మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ల తుది గడువు సమీపిస్తోంది. ఈ రోజు టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన నామినేషన్ను దాఖలు చేశారు. మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి వెంట రాగా.. కూసుకుంట్ల తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మొత్తం ఆస్తుల విలువ రూ. 7. 68 కోట్లు. ఇందులో 3.89 కోట్ల స్థిరాస్తులు కాగా.. 3.79 కోట్ల చరాస్థులు ఉన్నాయి. ఇక ఆయన భార్య అరుణ రెడ్డి పేరు మీద మొత్తం రూ. 6.10 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వాటిలో రూ. 3.84 కోట్లు స్థిరాస్తి కాగా..రూ. 2.26 కోట్లు చరాస్థులు ఉన్నాయి. ఇక తనకు రూ. కోటి 78 లక్షల అప్పులు ఉన్నాయని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అఫిడవిట్లో పేర్కొన్నారు. తన భార్య అరుణ రెడ్డికి రూ. 22.95 లక్షల అప్పులు ఉన్నాయని అఫిడవిట్లో ప్రస్తావించారు.
ఇక రెండు రోజుల క్రితం బీజేపీ తరపున మునుగోడులో పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ లో భాగంగా రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో తెలిపారు. ఈ అఫిడవిట్ ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఆస్తుల విలువ రూ.222.67 కోట్లుగా తేలింది. ఆయన సతీమణి ఆస్తుల విలువ రూ.52.44 కోట్లుగా ఉన్నట్టు వెల్లడించారు. ఈ ఆస్తుల్లో స్థిరాస్తుల విలువ రూ.152.69 కోట్లు కాగా..చరాస్తుల విలువ రూ.69.97 కోట్లుగా ఆయన పేర్కొన్నారు. కాగా తనకు రూ.61.5 కోట్లు అప్పులుగా ఉన్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే 2018 అఫిడవిట్ లో ఆయన ఆస్తులు కేవలం 24.5 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. 2018 నుంచి 2022 వరకు రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఆస్తులు ఏకంగా 200 కోట్ల రూపాయలు పెరిగితే..ఆయన భార్య లక్ష్మి ఆస్తులు మాత్రం 240 కోట్లు తగ్గిపోయాయి.
మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ ఇలా..
అక్టోబర్ 14వ తేది నామినేషన్ల స్వీకరణకు చివరి గడువు ఇచ్చింది ఎన్నికల సంఘం. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 17వ తేది వరకు గడువు ఉంది. ఇక ఉపఎన్నిక పోలింగ్ నవంబర్ 3న(November 3) ఉండగా కౌంటింగ్ 6వ (November6)తేదిన నిర్వహించనున్నట్లుగా ఎన్నికల సంఘం(Election Commission) వెల్లడించింది.
తెలంగాణలో నిర్వహించబోయే మునుగోడు ఉపఎన్నికను ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బరిలో దిగుతుండగా ...కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి పోటీలో నిలిచారు. ఇక తెలంగాణలో అధికార పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఖరారు చేసింది.
Rahul Gandhi: తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు.. మొత్తం ఎన్ని కిలోమీటర్లంటే..
KTR-Munugodu: కేటీఆర్కు మునుగోడు సవాల్.. చాలా గ్యాప్ తరువాత మళ్లీ రంగంలోకి..
ఇక మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్, బిహార్ లోని మొకామా, గోపాల్ గంజ్, హర్యానాలోని అదంపూర్, ఉత్తర్ ప్రదేశ్ లోని గోలాగోక్రన్నత్, ఒడిషాలోని ధామ్ నగర్ సెగ్మెంట్లకు కూడా మునుగోడుతో పాటే నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. ఈ ఏడు స్థానాల కౌంటింగ్ నవంబర్ 6న జరగనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Munugodu By Election, Telangana