఒత్తిళ్లను తిప్పికొట్టొచ్చనే ఆలోచనలోనూ బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి బండికి రక్షణగా మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. అయితే, ఎన్నికల వరకు ఆయనే అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలుండటంతో రెండు పదవులను మేనేజ్ చేయడం ఇబ్బందికరంగా మారొచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. బాపూరావు, లక్ష్మణ్ లలో ఒకరికి మాత్రం కచ్చితంగా పదవి దక్కొచ్చనే అంచనాలున్నాయి.

Anand Sharma : కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి ఆనంద్ శర్మ! -జేపీ నడ్డాతో భేటీ..


ముందస్తు లేకుంటే తెలంగాణలో వచ్చే ఏడాది నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, ఏడాది డిసెంబరులో గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, వచ్చే ఏడాది కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటితో పాటు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌, మిజోరంలోనూ 2023లో ఎన్నికలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రివర్గంలో ఈ రాష్ట్రాలకు ప్రాధాన్యత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advocate Rachana Reddy : బీజేపీలోకి ఫైర్‌బ్రాండ్! -బండితో అడ్వొకేట్ రచనా రెడ్డి చర్చలు..


కేంద్ర కేబినెట్ లో మార్పులు చోటుచేసుకున్న ప్రతిసారి లాగే ఈసారి కూడా ఎన్డీఏలో భాగస్వామ్యులు కాని మిత్రులను బీజేపీ ఆహ్వానించే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ సారధ్యంలోని వైసీపీ తొలి నుంచీ మోదీ సర్కారుకు అనధికార మిత్రురాలిగా కొనసాగుతున్నది. ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ సైతం బీజేపీకి మద్దతుగా ఉంటున్నది. ఈ ఇద్దరినీ కేంద్ర కేబినెట్ లోకి ఆహ్వానించాలని బీజేపీ భావిస్తున్నా, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ ఇద్దరూ సున్నితంగా తిరస్కరించే అవకాశాలే ఎక్కువ.కొత్త  రాష్ట్రపతి ఈ నెల 17న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాతే మోదీ మంత్రివర్గాన్ని విస్తరించవచ్చునని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 18 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లోనే పని కానివ్వాలనే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, Telangana, Union cabinet, Ysrcp

తదుపరి వార్తలు