తెలంగాణ రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సీనియర్ నేత డి. శ్రీనివాస్ వ్యవహారంపై ఆయన రెండో కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. నిన్న రాత్రి డీఎస్‌కు ఫిట్స్ వచ్చిందని అన్నారు. డీఎస్ కాంగ్రెస్‌వాదేనని ఐదేళ్లుగా చెబుతున్నానని అన్నారు. తాను పక్కా బీజేపీ అని.. తన తండ్రి పక్కా కాంగ్రెస్ అని వివరణ ఇచ్చారు. ఆరోగ్యం బాగోలేని వ్యక్తిని గాంధీ భవన్ తీసుకెళ్లి ఠాక్రేతో కండువా కప్పించడం సరికాదని అభిప్రాయపడ్డారు. 2018 నుంచి ఆయన కాంగ్రెస్‌లో చేరతానంటే పార్టీలోకి ఎందుకు తీసుకోలేదని అరవింద్ ప్రశ్నించారు. డీఎస్ 40 ఏళ్లు పార్టీకి సేవ చేశారని.. సోనియా ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉందని అడగలేదని అరవింద్ అన్నారు. డీఎస్‌కు ఇది రాజకీయాలు చేసే సమయం కాదన్న అరవింద్.. తన తండ్రి ఏ పార్టీలోకి వెళ్లినా తనకు ఇబ్బంది లేదని అన్నారు. అయితే తన తండ్రిని శారీరికంగా, మానసికంగా ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. తన రాజకీయాలకు, తన తండ్రి డీఎస్ రాజకీయాలకు సంబంధం లేదని అరవింద్ వివరణ ఇచ్చారు.
సీనియర్ రాజకీయ నేత డి.శ్రీనివాస్(D Srinivas).. ఇద్దరు కొడుకుల మధ్య నలిగిపోతున్నారా ? నిన్న కాంగ్రెస్‌లో చేరిన డీఎస్.. నేడు ఆ పార్టీకి రాజీనామా చేయడం వెనుక అసలు కారణం ఇదేనా ? జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. నిన్న కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్‌తో(Sanjay) కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు డీఎస్. కొంతకాలంగా కాంగ్రెస్‌లో చేరేందుకు ఎదురుచూస్తున్న డీఎస్.. నిన్న కాంగ్రెస్‌లో చేరడంతో.. నిజామాబాద్(Nizamabad) జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు డీఎస్ లేఖ బయటకు రావడం కలకలం రేపింది. నిన్న పార్టీలో చేరిన ఈ రోజు పార్టీ రాజీనామా చేయడంపై చర్చ మొదలైంది. ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదని.. ఆయన దగ్గరకు రావొద్దని డీఎస్ భార్య కూడా లేఖ విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే తన తండ్రితో బలవంతంగా ఇలా చేయించారని ఆయన పెద్ద కుమారుడు సంజయ్ చెప్పడం.. ఈ మొత్తం వ్యవహారంలో ట్విస్ట్‌గా మారింది. దీన్ని బట్టి డీఎస్ కుటుంబంలోని ఆయన ఇద్దరు కుమారుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయనే చర్చ మొదలైంది. తన తండ్రికి ప్రాణహాని ఉందంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే డీఎస్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నట్టు లేఖ బయటకు రావడంపై ఆయన పెద్ద కుమారుడు సంజయ్ తప్పుబట్టారు. ఆయనతో బలవంతంగా లేఖపై సంతకం చేయించారని ఆరోపించారు. ఇదంతా బీజేపీ కుట్ర అని ఆరోపించారు.
Rajanna Siricilla: విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు పెంపుదలపై ప్రత్యేక శ్రద్ద!
Minister KTR: కేంద్రానికి శత్రు రాష్ట్రంగా తెలంగాణ ..మరోసారి కేటీఆర్ గరంగరం
తన సోదరుడు, నిజామాబాద్ ఎంపీ అరవింద్ తీరును పరోక్షంగా తప్పుబట్టారు. తన తండ్రి ఆరోగ్యం కాస్త కుదుటపడితే.. నిజామాబాద్‌కు తీసుకొచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని అనుకున్నానని.. కానీ ఈలోపు తన సోదరుడు ఈ విధంగా చేస్తాడని అనుకోలేదని సంజయ్ ఆరోపించారు. తన తల్లికి ఏమీ తెలియదని.. ఆమె తన సోదరుడు చెప్పినట్టు వింటారని ఆరోపించారు. తన తండ్రి చుట్టుపక్కల ఉన్న వారిని నమ్మే పరిస్థితి లేదని పరోక్షంగా తన సోదరుడు అరవింద్‌పై ఫైర్ అయ్యారు. తన ఆరోపణలకు స్పందన రాకపోతే.. తాను దీనిపై ఫిర్యాదు చేస్తానని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana