TS POLITICS NETIZENS COMMENTING ON ETELA RAJENDER NAME AS HEALTH MINISTER ON THE HYDERABAD GANDHI HOSPITAL WEBSITE SNR
Gandhi Hospital:ఇప్పటికీ ఆయనే మంత్రి అంట..వాళ్లు ఎప్పటికి అప్డేట్ అవుతారో ఏంటో
(అప్డేట్ అవ్వండి)
Hyderabad:తెలంగాణ హెల్త్ మినిస్టర్‌గా మాజీ పేరునే కొనసాగిస్తున్నారు గాంధీ ఆసుపత్రి అధికారులు. హాస్పిటల్ అధికారిక వెబ్సైట్లో వైద్య, ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్ అని చూపిస్తోంది. ఈవిషయాన్ని వెబ్సైట్లో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. మంత్రి పేరు మార్చే కాళీ కూడా లేదా అని సెటైర్లు వేస్తున్నారు.
తెలంగాణ(Telangana) వైద్య, ఆరోగ్యశాఖ అధికారులే కాదు..సాక్షాత్తు సర్కారు దవఖాన ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగులు మొదలుకొని నిర్వాహణ చూసే వాళ్లు సైతం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోగులకు సకాలంలో వైద్యసేవలందించడంపై ఇప్పటికే విమర్శలు మూటగట్టుకుంటున్నారు హైదరాబాద్(Hyderabad)లోని గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital) వైద్య, సిబ్బంది. ఇక రాష్ట్రానికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి(Minister of Health)ఎవరనే విషయాన్ని కూడా తమ అధికారిక వెబ్సైట్(Website)లో అప్డేట్ చేయకపోవడంపై మరింత విమర్శలపాలవుతున్నారు. గాంధీ జనరల్ ఆసుపత్రి అధికారిక వెబ్ సైట్లో ఇప్పటికి తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender)అని చూపిస్తోంది. ఈటల మంత్రి పదవినే కాదు ఎమ్మెల్యే, టీఆర్ఎస్(Trs) పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి దాదాపు ఏడాది గడుస్తోంది. అంటే సంవత్సర కాలంగా ఓ ప్రభుత్వ ఆసుపత్రి అధికారిక వెబ్‌సైట్‌ని పట్టించుకోలేనంత సుప్తావస్థనలో ఉన్నారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొంతకాలం ఆ శాఖ సీఎం పరిధిలోనే ఉన్నప్పటికి తర్వాత ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌రావు(Harishrao)కు అప్పగించారు సీఎం కేసీఆర్. ఇది జరిగి కూడ నెలలు గడుస్తోంది.
ఇంత నిర్లక్ష్యమా..
హరీష్‌రావు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నోసార్లు నూతన ఆసుపత్రులకు శంకుస్థాపన చేశారు. పలు దవఖానాల్లో మౌలిక వసతులు, అత్యాధునిక వైద్యపరికాలను ప్రారంభించారు. ఇంత జరుగుతుంటే రాష్ట్ర ప్రజలకు అతి పెద్ద ఆసుపత్రిగా ఉన్న గాంధీ హాస్పిటల్ వెబ్సైట్లో మంత్రి పేరు మార్చకపోవడం ఏమిటని పలువురు మండిపడుతున్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి అధికారిక వెబ్సైట్లో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఇప్పటికి ఈటల రాజేందరే కొనసాగుతున్నట్లుగా ఉంది. ఆసుపత్రిలో బెడ్స్ మారవు. రోగులకు మెరుగైన ట్రీట్మెంట్ అందించరు. మందులు సరిగా ఉండవనే విమర్శలతో పాటు ఇప్పుడు ఏకంగా రాష్ట్ర హెల్త్ మినిస్టర్ పేరును కూడా మార్చే పనిలేదా అంటున్నారు. మంత్రి పదవి వదిలిన మాజీ పేరును ఎలా కొనసాగిస్తారనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
ఇప్పటికైనా మార్చేనా..
మంత్రి పేరుతో పాటే గాంధీ ఆసుపత్రి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌గా ఏ శాంతికుమారి, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా ప్రకాష్‌రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డా శ్రావణ్‌కుమార్ కొనసాగుతున్నట్లుగా ఆన్లైన్లో కనిపిస్తోంది. దీంతో వెబ్సైట్ ఓపెన్ చేసి చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. సర్కారు ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తరహాలోనే వెబ్సైట్ అప్డేట్ ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు. గాంధీ ఆసుపత్రి అధికారులు ఇప్పటికైనా మాజీ పేరును తొలగించి..కొత్త మంత్రి పేరు పెడతారా లేక మంత్రి చివాట్లు పెట్టే వరకు అలాగే నిద్రావస్థలో ఉంటారా అని సోషల్ మీడియా ఫాలోవర్స్ సూటిగా చురకలంటిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.