Home /News /telangana /

TS POLITICS NITIN GADKARI IS ONLY GOOD MAN IN BAD BJP SAYS TRS MINISTER PRASHANTH REDDY IS THIS CM KCR STRATEGY AGAINST BJP PM MODI MKS

KCR అనూహ్య వ్యూహం? మోదీ సీటుకు స్పాట్ పెట్టారా? -బీజేపీలో ఏకైక మంచి మనిషి ఆయనే!!

కేసీఆర్, గడ్కరీ, ప్రశాంత్ రెడ్డి

కేసీఆర్, గడ్కరీ, ప్రశాంత్ రెడ్డి

బీజేపీలో అంతర్గత పోరును కేసీఆర్ అనుకూలంగా వాడుకుంటున్నారా? మోదీ-గడ్కరీ మధ్య ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతోందనే వార్తల నడుమ గడ్కరీని టీఆర్ఎస్ పొగడటం, తెలంగాణ అభివృద్ధిని గడ్కరీ కీర్తించడం టీబీజేపీకి మింగుడు పడటంలేదు.

బీజేపీని బంగాళాఖాతంలో కలిపి, ప్రధాని మోదీని గద్దెదించేదాకా విశ్రమించబోనని గతంలో శపథం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. తాజాగా మాట మార్చడం, ఒక వ్యక్తిని ప్రధాని సీటు నుంచి దించేయడమో, ఒక పార్టీని కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేయడమో తన అభిమతం కాదని, ఆ దిశగా ఎవరైనా ప్రయత్నిస్తే అది తెలివితక్కువ తనమే అవుతుందని టీఆర్ఎస్ ప్లీనరీలో చెప్పడం తెలిసిందే. అయితే తాజా పరిణామంగా బీజేపీలో అంతర్గత పోరును కేసీఆర్ అనుకూలంగా వాడుకుంటున్నారా? అనే అనుమానాలకు తావిచ్చేలా హైదరాబాద్ వేదికగా అనూహ్య ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రధాని పదవి విషయంలో బీజేపీలో మోదీకి పోటీగా, ప్రత్యామ్నాయంగా నిలిచే ఏకైక నేతగా ప్రచారంలో ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కేసీఆర్ మంత్రి నోరారా పొగడటం, ఇతర కేంద్ర మంత్రుల ఎదుటే గడ్కరీ గొప్పతనాన్ని కీర్తించడం ఆసక్తికరంగా చర్చకు దారి తీసింది.

2014 నుంచి బీజేపీలో మోదీ వర్సెస్ గడ్కరీ సీన్ నెలకొందని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. ఈ వాదనను హైలైట్ చేస్తూ, తాజాగా మహారాష్ట్ర(గడ్కరీ సొంత రాష్ట్రం)కు చెందిన లోక్‌మత్ టైమ్స్ అనే మరాఠా పత్రిక.. పీఎం సీటు ఎక్కడానికి గడ్కరీ వెయిటింగ్ అనే అర్థంలో ఇటీవల సంచలన కథనం రాసింది. వాస్తవానికి అలా జరిగే అవకాశం లేకున్నా, సదరు కథనం జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది. ఈలోపే తెలంగాణలో గడ్కరీని టీఆర్ఎస్ పొగడటం, బీజేపీలో ఏకైక మంచి మనిషి గడ్కరీనే అని కేసీఆర్ కు ఆప్తుడైన మంత్రి ప్రశాంత్ రెడ్డి కీర్తించడం కొత్త అనుమాానాలకు తావిచ్చినట్లయింది. మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కేసీఆర్ సర్కారును టీబీజేపీ తిట్టిపోస్తోంటే, గడ్కరీ మాత్రం తెలంగాణలో జరుగుతోన్న అభివృద్దిని కీర్తించి, దేశ అభివృద్ది సూచికకు తెలంగాణే గీటురాయి అని చెప్పడం స్థానిక కమలనాథులకు మింగుడు పడని వ్యవహారంలా మారింది.

PM Kisan: రైతులకు డబుల్ బొనాంజా? భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ డబ్బులు తీసుకోవచ్చా? నిబంధనలివే..


