Home /News /telangana /

TS POLITICS PATNAM MAHENDAR REDDY AND CAPTAIN ROHIT REDDY EPISODE CREATES NEW TENSION FOR TRS LEADERSHIP KCR KTR AK

Telangana: టీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టిన ‘పట్నం’ పంచాయతీ.. తేల్చితే కొత్త చిక్కులు ?

కేటీఆర్, కేసీఆర్ (ఫైల్ పోటో)

కేటీఆర్, కేసీఆర్ (ఫైల్ పోటో)

Telangana Politics: తాండూరు విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే.. ఈ రకమైన నియోజకవర్గాలన్నింటికీ అదే వర్తిస్తుందనే సంకేతాలు వెళతాయని.. అప్పుడు అలాంటి నియోజకవర్గాల్లో లేని కొత్త తలనొప్పులు వస్తాయని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం.

ఇంకా చదవండి ...
    తెలంగాణ మాజీమంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సీఐను దూషించిన వ్యవహారం పెద్ద దుమారంగా మారింది. ఈ వ్యవహారంలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని కూడా మహేందర్ రెడ్డి (Patnam Mahendar Reddy) టార్గెట్ చేశారు. దీంతో తాండూరు పంచాయతీ మరోసారి టీఆర్ఎస్ నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో రావడంతో అనేక నియోజకవర్గాల్లో రచ్చ జరుగుతోంది. ఈ వ్యవహారం తాండూరులో మరింత ముదురుతోంది. తాండూరు(Tandoor) నుంచి మళ్లీ తానే పోటీ చేస్తానంటూ మహేందర్ రెడ్డి ప్రకటించుకుంటున్నారు. రోహిత్ రెడ్డి (Rohit Reddy)  కూడా తనకే అవకాశం వస్తుందంటూ చెప్పుకుంటున్నారు. దీంతో తాండూరు పంచాయతీ టీఆర్ఎస్ నాయకత్వానికి ఎప్పటికప్పుడు సవాల్‌గా మారుతోంది. ఎవరికి అనుకూలంగా ప్రకటన చేస్తే.. ఎవరు పార్టీని వీడతారో అనే టెన్షన్ టీఆర్ఎస్ నాయకత్వంలో నెలకొంది.

    మరోవైపు ఎన్నికల నాటికి మహేందర్ రెడ్డికి టీఆర్ఎస్ నాయకత్వం హ్యాండ్ ఇస్తుందా ? లేక కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన రోహిత్ రెడ్డినే పక్కనపెడుతుందా ? అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే తాండూరు సీటు విషయంలో సాధ్యమైనంత తొందరగా పార్టీ నాయకత్వం నుంచి క్లారిటీ తీసుకోవాలని మహేందర్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. అందుకే ఈ విషయమైన అనేకసార్లు టీఆర్ఎస్ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

    అయితే తాండూరు విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే.. ఈ రకమైన నియోజకవర్గాలన్నింటికీ అదే వర్తిస్తుందనే సంకేతాలు వెళతాయని.. అప్పుడు అలాంటి నియోజకవర్గాల్లో లేని కొత్త తలనొప్పులు వస్తాయని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. అందుకే పట్నం మహేందర్ రెడ్డి విషయంలో చెలరేగిన వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగేలా చేయడం ఒక్కటే మార్గమని టీఆర్ఎస్ యోచిస్తోంది.

    TRS MLC Viral Audio tapes: ఎమ్మెల్సీ, సీఐ ఆడియో క్లిప్​ వ్యవహారం.. క్షమాపణ చెప్పిన ఎమ్మెల్సీ మహేందర్​ రెడ్డి.. ఏమన్నారంటే..?

    CM KCR| Telangana Politics: హైదరాబాద్​కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.. నేటి సాయంత్రం సీఎం కేసీఆర్​తో భేటీ.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ..

    తాండూరు టికెట్ విషయంలో మహేందర్ రెడ్డి ఎంత పట్టుదలగా ముందుకు సాగుతున్నారో.. సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సైతం మరోసారి టికెట్ దక్కించుకునేందుకు అంతేస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. దీంతో తాండూరు పంచాయతీ టీఆర్ఎస్ నాయకత్వానికి తలకుమించిన భారంగా మారిందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. మొత్తానికి మహేందర్ రెడ్డి తాజా ఎపిసోడ్‌కు తాండూరు పంచాయతీకి సంబంధం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు