తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana Cm Kcr) ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi Chief Minister Arvind Kejriwal)తో భేటీ అయ్యారు. ఉత్తర భారతదేశ పర్యటనలో ఉన్న కేసీఆర్..ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేటి ఉదయం 11:30 గంటలకు, 6 ఫ్లాగ్ స్టాఫ్ మార్గ్, సివిల్ లైన్స్ లోగల ఢిల్లీ సీఎం నివాసంలో లంచ్ (Lunch) కార్యక్రమానికి వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి ఉన్నారు. కేసీఆర్‌కు తన నివాసంలో స్వాగతం పలికిన కేజ్రీవాల్.. శాలువతో సత్కరించారు. ఇరువురు నేతలు కలిసి భోజనం చేయనున్నారు. ఈ భేటీ సందర్భంగా జాతీయ రాజకీయాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రతిపక్షాల ఉమ్మడి ఐక్య వేదిక సమాఖ్య స్ఫూర్తి, దేశ ప్రగతిలో రాష్ట్రాల పాత్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరి కలయిక దేశ రాజకీయాల్లో కొత్త పొత్తులకు (New alliances) అవకాశం కల్పించే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భేటీ అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు కలిసి చండీగఢ్ (Chandigarh) వెళ్లనున్నారు. అక్కడ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి రైతు ఉద్యమంలో మరణించిన కుటుంబాలను కేసీఆర్ పరామర్శించనున్నారు. 600 మంది రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నారు. చండీగఢ్‌లోని ఠాగూర్ థియేటర్లో జరగనున్న ఈ కార్యక్రమంలో బాధిత రైతు కుటుంబాలతో పాటు స్థానిక నేతలు హాజరుకానున్నారు.
ఈ నెల 30 వరకు వివిధ రాష్ట్రాల్లో..
దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని పదేపదే చెబుతున్న కేసీఆర్.. ఈ నెల 30 వరకు వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇందుకోసం శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ 9CM KCR) హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. కేసీఆర్ వెంట ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ఉన్నారు. చంఢీగడ్‌లో పర్యటన అనంతరం కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్లలో కూడా సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలతో సీఎం చర్చలు జరపనున్నారు.
అంతకుముందు (శనివారం) ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో (akhilesh yadav) కేసీఆర్ భేటీ అయ్యారు. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు ప్రధానంగా ఈ భేటీలో చర్చకు రానున్నాయి. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. అలాగే దేశానికి ప్రత్యామ్నాయ కూటమి వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో కలిసి పనిచేసే అంశంపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aravind Kejriwal, CM KCR, Delhi