హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR | Rahul Gandhi: టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తుపై రాహుల్ గాంధీ కుండబద్దలు -కీలక నిర్దేశం

KCR | Rahul Gandhi: టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తుపై రాహుల్ గాంధీ కుండబద్దలు -కీలక నిర్దేశం

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కాలంలో తరచూ కాంగ్రెస్ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలో టీఆర్ఎస్ తో పొత్తుపై హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. టీకాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ కీలక దిశా నిర్దేశం చేశారు. వివరాలివే..

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కాలంలో తరచూ కాంగ్రెస్ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలో టీఆర్ఎస్ తో పొత్తుపై హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. టీకాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ కీలక దిశా నిర్దేశం చేశారు. వివరాలివే..

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కాలంలో తరచూ కాంగ్రెస్ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలో టీఆర్ఎస్ తో పొత్తుపై హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. టీకాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ కీలక దిశా నిర్దేశం చేశారు. వివరాలివే..

బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతానని శపథం చేసిన టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కాలంలో తరచూ కాంగ్రెస్ అనుకూల వ్యాఖ్యలు చేస్తుండటం, పలు సందర్భాల్లో రాహుల్ గాంధీకి బేషరతుగా మద్దతు పలికిన దరిమిలా రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తు సంభావ్యతపై చర్చ ముమ్మరమైంది. కానీ కేసీఆర్ మాటల ట్రాప్ లో పడిపోరాదని, తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ తోగానీ, దాని మిత్రపక్షం ఎంఐఎంతోగానీ పొత్తు ఉండబోదని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసింది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలతో జరిగిన కీలక సమావేశంలో జాతీయ నేత రాహుల్ గాంధీ ఈ మేరకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీజేపీ విధానాలపైన పోరాటాలను ఉధృతం చేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ దిశా నిర్దేశం చేశారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన 38 మంది కీలక నేతలతో రాహుల్ గాంధీ ఢిల్లీలోని తన నివాసంలో సోమవారం సమావేశమయ్యారు. సాయంత్రం 6 గంటలకు మొదలైన ఈ మీటింగ్ సుదీర్ఘంగా నాలుగు గంటలపాటు సాగింది. సమావేశంలో చర్చించుకున్న వివరాలు ఆలస్యంగా వెల్లడయ్యాయి. తెలంగాణలో టీఆర్ఎస్ తో పొత్తు ఉండబోదని కుండబద్దుకొట్టిన రాహుల్ గాంధీ.. తనకున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, నేతలందరూ కలిసికట్టుగా పని చేసి టీఆర్‌ఎ్‌సను ఓడించడమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు.

టీకాంగ్రెస్ నేతలతో రాహుల్ మీటింగ్

KCR సర్కార్ సంచలనం: సెలబ్రిటీల డ్రగ్స్ పార్టీ కేసులో అనూహ్య ట్విస్ట్.. ఆ రెండిటికి భారీ షాక్

తెలంగాణ కాంగ్రెస్ లో కొంత కాలంగా అలజడి రేపుతోన్న అంతర్గత విభేదాలను అడ్రస్ చేసిన రాహుల్ గాంధీ.. నేతలంతా కలిసికట్టుగా, ఐక్యమత్యంగా పనిచేయాలని ఆదేశించారు. పార్టీ అంతర్గత విభేదాలపై మీడియా ముందు మాట్లావద్దని, ఏ సమస్య ఉన్నా తనకు లేదా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చెప్పుకోవాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ భేటీ

CM KCR | PM Modi: ఇక ఢిల్లీ దద్దరిల్లేలా -వారం పాటు సీఎం కేసీఆర్ అక్కడే -ప్రధాని మోదీ టైమిస్తారా?

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన జిల్లాల పర్యటనల్లో కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తుండటంపై నేతలు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ, టికెట్లు ఖరారు చేసేది ఏఐసీసీయేనని స్పష్టం చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించాలన్న ఎంపీ కోమటిరెడ్డి డిమాండ్ పై రాహుల్ సానుకూలంగా స్పందించారు.

టీకాంగ్రెస్ కు రాహుల్ గాంధీ దిశానిర్దేశం

Bengaluru vs Hyderabad: బెస్ట్ సిటీ ఏది? KTR - DK Shivakumar మధ్య ఛాలెంజ్

రాహుల్ గాంధీతో సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రేవంత్ రెడ్డిపై ఫిర్యాదుల కంటే కీలక అంశాలను చర్చకు తెచ్చారు. పార్టీలో బీసీలకు ప్రాధాన్యం పెరగాలని మాజీ ఎంపీ వి. హన్మంతరావు అభిప్రాయం వ్యక్తం చేయగా.. బీసీల్లో ఎంబీసీలకు ప్రాధాన్యం దక్కాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కూడా బీసీలకు ప్రాధాన్యం పెరగాలని చెప్పారు. రాహుల్ ఎదుట రేవంత్ పై ఫిర్యాదులు చేయనప్పటికీ కొందరు నేతలు కేసీ వేణుగోపాల్‌కు లిఖిత పూర్వక ఫిర్యాదులు ఇచ్చినట్లు తెలిసింది. మొత్తంగా అంతర్గత విభేదాలను పక్కనపెట్టి టీఆర్ఎస్, బీజేపీపై గట్టిగా పోరాడితే తెలంగాణలో కాంగ్రెస్ విజయం తథ్యమని, ఆ దిశగా నేతలు కష్టపడాలని రాహుల్ గాంధీ సూచించారు.

First published:

Tags: Bjp, CM KCR, Congress, Rahul Gandhi, Revanth Reddy, Telangana, Trs

ఉత్తమ కథలు