హోమ్ /వార్తలు /తెలంగాణ /

PM Modi : శభాష్ బండి: మోదీ ఫోన్ కాల్ -ఇక సీఎం వర్సెస్ పీఎం కాదు.. కేసీఆర్ వర్సెస్ సంజయ్!

PM Modi : శభాష్ బండి: మోదీ ఫోన్ కాల్ -ఇక సీఎం వర్సెస్ పీఎం కాదు.. కేసీఆర్ వర్సెస్ సంజయ్!

మోదీతో సంజయ్ (పాత ఫొటో)

మోదీతో సంజయ్ (పాత ఫొటో)

టీబీజేపీ చీఫ్ బండికి ప్రధాని మోదీ ఫోన్ కాల్ చేశారు. ప్రజాసంగ్రామ యాత్ర, తుక్కుగూడలో బీజేపీ బహిరంగ సభ సక్సెస్ పై మోదీ ఆరా తీశారు. సంజయ్ తోపాటు టీబీజేపీ శ్రేణులంతా కష్టపడి పనిచేస్తున్నారని ప్రధాని అభినందించారు. వివరాలివే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి ఫోన్ చేశారు. ప్రజాసంగ్రామ యాత్ర, తుక్కుగూడలో బీజేపీ బహిరంగ సభ సక్సెస్ పై మోదీ ఆరా తీశారు. సంజయ్ తోపాటు టీబీజేపీ శ్రేణులంతా కష్టపడి పనిచేస్తున్నారని ప్రధాని అభినందించారు. చనిపోయిన సాయి గణేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఖమ్మం వెళ్తుండగా మార్గ మధ్యలో బండి సంజయ్ కు ప్రధాని నుంచి ఫోన్ వచ్చిన విషయంపై టీబీజేపీ తాజాగా ఒక ప్రకటన చేసింది.

తెలంగాణలో పార్టీ విస్తరణ కోసం కష్టపడి పని చేస్తున్నారంటూ బండి సంజయ్ ని మోదీ అభినందించారని, ప్రజా సంగ్రామ సేనతోపాటు పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలకు తన తరఫున అభినందనలు చెప్పాల్సిందిగా సంజయ్ ని మోదీ కోరినట్లు టీబీజేపీ పేర్కొంది. ‘మీ స్ఫూర్తితో.. మీ సూచనలతోనే పాదయాత్ర చేపట్టాను.. రెండు విడతల్లో కలిపి 770 కి.మీలు నడిచాను. నడిచింది నేనయినా.. నడిపించింది మీరే.. మీరే..’ అంటూ మోదీకి సంజయ్ బదులిచ్చారని పార్టీ పేర్కొంది.

Bandi sanjay కూల్చడమేంటి? తనను జాకీలతో లేపిందే KCR కదా! -ప్లీజ్ అనడానికి సిగ్గులేదా?: కేఎన్


ప్రధాని మోదీ మంత్రం సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ తోనే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు పాదయాత్ర చేస్తున్నామని మోదీకి సంజయ్ వివరించారు. పాదయాత్రలో ప్రజలు ఏమంటున్నారని మోదీ ఆరా తీయగా.. కేసీఆర్ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, కేంద్ర పథకాలు తెలంగాణలో అమలు చేయకుండా కేసీఆర్ తెరమరుగు చేసే కుట్రను కూడా ప్రజలు గుర్తించారని సంజయ్ వివరించినట్లు బీజేపీ తెలిపింది.


BJP | Tukkuguda : ప్లీజ్.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి: తుక్కుగూడ సభలో బండి సంజయ్ సంచలన ప్రసంగం.. కీలక హామీలు..


తెలంగాణలోనూ మోదీ నీతివంతమైన పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చానని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల రాకతో కార్యకర్తల్లో మరింత జోష్ పెరిగిందని మోదీకి సంజయ్ తెలిపారు. రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ సూచనలు సత్ఫలితాలు ఇచ్చాయని, పార్టీ బలోపేతం కోసం ఇంకా కష్టపడతామనీ చెప్పారు. ప్రధాని కాల్ తో కార్యకర్తల్లో నూతనోత్సాహం వస్తుందంటూ సంజయ్ సంతోషం వ్యక్తం చేశారని టీబీజేపీ పేర్కొంది. ఇదిలా ఉంటే,

Amit Shah| Tukkuguda : కేసీఆర్‌ను పీకిపారేయడానికి బండి సంజయ్ చాలు: తుక్కుగూడ సభలో అమిత్ షా


తెలంగాణలో బీజేపీ వరుస విజయాల క్రమంలో ఆ పార్టీని టార్గెట్ చేసిన సీఎం కేసీఆర్.. అంశాల వారీగా తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాల విషయంలో కేంద్రంపై తీవ్ర స్థాయి పోరాటానికి పూనుకోవడం, మోదీని గద్దె దించి, బీజేపీని బంగాళాఖాతంలో కలిపేస్తానని శపథాలు చేయడం తెలిసిందే. అయితే, ఇన్నాళ్లూ సీఎం కేసీఆర్ వర్సెస్ పీఎం మోదీ అన్నట్లుగా సాగిన పోరును ఇకపై కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్ అనే నెరేటివ్ గా మార్చేందుకు బీజేపీ తుక్కుగూడ సభలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కేసీఆర్ ను గద్దె దించడానికి బండి సంజయ్‌ ఒక్కడు చాలని, ఢిల్లీ పెద్దలు అవసరం లేదని అమిత్ షా ప్రకటన చేయడం అందులో భాగమేనని తెలుస్తోంది. బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ నే బీజేపీ సీఎం అభ్యర్థిగానూ హైకమాండ్ ప్రకటించే అవకాశాలున్నట్లు నిన్నటి సభ తర్వాత విస్తృతంగా చర్చ జరుగుతోంది.

First published:

Tags: Amit Shah, Bandi sanjay, Bjp, CM KCR, Hyderabad, Pm modi, Telangana

ఉత్తమ కథలు