Home /News /telangana /

TS POLITICS PM MODI AND AMIT SHAH FOCUS ON TELANGANA ONCE AGAIN CLEAR AFTER TELANGANA BJP LEADER LAKSHMAN SENT TO RAJYA SABHA AK

Telangana| BJP: ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. బీజేపీ నిర్ణయం రెండు రకాలుగా కలిసి రానుందా ?

ప్రధాని మోదీ, తెలంగాణ (ప్రతీకాత్మక చిత్రం)

ప్రధాని మోదీ, తెలంగాణ (ప్రతీకాత్మక చిత్రం)

Telangana: యూపీ నుంచి తెలంగాణకు చెందిన లక్ష్మణ్‌ను రాజ్యసభకు పంపడం ద్వారా తాము తెలంగాణపై ఏ స్థాయిలో ఫోకస్ చేస్తున్నామో చెప్పకనే చెప్పింది.

    రాజకీయాల పార్టీలు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనేక రకాలుగా ఆలోచిస్తుంటాయి. తాజాగా యూపీ కోటాలో తెలంగాణ నుంచి లక్ష్మణ్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయడం వెనుక కూడా అలాంటి వ్యూహమే ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీకి మంచి ఊపు ఉంది. కొన్నేళ్లుగా తెలంగాణలో ఆ పార్టీ ఆశించిన దానికంటే మిన్నగా ఫలితాలు సాధిస్తుండటంతో... బీజేపీ (BJP) హైకమాండ్ దృష్టి తెలంగాణ అధికార పీఠంపై పడింది. ఆ దిశగా ఏం చేయాలో అన్నీ చేస్తోంది ఆ పార్టీ జాతీయ నాయకత్వం. ఓ వైపు తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూనే.. తాము ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలో తీసుకుంటోంది. ఈ క్రమంలోనే యూపీ కోటాలో తెలంగాణ నుంచి ఒకరిని రాజ్యసభకు పంపాలని నిర్ణయం తీసుకుంది.

    ఇందుకోసం ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై బీజేపీ నాయకత్వం బాగానే కసరత్తు చేస్తోంది. టీఆర్ఎస్ తరపున ఎంపిక చేసిన అభ్యర్థులంతా ఆర్థికంగా బలమైన వారే అనే చర్చ జరుగుతోంది. ఉద్యమం నుంచి వచ్చిన వారికంటే ఎక్కువగా ఆర్థికంగా బలమైన వారికే కేసీఆర్(KCR) రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇచ్చారని విపక్షాలు.. అందులోనూ బీజేపీ ఎక్కువగా విమర్శలు గుప్పించింది. ఆ క్రమంలో తమ పార్టీ తరపున బీసీ వర్గానికి చెందిన లక్ష్మణ్‌ను రాజ్యసభకు ఎంపిక చేసింది.

    లక్ష్మణ్‌ను రాజ్యసభకు పంపడం ద్వారా బీజేపీ తమకు రెండు రకాలుగా ప్రయోజనం కలుగుతుందని భావిస్తోంది. తెలంగాణలోని బీసీకి తాము మరో రాష్ట్రం ద్వారా రాజ్యసభకు పంపాలని చెప్పుకునేందుకు ఆ పార్టీకి అవకాశం దక్కుతుంది. ఇక టీఆర్ఎస్ తరహాలో పార్టీలో పని చేయని వారికి టికెట్ ఇచ్చే సంస్కృతికి తమది కాదని.. అందుకే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న లక్ష్మణ్‌కు(Lakshman) అవకాశం ఇచ్చామని చెప్పుకోవడానికి ఆ పార్టీకి అవకాశం కలుగుతుంది.

    CM KCR | Centre : తెలంగాణలో ఆర్థిక సంక్షోభం? -జీతాలు, పథకాలకు నిధులు కటకట -చేబదుళ్లు, ఓడీపై దృష్టి!

    KCR| NTR: ఎన్టీఆర్ విషయంలో టీఆర్ఎస్ లెక్కలు అలా ఉన్నాయా ? కేసీఆర్ అంతదూరం ఆలోచిస్తున్నారా ?

    ఇక యూపీ నుంచి తెలంగాణ వ్యక్తిని రాజ్యసభకు పంపడం ద్వారా తాము తెలంగాణపై ఏ స్థాయిలో ఫోకస్ చేస్తున్నామో చెప్పకనే చెప్పింది. ఈ రకమైన నిర్ణయం ద్వారా తెలంగాణ కేడర్‌లోనూ జోష్ నింపింది. మొత్తానికి ఉత్తరప్రదేశ్ కోటాలో తెలంగాణకు చెందిన లక్ష్మణ్‌ను రాజ్యసభకు పంపిన బీజేపీ.. ఈ నిర్ణయం ద్వారా టీఆర్ఎస్‌కు అనేక సవాళ్లు విసరడంతో పాటు తెలంగాణపై తమ ఫోకస్ మరింతగా పెరిగిందని చెప్పకనే చెప్పింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, Rajya Sabha, Telangana

    తదుపరి వార్తలు