Home /News /telangana /

TS POLITICS NEW DISCUSSION IN TELANGANA CONGRESS PARTY AFTER JOINING OF TRS EX MLA NALLALA ODELU AK

T Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ రూల్స్ పట్టించుకోవడం లేదా ?..మళ్లీ అలాగే జరుగుతోందా ?

రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు (ఫైల్ ఫోటో)

రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు (ఫైల్ ఫోటో)

Telangana Congress: రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్సింహతో కలిసి ఢిల్లీ వెళ్లిన ఓదెలు కుటుంబం...ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది.

    రాజకీయాల్లో కాంగ్రెస్ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని ఆ పార్టీ నేతలు గొప్పగా చెబుతుంటారు. అదే తమ పార్టీకి అనేకసార్లు నష్టం చేకూర్చుతుందనే వారే వాపోతుంటారు. తెలంగాణలో కాంగ్రెస్ (Congress) పార్టీని మరోసారి క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు శ్రమిస్తున్న ఆ పార్టీ నాయకత్వం.. ఇందుకోసం కొన్ని నిబంధనలు, కమిటీలు ఏర్పాటు చేసుకుంది. అందులో చేరికల కోసం సీనియర్ నేత జానారెడ్డి (Janareddy) సారథ్యంలో ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఉంది. అయితే ఇటీవల ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు విషయంలో ఈ కమిటీలు, నిబంధనల అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం పెద్దగా పట్టించుకోలేదనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

    రేవంత్ రెడ్డి, (Revanth Reddy) దామోదర రాజనర్సింహతో కలిసి ఢిల్లీ వెళ్లిన ఓదెలు కుటుంబం...ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది. అయితే వీరి చేరికకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో చాలామందికి పెద్దగా సమాచారం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన ఓదెలు చేరిక గురించి.. అదే జిల్లాకు చెందిన సీనియర్ నేత ప్రేమ్‌సాగర్‌రావుకు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ విషయమై ఆయన పార్టీ నాయకత్వం దగ్గర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.

    మరోవైపు జానారెడ్డి సారథ్యంలో చేరికల కోసం ఏర్పాటు చేసిన కమిటీలో నల్లాల ఓదెలు చేరికపై చర్చించారా ? అన్నది కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకోసం వేసిన కమిటీలోనే ఈ అంశాన్ని చర్చించకపోతే.. ఇలాంటి కమిటీలు ఎందుకనే వాదన కూడా మొదలైంది. మరోవైపు చేరికల విషయంలో అన్నిసార్లు ఒకేలా ముందుకు వెళ్లడం కుదరదని పార్టీలోని రేవంత్ రెడ్డి అనుకూల వర్గం వాదనగా కనిపిస్తోంది.

    Telangana| KCR: కేసీఆర్ వ్యూహం.. బీజేపీని టార్గెట్ చేస్తే.. కాంగ్రెస్‌ కూడా ఇరుక్కుపోతుందా ?

    Telanagna| BJP: తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్ బంపర్ ఆఫర్.. త్వరలోనే కీలక పదవి ?

    కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుని నేతలను పార్టీలోకి తీసుకోవడానికి చాలా సమయం పడుతుందని.. ఆలోగా పరిణామాలు ఎలాగైనా మారిపోవచ్చన్నది వారి అభిప్రాయం. అందుకే కొన్నిసార్లు ఈ రకమైన నిర్ణయాలు ఇలా తీసుకోవడమే మంచిదనే చర్చ కూడా సాగుతోంది. అయితే ప్రియాంక గాంధీ సమక్షంలో చేరిక జరగడంతో.. చాలామంది నేతలు ఈ అంశంపై మాట్లాడటం లేదని.. అయినా దీనిపై ఎప్పుడో ఒకప్పుడు మళ్లీ చర్చ జరగడం ఖాయమనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో సాగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు