హోమ్ /వార్తలు /తెలంగాణ /

BJP | Telangana : ఎన్టీఆర్, నితిన్, మిథాలీని బీజేపీ నేతలు కలవడం వెనుక అసలు కారణం అదే.. ఎంపీ లక్ష్మణ్ క్లారిటీ

BJP | Telangana : ఎన్టీఆర్, నితిన్, మిథాలీని బీజేపీ నేతలు కలవడం వెనుక అసలు కారణం అదే.. ఎంపీ లక్ష్మణ్ క్లారిటీ

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

BJP|Telangana : తెలంగాణకు వచ్చిన ప్రతి బీజేపీ అగ్రనాయకుడు సినిమా స్టార్లు, స్పోర్ట్స్‌ సెలబ్రిటీలను కలుస్తున్నారు. ఇదంతా ఎందుకనే చర్చ విస్తృతంగా జరుగుతున్న వేళ ఆపార్టీ ఎంపీ క్లారిటీ ఇచ్చారు. మోదీపైన అభిమానంతో వాళ్లంతా బీజేపీ తరపున ప్రచారం చేయడానికి రెడీ ఉన్నట్లు చెప్పడం ఆసక్తికరంగా మారింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ(Telangana)లో బీజేపీ (BJP)స్టాండ్ ఏమిటో ఎవరికి అంతు చిక్కడం లేదు. ఎవర్ని ఎందుకు కలుస్తున్నారో ..? సినిమా, క్రీడా, పత్రికా రంగానికి చెందిన ప్రముఖుల్ని కాషాయం పార్టీ అధినాయకులు వరుసగా భేటీ కావడం వెనుక ఆంతర్యమేమిటనే చర్చ విస్తృతంగా జరుగుతుంటే కమలనాథుల నుంచి మాత్రం వాయిస్‌ వేరేగా వినిపిస్తోంది. తెలంగాణకు వచ్చిన అమిత్‌షా జూనియర్‌ ఎన్టీఆర్‌ని కలవడం, డిన్నర్‌ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ పరిణామం ఏమిటి అని నోరు వెళ్లబెట్టారు. కాని ఇప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్‌ నడ్డా(Jayaprakash Nadda)మరో యువ హీరో నితిన్‌(Nitin)ను ఇండియన్ విమెన్‌ క్రికెటర్ మిథాలీరాజ్‌(Mithaliraj)ని కలవడంతో ఇందులో ప్రత్యేకత ఏమి లేదు ...రాజకీయ అవసరాల దృష్ట్యానే కలవడం జరుగుతోందని బీజేపీ నేతల మాటల్లోనే తేలిపోయింది.


  MLC Kavita: నా మీద సిస్టం అంతా ఎటాక్​ చేస్తోంది.. ప్రశ్నించాలి కదా?: ఎమ్మెల్సీ కవిత  స్టార్స్‌ని కలుస్తున్న కమలం నేతలు..
  తెలంగాణకు వచ్చిన బీజేపీ పెద్దలు మొన్న ఎన్టీఆర్ నిన్న నితిన్, మిథాలీ రాజ్‌ని కలవడం చూస్తుంటే ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే కమలం పార్టీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పెద్ద మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రాంతీయ పార్టీలకు ధీటుగా బీజేపీకి పబ్లిసిటీ దక్కాలంటే ఎంతో కొంత స్టార్ ఇమేజ్ కావాలని భావించినట్లుగా తెలుస్తోంది. ప్రజలకు సినిమాలు, స్పోర్ట్స్‌తో పాటు సినిమా స్టార్‌లు, స్పోర్ట్స్‌ స్టార్‌లు అంటే ఎక్కువ ఇష్టం. ఈ చిన్న పాయింట్‌ని పట్టుకొనే బీజేపీ హీరో నితిన్‌ని, ఇండియన్ విమెన్ క్రికెటర్ మిథాలీరాజ్‌ని కలిసినట్లుగా భావిస్తున్నారు.  క్లారిటీ ఇచ్చిన కాషాయం నేత..

  రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలన్న కమలనాథుల ఆలోచనలకు అనుగూణంగా కొత్త వ్యక్తులను కలవడం, అన్నీ రంగాల ప్రముఖులతో మాట, ముచ్చట చేయడం చేస్తున్నారనేది పబ్లిక్ టాక్‌గా కనిపిస్తోంది. కాని బీజేపీ నేతలు మాత్రం ఒక్కో సారి ఒక్కో విధంగా బదులిస్తున్నారు. బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్‌ దీనిపై స్పందిస్తూ కేవలం మోదీపై ఉన్న గౌరవంతోనే నితిన్, మిథాలిరాజ్‌ జేపీ నడ్డాను నోవాటెల్ హోటల్‌లో కలిశారని చెప్పారు. అంతే కాదు ఈ ఇద్దరికి మోదీని కలవాలనే తాపత్రయం ఉందని వాళ్లను ప్రధాని మోదీని కలిపించాలని నడ్డా ఆదేశించారని చెప్పారు. ఇందులో అసలైన విషయం ఏమిటంటే ప్రధాని మోదీ కోసం తాము సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా నితిన్, మిథాలీరాజ్‌ చెప్పారని..ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కూడా సిద్దంగానే ఉన్నామని చెప్పినట్లుగా లక్ష్మణ్ చెప్పారు. దేశానికి మోదీ నాయకత్వం ఉండాలన్న ఆలోచనతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వారు చెప్పడం జరిగిందన్నారు.


  Telangana : 24గంటల్లో 59ఆపరేషన్లు చేసి పరేషాన్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు .. ఎక్కడంటే


  క్యాంపెయిన్‌ కోసమే..

  జూనియర్ ఎన్టీఆర్‌ను అమిత్‌షా కలిసినప్పుడు కేవలం ట్రిపులార్ సినిమాలో ఎన్టీఆర్ నటన నచ్చే అభినందించడానికి పిలిపించారని చెప్పిన బీజేపీ నేతలు..ఈసారి నితిన్, మిథాలీరాజ్‌ని జేపీ నడ్డా కలిసిన తర్వాత స్వరం మార్చడం చూస్తుంటే ఎన్నికల టైమ్‌కి బీజేపీకి పొలిటికల్ బూస్ట్ ఇచ్చేందుకు సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీల సేవల్ని గట్టిగానే వాడుకుంటారని అందరూ భావిస్తున్నారు. తెలంగాణ బీజేపీలో ఇప్పటికే విజయశాంతి, కృష్ణంరాజు, జీవితా రాజశేఖర్ ఉండగా ..తాజాగా జయసుధను కూడా పార్టీలోకి ఆహ్వానించారు కమలనాథులు. ఓవైపు నాయకుల్ని ఆహ్వానిస్తునే ..మరోవైపు సినిమా వాళ్లను ప్రచారానికి వాడుకోవాలన్నదే బీజేపీ వ్యూహాంగా చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఇంకా ఈ జాబితాలో ఎవరెవరున్నారో తెలియాలంటే నడుస్తున్న రాజకీయాన్ని గమనిస్తూ ఉంటే అర్ధమవుతుంది.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Actor nithin, Bjp, Mithali Raj, NTR, Telangana Politics

  ఉత్తమ కథలు