ఏపీ నేతలను పిలిపించుకుని కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. వాళ్లను తీసుకొచ్చేందుకు వందకు పైగా కార్లను పంపించారని సెటైర్ వేశారు. బీఆర్ఎస్‌కు తెలంగాణలో అధ్యక్షుడు లేడు కానీ.. ఏపీలో అధ్యక్షుడిని ప్రకటించారని విమర్శించారు. అసలు బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఎవరని బండి సంజయ్ ప్రశ్నించారు. గత ఎన్నికలకు ముందు తెలంగాణ సెంటిమెంట్ రగల్చిన కేసీఆర్.. ఆంధ్రావాళ్లను తిట్టారని ఆరోపించారు. ఆంధ్రా బిర్యానీని పెండ బిర్యానీ అన్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్‌తో మళ్లీ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణ గురించి మాట్లాడుతున్న కేసీఆర్.. ఆర్టీసీసీ ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు.
పొలం దగ్గర ఉచిత కరెంట్ అని చెప్పి.. ఇంటి దగ్గర ఉన్న కరెంట్ ఛార్జీలు మోత మోగిస్తున్నారని ఆరోపించారు.తెలంగాణలోని డిస్కంలు వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయని అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో కేసీఆర్ వెనుకబడేలా చేశారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందని అన్నారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ ఇబ్బందిపడుతోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనాలను రూ. 30 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయలకు పెంచారని విమర్శించారు.
తెలంగాణ వచ్చిన తరువాత ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి రావడం లేదని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ వైఖరి కారణంగానే కృష్ణా జలాల్లో వాటాను కోల్పోవాల్సి వచ్చిందని విమర్శించారు. తెలంగాణలోని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ నిన్నటి మీటింగ్‌లో జై తెలంగాణ అని కూడా అనలేదని చెప్పుకొచ్చారు.
Rajanna Siricilla: వేములవాడలో శాస్త్రోక్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం
Telangana: కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు షాక్..ఆ నోటీసులపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణ వచ్చిన తరువాత మద్యం ద్వారా వచ్చే ఆదాయం పెరిగిందని అన్నారు. మేకిన్ ఇండియాపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. వందకు పైగా దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించింది భారత్ అనే విషయం కేసీఆర్ మర్చిపోయారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్ స్టాండ్ ఏంటని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, CM KCR, Telangana