తెలంగాణ(Telangana)లో రెండ్రోజులుగా కొనసాగిన రాజకీయ పరిణామాలకు బీజేపీ (BJP)విజయ సంకల్ప సభ వేదికగా ప్రధాని మోదీ (Modi)ముగింపు పలికారు. కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై రాష్ట్ర అధికార పార్టీ నేతల విమర్శలు, ప్రచారంపై ప్రధాని మోదీ తెలివిగా తిప్పి కొట్టారని బీజేపీ శ్రేణులు ఆనంద పడుతున్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని ప్రజలకు అర్ధమయ్యేలా తన సుదీర్ఘ ప్రసంగం ద్వారా చెప్పారు. సభా వేదికపై సుమారు అరగంట సేపు ప్రసంగించిన మోదీ టీఆర్ఎస్(TRS)ను, కేసీఆర్‌ను, రాజకీయ పరమైన అంశాల జోలికి పోకుండా తెలంగాణకు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు ఇప్పటి వరకు చేసింది ఏమిటి ? ఇకపై చేయబోయేది మాత్రమే చెప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం (Saturday)చేసిన విమర్శలు, సంధించిన ప్రశ్నలకు పరోక్షంగా సమాధానం ఇచ్చి తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ప్రధాని మోదీ. కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రధాని స్థాయి వ్యక్తి ఒక రాష్ట్ర సీఎం వేసిన ప్రశ్నలకు, విమర్శలకు స్పందించాల్సిన అవసరం లేదన్నట్లుగా మోదీ ప్రసంగం కొనసాగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ పేరు ప్రస్తావన తేకుండానే ఆయన చేసిన వ్యాఖ్యలు, విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా మోదీ భావించడం చూస్తుంటే పరోక్షంగా అవమానించినట్లుగా కనిపిస్తోందంని బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
కేసీఆర్‌కు రివర్స్ కౌంటర్..
తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపీ రెండ్రోజుల పాటు జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించింది. ఈసమావేశాల నిర్వాహణపై టీఆర్ఎస్ పార్టీ నిరసన, అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికి కమలం పార్టీ పొలిటికల్ స్ట్రాటజీతో టీఆర్ఎస్ను ఎదురుదెబ్బ కొట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని మోదీకి కేసీఆర్ తొమ్మిది ప్రశ్నలను సంధిస్తే ..దానికి కౌంటర్‌గా బీజేపీలో మోదీ మినహా అగ్రస్థాయి నాయకులంతా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ కుటుంబ పాలనను ఎండగట్టారు. ఒక రకంగా చూసుకుంటే కేసీఆర్ ప్రధానిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తే ..మోదీ అసలు కేసీఆర్‌ని లెక్కచేయకుండా అవమానించినట్లుగా చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. తాను మాత్రం కేసీఆర్‌ని పల్లెత్తు మాట అనకుండా తన కింది స్ధాయి నేతలతో గట్టిగా కౌంటర్ ఇప్పించారు ప్రధాని అనే చర్చ కూడా పొలిటికల్ సర్కిల్లో విస్తృతంగా జరుగుతోంది.
తెలివిగా తిప్పి కొట్టిన కమలనాథులు..
ప్రత్యర్ధి విమర్శలపై స్పందించి మన విలువను తగ్గించుకోవడం కంటే అసలు వారి ఊసే ఎత్తకపోతే విమర్శలు చేసిన వాళ్లే అవమానపడతారు కదా అనే క్లీన్ పొలిటికల్ స్ట్రాటజీని ప్రధాని మోదీ ఫాలో అయినట్లుగా ఉందంటున్నారు పొలిటికల్ అనలిస్ట్‌లు. అందుకే మోదీని తిట్టి టీఆర్ఎస్ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటే పరేడ్ గ్రౌండ్ పబ్లిక్ మీటింగ్‌ను బీజేపీ తమకు ప్లస్ అయ్యేలా మార్చుకున్నారు కమలనాథులు అంటున్నారు సొంత పార్టీ నాయకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.