హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: కేసీఆర్ ను కలవనున్న పైలట్ రోహిత్..ఈడీ నోటిసులపై ఏం చేద్దాం?

Telangana: కేసీఆర్ ను కలవనున్న పైలట్ రోహిత్..ఈడీ నోటిసులపై ఏం చేద్దాం?

కేసీఆర్, పైలట్ రోహిత్ రెడ్డి

కేసీఆర్, పైలట్ రోహిత్ రెడ్డి

తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) ప్రకంపనలు పూర్తిగా తొలగిపోకముందే బెంగళూరు డ్రగ్స్ కేసు తెరపైకి రావడం సంచలనంగా మారింది. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రశ్నించి మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇక ఇప్పుడు తాండూరు టీఆర్.ఎస్ ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డికి (Pilot Rohit Reddy) డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు గులాబీ నేతల్లో టెన్షన్ పెట్టిస్తుంది. ఈ క్రమంలో కేసీఆర్ తో పైలట్ రోహిత్ రెడ్డి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) ప్రకంపనలు పూర్తిగా తొలగిపోకముందే బెంగళూరు డ్రగ్స్ కేసు తెరపైకి రావడం సంచలనంగా మారింది. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రశ్నించి మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇక ఇప్పుడు తాండూరు టీఆర్.ఎస్ ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డికి (Pilot Rohit Reddy) డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు గులాబీ నేతల్లో టెన్షన్ పెట్టిస్తుంది. టీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్ (Cm Kcr) ను పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohit Reddy) కలవనున్నారు. ఈ సమావేశంలో నెక్స్ట్ ఏం చేద్దాం అనే దానిపై ప్రధానంగా చర్చ జరగనుంది.

Transgender Marriage: ట్రాన్స్ జెండర్ ను ప్రేమించి పెళ్లాడిన యువకుడు..(వీడియో)

భేటీలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు..

కేసీఆర్ (Cm Kcr), రోహిత్ రెడ్డి  (Pilot Rohit Reddy) భేటీలో మరికొంతమంది మంత్రులు, ఇతర నాయకులు పాల్గొననున్నట్టు తెలుస్తుంది. సీబీఐ, ఈడీ, ఐటీ వరుస రైడ్స్ తో బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తుందని మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ కు చెప్పనున్నారు. నేతలకు వచ్చిన నోటిసులపై ఏం చేయాలనే అంశంపై ప్రధాన చర్చ జరగనుంది. అలాగే నోటీసులపై న్యాయ సలహాలు తీసుకోనున్నారు. కేంద్ర దర్యాప్తుపై సంస్థలను ఎలా ఎదుర్కోవాలి? వారి ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పాలి అనే వాటిపై చర్చ జరగనుంది.

Indu Death: చిన్నారి ఇందు మృతిపై వీడని సస్పెన్స్..రంగంలోకి 10 బృందాలు

పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు..

తాండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohit Reddy)కి నిన్న ఈడీ (Enforcement Directorate) అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 19న విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. బెంగళూరులోని ఓ పార్టీలోఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohit Reddy) పై గతంలో డ్రగ్స్ కేసు నమోదు అయింది. ఈ క్రమంలోనే అధికారులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై రోహిత్ స్పందించారు.  నా బిజినెస్, ఐటీ రిటర్న్స్ , కుటుంబసభ్యుల బ్యాంక్ ఖాతాలకు సంబంధించి వివరాలను తీసుకురావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. 19న విచారణకు హాజరవుతా అని రోహిత్ తెలిపారు.

ఢిల్లీలో BRS పార్టీ కార్యాలయ ప్రారంభం అనంతరం నిన్ననే కేసీఆర్ హైదరాబాద్ కు వచ్చారు. అక్కడి నుండి నేరుగా ప్రగతిభవన్ చేరుకున్న సీఎం ఈడీ నోటీసుల విషయంపై అడిగి తెలుసుకున్నారు. సోమవారం రోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు విచారణనున్న నేపథ్యంలో కేసీఆర్ తో రోహిత్ భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.

First published:

Tags: Drugs, Drugs case, Enforcement Directorate, Hyderabad, Telangana, Telangana News

ఉత్తమ కథలు