హోమ్ /వార్తలు /తెలంగాణ /

T Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో కమిటీల రచ్చ.. ముఖ్యనేత కీలక వ్యాఖ్యలు

T Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో కమిటీల రచ్చ.. ముఖ్యనేత కీలక వ్యాఖ్యలు

గాంధీ భవన్ (ఫైల్ ఫోటో)

గాంధీ భవన్ (ఫైల్ ఫోటో)

TPCC: ఈ కమిటీ టీఆర్ఎస్, బీజేపీని ఎదుర్కోవడం మాట అటుంచితే.. కాంగ్రెస్ పార్టీలోనే కొత్త పంచాయతీలకు కారణమవుతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని అధికార టీఆర్ఎస్, మరో ప్రధాన రాజకీయ పార్టీ బీజేపీని ఎదుర్కొనేందుకు కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) చైర్మన్‌గా 40 మందితో ఎగ్జిక్యూటీవ్ కమిటీని, 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ప్రకటించింది. అలాగే నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను పీఏసీ ప్రత్యేక ఆహ్వానితులుగా పేర్కొన్నది. 26 జిల్లాల డీసీసీ అధ్యక్షులను, 24 మంది వైస్ ప్రెసిడెంట్లు, 84 మంది ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో అనేక మంది నేతలకు చోటు కల్పించింది. అయితే ఈ కమిటీ కూర్పు తెలంగాణ కాంగ్రెస్‌లో(Telangana Congress) కొత్త రచ్చకు కారణమవుతోంది. ఈ కమిటీలో చోటు దక్కని నేతలు ఓ వైపు, కమిటీలో తమకు సరైన స్థానం దక్కలేదని మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఈ జాబితాలో ఉన్నారు.

ఇంకా అనేకమంది నేతలు కూడా తమకు కమిటీలో లభించిన చోటు విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఈ కమిటీ టీఆర్ఎస్ , బీజేపీని ఎదుర్కోవడం మాట అటుంచితే.. కాంగ్రెస్ పార్టీలోనే కొత్త పంచాయతీలకు కారణమవుతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. తాజాగా ఈ కమిటీ కూర్పుపై తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. కమిటీ కూర్పు కోసం తనను కూడా సంప్రదించలేదన్నారు. పార్టీకి పీసీసీ చీఫ్, సీఎల్పీ నేత ఇద్దరూ ముఖ్యమేనని పేర్కొన్నారు.

కేసీఆర్ BRS పార్టీకి మద్దతుపై సజ్జల కీలక వ్యాఖ్యలు..ఇతర రాష్ట్రాల్లో వైసీపీ పోటీపై క్లారిటీ

Supreme Court: ఎమ్మెల్సీ అనంతబాబుకు భారీ ఊరట..బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

కమిటీల ఏర్పాటులో తనను ఎందుకు సంప్రదించలేదో తెలియదన్నారు. కాగా పార్టీ పదవుల పట్ల అసంతృప్తి ఉందని పలువురు నేతలు తనను కలిశారని చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పానని తెలిపారు. పార్టీ పదవులపై సీనియర్ నేతల్లోనూ అసంతృప్తి ఉందన్నారు. ఈసారి ఎలాంటి కసరత్తు చేయకుండా పీసీసీ కమిటీలను ప్రకటించారని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ BRS పార్టీకి మద్దతుపై సజ్జల కీలక వ్యాఖ్యలు..ఇతర రాష్ట్రాల్లో వైసీపీ పోటీపై క్లారిటీ

Supreme Court: ఎమ్మెల్సీ అనంతబాబుకు భారీ ఊరట..బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

స్వయంగా భట్టి విక్రమార్క ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంతో.. ఈ రచ్చ ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ కమిటీ కూర్పు విషయంలో తనను సంప్రదించలేదని భట్టి చెప్పడంతో.. రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగానే ఈ కమిటీ కూర్పు ఉందనే ప్రచారానికి మరింత ఊతమిస్తోంది. మొత్తానికి ప్రత్యర్థి పార్టీలతో పోరాడేందుకు ఏర్పాటైన కాంగ్రెస్ కమిటీలు.. అందుకు తగ్గట్టుగా సమాయత్తమయ్యేందుకు ఎంత సమయం పడుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

First published:

Tags: Bhatti Vikramarka, Congress, Revanth Reddy

ఉత్తమ కథలు