టీపీసీసీ చీఫ్ ఎన్నికైన తరువాత రేవంత్ రెడ్డి (Revanth Reddy) దూకుడు పెంచారు. సమయం దొరికినప్పుడల్లా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అవినీతిని ఎండగడుతూ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అలాగే వీలు దొరికినప్పుడు ప్రజలతో నిత్యం మమేకమై ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమక్షంలో పలువురు TRS, BJP నాయకులూ హస్తం గూటికి చేరారు. గతంతో పోలిస్తే కాంగ్రెస్ బలం పెరుగుతూ వస్తుంది. ఇక తాజాగా తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి (Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు.
రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు భారత్ జోడో యాత్ర (Bharat jodo Yatra) లో పాల్గొనాలన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఒక్క కిలోమీటర్ అయిన నడవాలని రేవంత్ (Revanth) కోరారు. రేపు 3 గంటలకు చార్మినార్ వద్ద కలుసుకుందాం. అక్కడి నుండి భారీ ర్యాలీగా సాయంత్రం 5 గంటలకు నెక్లస్ రోడ్డు వద్ద భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో వేసిన తొలి అడుగు రాష్ట్రాలు దాటుతూ ఈనెల 23న తెలంగాణలోకి ప్రవేశించిందని ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) గుర్తు చేశారు. అప్రహతిహతంగా సాగిపోతున్న భారత్ జోడో యాత్ర (Bharat jodo Yatra) రేపు మహానగరం హైదరాబాద్ (Hyderabad) కు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి హైద్రాబాద్ చరిత్రను గుర్తు చేసుకుందామని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ మన అస్తిత్వానికి, ఆర్ధిక స్థిరత్వానికి ప్రతీకగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ గొప్పగా అభివృద్ధి చెందిందన్నారు. రేపటి భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీ (Rahul gandhi)కి మద్దతు ఇద్దామని పిలుపునిచ్చారు.
ఇక దేశంలో 8 ఏళ్లుగా నిర్బంధమే రాజ్యం ఏలుతుందని మండిపడ్డారు. దేశంలో బావ స్వేచ్ఛే కాదు బ్రతికే స్వేచ్ఛ కూడా లేదని చెప్పుకొచ్చారు. ఇంధన ధరలు , నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగాయని మండిపడ్డారు. రైతులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ గాలికి కొట్టుకుపోయాయని విమర్శలు గుప్పించారు. బ్రిటిష్ పాలనలో విభజించి పాలించిన విధానం ఇప్పుడు మళ్లీ బీజేపీ పాలనలో పురుడు పోసుకుందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ , బీజేపీ రెండు ఒకటే అని ప్రజలను మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నారని రేవంత్ (Revanth Reddy) తనదైన శైలిలో మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bharat Jodo Yatra, Rahul Gandhi, Revanth Reddy, Telangana