హైదరాబాద్‌లో నేషనల్‌ హైవే అథారిటీస్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) ఆధ్వర్యంలో శుక్రవారం.. రూ.8006 కోట్లు విలువ చేసే సుమారు 460 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల పనుల ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎన్‌హెచ్‌-161 రెండు రోడ్లను ప్రారంభించి, 11 జాతీయ రహదారులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, వీకే సింగ్‌ తోపాటు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రశాంత్ రెడ్డి ప్రసంగించే సమయంలో.. బీజేపీ కార్యకర్తలు పెద్దపెట్టున జైశ్రీరాం, భారత్ మాతాకీ జై నినాదాలు చేసి, ప్రసంగాన్ని కొద్దిసేపు అడ్డుకునేందుకు యత్నించారు. అప్పుడు కిషన్‌రెడ్డి జోక్యం చేసుకొని.. బీజేపీ కార్యకర్తలను హెచ్చరించారు. అయినా.. నినాదాలు ఆగకపోవడంతో.. కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నినాదాలమధ్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు.

KTR దుమారం వేళ కేంద్రం సంచలనం.. KCR పాలనకు కితాబు.. అమెరికాకు దీటుగా తెలంగాణ: గడ్కరీ


నీచమైన బీజేపీ ప్రభుత్వంలో తనకు కనిపించిన ఏకైక మంచి మనిషి నితిన్‌ గడ్కరీ అని టీఆర్ఎస్ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. తన ప్రసంగ సమయంలో బీజేపీ కార్యకర్తలు, నేతల వ్యవహార శైలిపై ఆయన మండిపడ్డారు. తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ అధికారిక సమావేశానికి బీజేపీ కార్యకర్తలను తరలించారంటూ విమర్శించారు. ‘నేను తెలంగాణ ప్రభుత్వం తరఫున మాట్లాడుతుంటే.. బీజేపీ కార్యకర్తల నినాదాలేంటి? ముగ్గురు కేంద్ర మంత్రుల సమక్షంలో బీజేపీ కార్యకర్తలు చిల్లరగా వ్యవహరించారు. నేను మాట్లాడితే అంత ఉలిక్కిపాటెందుకు?’ ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. అయితే.. బీజేపీ ఈ వ్యాఖ్యలను ఖండించింది. ప్రశాంత్‌రెడ్డిని తమ నేతలు ఎక్కడా అడ్డుకోలేదని, తెలంగాణకు కేంద్రం నిధులివ్వలేదనడం అబద్దమని బీజేపీ నేతలు అన్నారు. కాగా,

హైదరాబాద్ లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, టీమంత్రి ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు.nitin gad


PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు.. మళ్లీ ఆ ఆప్షన్ అందుబాటులోకి..

టీబీజేపీ నేతల వాదనకు భిన్నంగా తెలంగాణలో అభివృద్ది దూసుకుపోతున్నదంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ ప్రగతిశీల, సుసంపన్న రాష్ట్రం. ఈ రాష్ట్రం ప్రగతి సాధిస్తే.. భారత్‌ అభివృద్థి చెందినట్లే. ఒక ప్రాంతం ప్రగతి సాధించాలంటే నీరు, కరెంటు, రహదారులు, కమ్యూనికేషన్స్‌ ప్రధానం. ఈ వనరులు లేకుండా వ్యవసాయం, పరిశ్రమలకు పెట్టుబడులు రావు. పెట్టుబడులు లేనిదే.. ప్రాంతాల అభివృద్ధి అసాధ్యం. అభివృద్థి లేకపోతే పేదరికాన్ని పోగొట్టలేం. రోడ్లను నిర్మించడమంటే, పేదరికాన్ని పొగొట్టడమే. అందుకే కేంద్రం రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది’అని కేంద్ర మంత్రి గడ్కరీ అన్నారు. అటు మోదీ వర్సెస్ గడ్కరీ కథనం, ఇటు గడ్కరీపై టీఆర్ఎస్ పొగడ్తలు, కేసీఆర్ సర్కారుకు గడ్కరీ కితాబు పరిణామాలు కొత్త చర్చకు దారితీశాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Hyderabad, Minister prashanth reddy, Nitin Gadkari, Telangana, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు