హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu Bye Elections: మునుగోడులో ముగిసిన నామినేషన్ల పర్వం.. ఎంతమంది నామినేషన్లు వేశారంటే..

Munugodu Bye Elections: మునుగోడులో ముగిసిన నామినేషన్ల పర్వం.. ఎంతమంది నామినేషన్లు వేశారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Munugodu: ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు చండూరులోని రిటర్నింగ్ అధికారి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించిన పరిశీలన రేపు, ఎల్లుండి జరుగుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక అంకంలోని కీలకమైన నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు చండూరులోని రిటర్నింగ్ అధికారి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సహా మొత్తం వందమందికి పైగా అభ్యర్థులు ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్లు దాఖలు చేశారు. ఇక అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించిన పరిశీలన రేపు, ఎల్లుండి జరుగుతుంది. ఇప్ప్పటివరకు మొత్తం 140కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయని తెలుస్తోంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడం, మంచి రోజు కావడంతో ఈ రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.

ఇవాళ ఒక్క రోజే 50కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయని సమాచారం. ఇతర ప్రాంతాల నుంచి సైతం కొందరు అభ్యర్థులు ఇక్కడి వచ్చి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి కనిపించింది. చర్లగూడెం బాధితులు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 17న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉంది. దీంతో అప్పటివరకు వీరిలో ఎంతమంది పోటీ నుంచి తప్పుకుంటారు ? ఆ తరువాత ఎంతమంది చివరగా పోటీలో ఉంటారన్నది తేలాల్సి ఉంది. 2018 ఎన్నికల సమయంలో మునుగోడులో మొత్తం 33 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే చివరగా 15 మంది మాత్రమే బరిలో ఉన్నారు. అయితే ఇది ఉపఎన్నిక కావడంతో నామినేషన్లు పెద్ద సంఖ్యలో దాఖలయ్యాయి.

మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ ఇలా..

అక్టోబర్‌ 14వ తేది నామినేషన్ల స్వీకరణకు చివరి గడువు ఇచ్చింది ఎన్నికల సంఘం. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 17వ తేది వరకు గడువు ఉంది. ఇక ఉపఎన్నిక పోలింగ్‌ నవంబర్‌ 3న(November 3) ఉండగా కౌంటింగ్ 6వ (November6)తేదిన నిర్వహించనున్నట్లుగా ఎన్నికల సంఘం(Election Commission) వెల్లడించింది.

తెలంగాణలో నిర్వహించబోయే మునుగోడు ఉపఎన్నికను ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలో దిగుతుండగా ...కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి పోటీలో నిలిచారు. ఇక తెలంగాణలో అధికార పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్‌ పార్టీ తమ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఖరారు చేసింది.

Munugodu: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆస్తులు ఎన్నో తెలుసా..

Munugodu: మునుగోడు ఇప్పుడు గుర్తొచ్చిందా?..కేటీఆర్ Vs రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం

ఇక మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్, బిహార్ లోని మొకామా, గోపాల్ గంజ్, హర్యానాలోని అదంపూర్, ఉత్తర్ ప్రదేశ్ లోని గోలాగోక్రన్నత్, ఒడిషాలోని ధామ్ నగర్ సెగ్మెంట్లకు కూడా మునుగోడుతో పాటే నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. ఈ ఏడు స్థానాల కౌంటింగ్ నవంబర్ 6న జరగనుంది.

First published:

Tags: Munugodu By Election, Telangana

ఉత్తమ కథలు