భారత రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి (Opposition parties joint candidate)గా బరిలోకి దిగిన కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా (Yashwant Sinha) జూలై 2న తెలంగాణ పర్యటనకు రానున్నారు. యశ్వంత్ అభ్యర్థిత్వానికి టీఆర్ఎస్ (TRS) పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. 2న ఉదయం 11.30 గంటలకు నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ (Hyderabad)కు చేరుకోనున్న యశ్వంత్ సిన్హా.. మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి ఎన్నికలో ఓటర్లుగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు.అయితే హైదరాబాద్ (Hyderabad)కు యశ్వంత్ సిన్హా రానున్న నేపథ్యంలో ఆయనకు భారీగా స్వాగతం పలకాలని టీఆర్ఎస్ భావిస్తుంది.
https://twitter.com/i/status/1542421745789186054
I Pac survey: CM KCR ఆ సర్వే ఫలితాలనే ఫైనల్ చేస్తారా? ఐప్యాక్ సర్వేపై సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్..
రాష్ట్రపతి పదవికి జరుగుతున్న ఎన్నిక (Indian presidential election)ను విపక్షాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. యశ్వంత్ సిన్హా పర్యటన ఏర్పాట్లను టీఆర్ఎస్ కు చెందిన ఎంపీ రంజిత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. జూలై 2న యశ్వంత్ సిన్హా తెలంగాణ సీఎం KCR తో కూడా సమావేశం కానున్నారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కలిసి యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. హైదరాబాద్‌లోని జల విహార్ లో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో యశ్వంత్ సిన్హా భేటీకి అధికార పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కి చెందిన నేతలతోనూ యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. యశ్వంత్ సిన్హాతో సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేయనున్నారు.
కేటీఆర్ సమావేశం..
సిన్హాకు స్వాగత ఏర్పాట్లు, ఆయనకు మద్ధతుగా నిర్వహించే సభపై టీఆర్ఎస్ పార్టీ (TRS party) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ మంత్రులు, ఇతర నాయకులతో సమావేశం నిర్వహించారు. యశ్వంత్ సిన్హాకు ఘనంగా స్వాగతం పలుకాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని మంత్రులకు కేటీఆర్ ఆదేశించారు.
యశ్వంత్ సిన్హా వచ్చే సమయంలోనే హైదరాబాద్‌లో BJP జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. జూలై 2, 3 తేదీల్లో రెండు రోజులపాటు National Executive సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమయంలోనే యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌కు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో హైదరాబాద్ పోలీసుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ వైపు నగరంలో దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఉండటం.. మరోవైపు అధికార టీఆర్ఎస్ శ్రేణులు యశ్వంత్‌కు మద్దతివ్వడం దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు పకడ్భందీగా చేస్తున్నారు. మరో వైపు రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తన అభ్యర్ధిగా ద్రౌపది ముర్మును బరిలోకి దింపింది. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ద్రౌపది ముర్ము విపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలకు కూడా ఫోన్ చేసి తనకు మద్దతివ్వాలని కోరింది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.