హోమ్ /వార్తలు /తెలంగాణ /

Politics: నియోజకవర్గంలో 208 బైక్‌లు ఉచితంగా ఇచ్చిన ఎమ్మెల్యే ..ఎందుకిచ్చాడో తెలుసా..?

Politics: నియోజకవర్గంలో 208 బైక్‌లు ఉచితంగా ఇచ్చిన ఎమ్మెల్యే ..ఎందుకిచ్చాడో తెలుసా..?

mahipalreddy

mahipalreddy

Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని నిరుపేద దివ్యాంగులకు 208 స్కూటీలను ఉచితంగా అందజేశాడు. కేటీఆర్ పిలుపునిచ్చిన స్మైల్ ఏ గిఫ్ట్‌లో భాగంగానే చెస్తున్నానని ఆ ఎమ్మెల్యే చెబుతుంటే ..ప్రజలు , విపక్షాల నేతలు విమర్శలు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Sangareddy (Sangareddi), India

(K.Veeranna,News18,Medak)

సంగారెడ్డి (Sangareddy)జిల్లాలోని పటాన్‌చెరు(Patancheruvu) నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి Mahipal Reddyమరోసారి వార్తల్లో నిలిచారు. తన నియోజకవర్గంలోని నిరు పేద దివ్యాంగుల్(Disabled)కోసం త్రీ టైర్‌ హోండా యాక్టివా స్కూటర్ల(Honda Activa)(Scooters)ను తన సొంత డబ్బుతో తయారు చేయించి ఉచితంగా అందజేస్తున్నారు. ఈకార్యక్రమం ఆదివారం పటాన్‌చెరులోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేశారు. 208స్కూటీలను ఒక్కొక్క వెహికల్‌ను లక్షా 20వేల రూపాయలతో కొనుగోలు చేశారు. మొత్తం 2.49కోట్ల రూపాయలను తన సొంత డబ్బుతో ఈ సేవ కార్యక్రమాన్ని చేపడట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు (Harish Rao)చేతుల మీదుగా ఈ స్కూటీల పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగానే దివ్యాంగులపై మమకారాన్ని చాటుకున్నారు స్థానిక ఎమ్మెల్యే. అయితే విపక్షాలు, స్థానికులు మాత్రం మహిపాల్‌రెడ్డి స్కూటీలు పంపిణి చేయడంపై పెదవి విరుస్తున్నారు. ఇదంతా వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసమే ఇప్పటి నుంచి ప్రయత్నాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

208 స్కూటర్స్‌ ఫ్రీగా పంపిణి..

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి నియోజకవర్గంలోని పేద దివ్యాంగులు, వికలాంగుల కోసం పెద్ద మనసు చేసుకున్నారు. తన సొంత ఖర్చులతో మొత్తం 208మంది దివ్యాంగులకు రెండున్నర కోట్ల రూపాలు ఖర్చు చేసి ..మూడు చక్రాల స్కూటీలను ఉచితంగా అందజేశారు. ఈకార్యక్రమం మంగళవారం జరిగింది. దివ్యాంగులకు స్కూటీలను తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా ఇప్పించారు. 208స్కూటీలను ఒక్కొక్క వెహికల్‌ను లక్షా 20వేల రూపాయలతో కొనుగోలు చేశారు. మొత్తం 2.49కోట్ల రూపాయలను తన సొంత డబ్బు ఖర్చు చేసి ఈ సేవ కార్యక్రమాన్ని చేపట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మహిపాల్‌రెడ్డి ఎలాంటి సందర్భంగా లేకుండా ఇంత డబ్బు ఖర్చు పెట్టి వికలాంగులు, దివ్యాంగుల పట్ల ప్రేమ ఒలకబోయడంపై స్థానికులు, రాజకీయ పార్టీలు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నాలుగేళ్లుగా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ది చేయకుండా ల్యాండ్ సెటిల్‌మెంట్లు, కబ్జాలు చేస్తూ వచ్చారని విమర్శిస్తున్నారు.

ప్రజావ్యతిరేకతను ప్రజాభిమానంగా మార్చేందుకు..

మహిపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోంది పటాన్‌చెరు నియోజకవర్గం. హైదరాబాద్‌ నగరానికి ఆనుకొని ఉండే అసెంబ్లీ నియోజకవర్గం. నగర శివారు ప్రాంతంగా ఉన్నటువంటి పటాన్‌చెరులో బీఆర్ఎస్‌ తరపున పోటీ చేసి గెలిచిన గూడెం మహిపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో ఈయనపై నియోజకవర్గ ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు పట్టించుకోవడంలేదని..సంక్షేమ పథకాలు పేదలకు అందించడంలో విఫలమయ్యారనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో తనపై ఉన్న ప్రజావ్యతిరేకతను ప్రజాభిమానంగా మార్చుకునేందుకే ఈవిధంగా వికలాంగులకు స్కూటీలను ఉచితంగా అందజేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Telangana| Kondagattu: కొండగట్టు అంజన్న మిగిలిన ఆభరణాలు ఎక్కడ..?

ఓటమి భయంతోనేనా..

అంతే కాకుండా నియోజకవర్గంలో మహిపాల్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్‌లో మరో నాయకుడు తనకు పోటీ వస్తున్నాడనే ఆందోళన ఆయనలో కనిపిస్తోంది. అందుకే ఎన్నికలకు చాలా టైముండగానే ఎవరికి అనమానం రాకుండా ఈవిధంగా సేవ కార్యక్రమం పేరుతో నియోజకవర్గ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నమేనంటున్నారు. గతేడాది ఆగస్ట్‌లో ఎమ్మెల్యే పెన్షన్ల పంపిణికి వెళ్లి వస్తుండగా దోమడుగులో మహిళలు వాహనాన్ని ఆపి మాకు రోడ్డు సరిగా లేదని ఎమ్మెల్యే వాహనానికి అడ్డుగా నిలబడ్డారు మహిళలు. తమ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారిపై కారుకు అడ్డుగా కూర్చున్నారు. అప్పుడే మహిపాల్‌రెడ్డి తన కారునే ఆపేంత వాళ్లయ్యారా మీరు అంటూ వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు వేయనని తెగేసి చెప్పారు. ఇలాంటి పరిణామాలు చాలా చోట్ల జరిగాయి. అందుకే ఈసారి ఓడిపోయి గెలిచే అవకాశం బీజేపీ , కాంగ్రెస్‌ నాయకులకు ఇచ్చేకంటే ముందుగానే ప్రజల్ని తనవైపు తిప్పుకోవడం మంచిదని భావించే ఈ స్కూటర్ల పంపిణి కార్యక్రమం నిర్వహించారంటున్నారు.

First published:

Tags: Sangareddy, Telangana News

ఉత్తమ కథలు