హోమ్ /వార్తలు /తెలంగాణ /

Breaking: వైఎస్‌ షర్మిలను అరెస్ట్ చేసిన నర్సంపేట పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం

Breaking: వైఎస్‌ షర్మిలను అరెస్ట్ చేసిన నర్సంపేట పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

YS Sharmila Arrest: తమపై దాడులకు పాల్పడిన వారిని వదిలేసిన తమను అరెస్ట్ చేయడంపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిలను నర్సంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సంపేటలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై(Peddi Sudharshan Reddy) షర్మిల (YS Sharmila) చేసిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. షర్మిల ప్రచారం రథానికి నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు వైఎస్ షర్మిలను అరెస్ట్ చేశారు. అయితే తమపై దాడులకు పాల్పడిన వారిని వదిలేసిన తమను అరెస్ట్ చేయడంపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. వైయస్ షర్మిల ఉమ్మడి వరంగల్ జిల్లా లింగగిరి గ్రామంలో పాదయాత్ర (Padayatra) చేస్తుండగా.. ఆమె రెస్ట్ తీసుకునే బస్సుపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశారు. ఆ బస్సుపై కిరోసిన్ పోసి బస్సును కాల్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.

బస్సు తగలబెట్టే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గకుండా షర్మిల పాదయాత్ర చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో షర్మిల గో బ్యాక్ అంటూ టిఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్ కీలక నేతలు ఈ దురాగతానికి పాల్పడ్డారని షర్మిల మండిపడ్డారు. తమపై దాడికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారా ? అని ఆమె ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన వారిని మీడియా ముందు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనకు పాల్పడింది స్థానిక ఎమ్మెల్యే అనుచరులని షర్మిల ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాదయాత్ర సాగుతున్న నేపథ్యంలో ఏవో ఇబ్బందులు ఉన్నాయని కావాలని ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. శాంతి భద్రతల సమస్య ఉందని చెప్పి తన పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

Bandi Sanjay : బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి...

Mulugu: మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్ట్.. బిక్కుబిక్కుమంటున్న ఏజెన్సీ

అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. చేతకాని ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్ లోనే ఉన్నారని అన్నారు. పేరులోనే పెద్ది..ఆయనది చిన్న బుద్ధి అని విమర్శించారు. ఈ నియోజకవర్గంలో రాళ్ల వాన పడి 20 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఆదుకొనే పరిస్థితి లేదని ఆరోపించారు. 15 రోజుల్లో పరిహారం ఇస్తానని చెప్పి సుదర్శన్ రెడ్డి మోసం చేశారని షర్మిల ఆరోపించారు. ప్రజలు గెలిపించారన్న కృతజ్ఞత కూడా స్థానిక ఎమ్మెల్యేకు లేదని విమర్శించారు. అభివృద్ధి చేయని ఈ ఎమ్మెల్యే ఎందుకని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు కర్రు కాల్చి వాత పెట్టాలని ఓటర్లకు సూచించారు.

First published:

Tags: Telangana, YS Sharmila

ఉత్తమ కథలు