పరపతి, పలుకుబడి ఉంటే చాలు వాటిని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా అక్రమాలు, ఆక్రమణలు, మోసాలు చేస్తున్నారు కొందరు పెద్దమనుషులు. హైదరాబాద్‌లో భూ కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడ్డారు చాలా మంది ప్రజాప్రతినిధులు. తాజాగా వారి జాబితాలో చేరిపోయారు పఠాన్‌చెరు(Patancheru)మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత టి.నందీశ్వర్‌గౌడ్(Nandeeshwar Goud)కుమారుడు ఆశీష్‌గౌడ్(Ashish Goud). రాజకీయ పలుకుబడిని ఆసరాగా చేసుకొని ఏకంగా బ్యాంకు రుణాల్ని ఎగ్గొట్టినట్లుగా మాజీ ఎమ్మెల్యే తనయుడిపై పోలీసులు కేసు(Police case)నమోదు చేశారు. తమకు చెందిన ఆస్తిని బ్యాంకులో తనఖా పెట్టి మార్గిగేజ్ లోన్ Mortgage loan కింద రెండున్నర కోట్ల రుణం తీసుకున్నారు. దాన్ని తిరిగి చెల్లించకుండా ఆస్తిని మరొకరికి విక్రయించినట్లుగా తేలడంతో ఆశీష్‌గౌడ్‌పై పంజాగుట్ట(Panjagutta)పోలీసులు కేసు నమోదు చేశారు. పఠాన్‌చెరు గౌతమ్‌నగర్ కాలనీ(Gautam Nagar Colony)కి చెందిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ కొడుకు ఆశిష్‌గౌడ్, కూకట్‌పల్లి (Kukatpalli) వివేకానందనగర్ (Vivekanandanagar)కు చెందిన టి.సుమంత్ (Sumanth) బీరంగూడ(Biranguda)లోని శివంత ఫార్మా(Shivantha Pharma)లో పార్టనర్స్. ఆశిష్‌గౌడ్ పేరుతో పఠాన్‌చెరు గౌతమ్‌నగర్ కాలనీలోని సర్వేనంబర్ 740లో 460 గజాల్లో నాలుగంతస్థుల ఇల్లు, స్థలాన్ని 2018 మే 28న బ్యాంకుకు మార్టిగేజ్ చేశారు. ఫలితంగా ఎస్‌బీఐ(SBI) బెల్లావిస్టా బ్రాంచి నుంచి 2018లో రూ. రెండున్నర కోట్లు రుణం తీసుకున్నారు. ఇది తమ ప్రాపర్టీని తనఖా పెట్టి బ్యాంకు నుంచి తీసుకున్న లోన్‌కి సంబంధించిన ఇష్యూ. ఈ లోన్ పర్సస్‌లోనే 2019లో ఖాతాను సోమాజిగూడ ఎస్‌బీఐ ఎంఎంఈకు మార్చుకున్నారు.
బ్యాంకులకే పంగనామం..
బ్యాంక్ నుంచి తీసుకున్న రుణం సకాలంలో చెల్లించలేదు. దీంతో 2021లో బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా, స్పందించకపోవడంతో తమకు మార్టిగేజ్ చేసిన భవనం వద్దకు వెళ్లగా, అక్కడ వేరే వాళ్లు ఉన్నారు. ఇంటి ఓనర్ ఏరని అడగటంతో తాము ఆశిష్‌గౌడ్ వద్ద కొనుగోలు చేశామని చెప్పారు ప్రస్తుతం ఆ ఇంటిని కొనుగోలు చేసిన వ్యక్తులు. దీంతో బ్యాంక్‌కు మార్టిగేజ్ చేసిన స్థలాన్ని ప్రజాప్రతినిధి కుమారుడు ఆశీష్‌గౌడ్ వేరే వాళ్లకు అమ్ముకున్నారని బ్యాంకు అధికారులు తెలుసుకున్నారు.
పలుకుబడితో మోసాలు..
మార్టిగేజ్ చేసిన స్తలాన్ని వేరే వ్యక్తులకు అమ్ముకోవడాన్ని తప్పుపట్టిన బ్యాంకు అధికారులు కోర్టును ఆశ్రయించారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ కుమారుడు ఆశీష్‌గౌడ్‌తో పాటు టి.సుమంత్‌పై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు శివంత ఫార్మా, టి.సుమంత్, టి.ఆశిష్‌గౌడ్‌లపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. మాజీ ఎమ్మెల్యే తనయుడు బ్యాంకులను మోసం చేసి ఈ ప్రాపర్టీ ఒక్కటే అమ్ముకున్నారా లేక ఇంకా వేరే బ్యాంకుల్లో కూడా ఇలాంటి ఘనకార్యాలు ఏమైనా వెలగబెట్టాడా అని పోలీసులు, బ్యాంక్ అధికారులు ఆరా తీస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cheating case, Greater hyderabad