ఈ నెల 5న మహారాష్ట్రలోని నాందేడ్(Nanded) జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించేందుకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహారాష్ట్రతో సరిహద్దు కలిగిన నిజామాబాద్(Nizamabad) జిల్లా నుంచి బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మహారాష్ట్రలో మకాం వేశారు. నిజామాబాద్, నాందేడ్ సరిహద్దులోని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, బోధన్ ఎమ్మెల్యే షకీల్, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్‌లు అక్కడే ఉండి సభా ఏర్పాట్లను చేస్తున్నారు. నిజామాబాద్‌తో పాటు నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫా బాద్ జిల్లాల నేతలు కూడా అక్కడ ఉండి బీఅర్ఎస్ సభను సక్సెస్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. నాందేడ్ జిల్లాతో వంద కిలో మీటర్ల సరిహద్దు కలిగిన నిజామాబాద్ జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది. నిజామాబాద్ జిల్లా సరిహద్దులోని నాందేడ్ ప్రాంతం లోని ధర్మాబాద్, డెగూర్, యావత్ మాల్, నర్సీ ప్రాంతాలకు చెందిన ప్రజలు తెలంగాణలో అమలవు తున్న సంక్షేమ పథకాలను చూసి తమను తెలంగాణ జిల్లాలో కలుపాలని డిమాండ్ చేస్తున్నారు.
గతంలో నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను కలిసి సీఎం కేసీఆర్‌కు(KCR) తమను తెలంగాణలో కలుపాలని కోరారు. ఈ నేపథ్యంలో వారిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు కసరత్తు జరుగుతుంది. నాందేడ్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సంప్రదింపులు కొనసాగుతు న్నాయి. నిజామాబాద్ జిల్లాతో బంధుత్వం ఉన్న నాయకులతో జిల్లాకు చెంది న ప్రజాప్రతినిధులు మొదటి దఫా చర్చలు జరిపారు. ప్రధానంగా జుక్కల్, బోధన్ ప్రాంతా లకు చెందిన ఎంపీలు ఈ కోణంలో స్థానిక నాయకులతో చర్చలు జరిపారు.
నాందేడ్ జిల్లా కేంద్రం లోని గురుగా వింద్ సింగ్ స్టేడియంలో జరిగే సీఎం కేసీఆర్ సభకు స్థానికంగా ఉన్న ప్రజలను రప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో చేరుతామని ఆసక్తి చూపుతున్న నాయకులతో ఆ దిశలో పని చేస్తు న్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తొలిసారి తెలంగాణ బయట జరిగే సభను విజయవంతం చేసేందు కు సర్వశక్తులను ఒడ్డుతున్నారు. నిజామాబాద్ పొరుగు జిల్లాల్లోని నాందేడ్ జిల్లా కేంద్రం లో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో మహారాష్ట్ర నుంచి కొద్దిగా జనాన్ని తరలించాలని, మిగిలిన ప్రజలను తెలంగాణలోని పాత నిజామాబాద్ జిల్లా నుంచే తరలింపు యోచన నేతలు ఉన్నారు.
Revanth Reddy: మారిన రేవంత్ పాదయాత్ర వేదిక.. కొత్త వేదిక ఇదే..!
BIG BREAKING: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం..ఈడీ ఛార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం, వైసీపీ ఎంపీ పేర్లు
నియోజకవర్గానికి 10వేల మందిని తరలించాలని కసరత్తు చేస్తున్నారు. కరీంనగర్ , హైదరాబాద్ వరకు బహిరంగ సభలకు జనాలను తరలించిన నేపథ్యం ఉన్నప్పటికీ మహారాష్ట్రకు తరలించడం తొలిసారి కావడంతో సభ సక్సెస్ కోసం వ్యయప్రయా సాలకు వెనుకాడడం లేదు. వాహనాల బుకింగ్ కార్యక్రమం పూర్తి కాగా మండలానికి, గ్రామానికి నిర్దేశిత లక్ష్యంగా తరలించే కసరత్తు జరుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Maharashtra, Telangana