హోమ్ /వార్తలు /telangana /

BJP vs TRS : తెలంగాణలో రాబోయేది బీజేపీ పాలనే .. పసుపు రైతులకు మేలు చేస్తుంది మేమే: పాండే

BJP vs TRS : తెలంగాణలో రాబోయేది బీజేపీ పాలనే .. పసుపు రైతులకు మేలు చేస్తుంది మేమే: పాండే

( రాష్ట్రంలో రాబోయేది బీజేపీనే)

( రాష్ట్రంలో రాబోయేది బీజేపీనే)

BJP vs TRS : సామాన్యుల సంక్షేమం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోంద‌ని కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మ‌హేంద్ర‌నాథ్ పాండే అన్నారు.  రైతుల కోసం కేంద్రం అనేక పథకాలు చేపట్టిందన్న ఆయన  పసుపు రైతుల కోసం మాజీ ఎంపీ కవిత ఏనాడూ కేంద్రంతో మాట్లాడలేదని నిజామాబాజ్ జిల్లా పర్యటనలో స్పష్టం చేశారు.

ఇంకా చదవండి ...

  (P.Mahendar,News18,Nizamabad)

  నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో  కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సమావేశం నిర్వ‌హించారు.  ఈ కార్య‌క్ర‌మానికి  ముఖ్య అతిథిగా కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే, నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ హ‌జ‌ర‌య్యారు. జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన కేంద్ర మంత్రి మహేంద్రనాథ్‌ పాండే మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప‌సుపు రైతుల గురించి ఏనాడు కేంద్రంతో మాట్లాడాలేదన్నారు. పసుపు రైతులకు అన్ని వసతులు అర్వింద్ ఎంపీ అయిన తర్వాతే చేకూర్చినట్లుగా తెలిపారాయన. పసుపు రైతులను ఆర్థికంగా ఎదిగేలా  ఎంపీ అర్వింద్ కేంద్రంతో కొట్లాడుతున్నారన్నారు. పసుపు రైతులకు గతంకంటే మంచి ధరలు వస్తున్నాయంటే కారణం కేంద్రం తీసుకున్న నిర్ణయాలే అందుకు కారణమన్నారు మంత్రి. పసుపు దిగుమతులు నిలిపివేసి..  ఎగుమతులు పెంచామన్నారు. దాని ఫలితంగానే రైతులను ఆర్థికంగా ఎదిగేలా చేసామ‌న్నారు.

  ఇది చదవండి : అడవుల్లోకి వెళ్లేవాళ్లని అరెస్ట్ చేసిన పోలీసులు .. వాళ్లెందుకెళ్తున్నారంటే


  టీఆర్ఎస్‌ చేస్తోంది తప్పుడు ప్రచారం..

  నిజాంలకు వ్యతిరేకంగా దాశరథి పలికిన నా తెలంగాణ కోటి రతనాల వీణ నినాదంతో ఎందరో తెలంగాణ అమర వీరుల త్యాగాలతో ప్రత్యేక తెలంగాణ  రాష్ట్రం సాకారమైదన్నారు కేంద్రమంత్రి మహేంద్రనాథ్‌ పాండే.  తెలంగాణకి కేంద్రం నుంచి రావాల్సిన నిదులు ఇచ్చినా ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తోంది టీఆర్‌ఎస్‌ పార్టీపై విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వ పన్ను తగ్గిస్తే ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వమని ...కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మన్ భారత్, కిసాన్ సమ్మాన్ పథకాలను తెలంగాణ సర్కార్ విస్మరించిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది బీజేపీయే అన్న మంత్రి తెలంగాణలో ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. మోదీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అంకితమని..కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని పాండే పిలుపు నిచ్చారు.

  మోదీది ప్రజాసంక్షేమ పాలన..

  గత 8 ఏళ్లలో ప్రధాని మోదీ దేశంలో సామాన్యులకు లబ్ది చేకూర్చేలా పాలన చేశారని చెప్పుకొచ్చారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. మోదీ పాలనను ప్రపంచ దేశాల్లో ప్రజలు, అధినేతలు కీర్తిస్తున్నారని చెప్పారు. కోవిడ్ తో ప్రపంచం అతలాకుతలం అవుతుంటే దేశ ప్రజలకు ఉచితంగా భోజనం అందించిన ఘనత ప్రధాని మోదీది అని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ స్కీమ్ ఆయుష్మన్ భారత్ అని గుర్తు చేశారు బీజేపీ ఎంపీ. కల్వకుంట్ల కుటుంబానికి బుద్ధి చెప్పిన ఘనత ఇందూరు ఓటర్లదన్నారు అర్వింద్. సీఎం కూతురు కవిత 5 ఏళ్ళు ఎంపీగా ఉండి నియోజకవర్గానికి చేసిందేమి లేదన్నారు. ఐదేళ్లలో పసుపు పేరుతో దేశ వ్యాప్తంగాల రాజకీయం చేశారని కాని పసుపు రైతులను ఆదుకునేందుకు బీజేపీనే ప్రయత్నిస్తోందన్నారు. స్పైస్ పార్క్ ఏర్పాటు పేరుతో భూ సేకరణ చేసి, కాంపౌండ్ కట్టి వదిలేశారు. ఎంపీగా ఓడిపోయిన కవితకి బుద్ధి రాలేదన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి పోలీసుల సాయంతో గ్రామాల్లో తిరిగే స్థితికి దిగజారిపోయారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై తీవ్రవిమర్శలు చేశారు బీజేపీ ఎంపీ అర్వింద్.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Bjp, Kalvakuntla Kavitha, Nizamabad

  ఉత్తమ కథలు